English | Telugu
'శంకరాభరణం' ఎడిటర్ కృష్ణారావు కన్నుమూత!
Updated : Feb 21, 2023
సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా ప్రముఖ ఎడిటర్ జి.జి. కృష్ణారావు(87) కన్నుమూశారు. 200 పైగా చిత్రాలకు ఎడిటర్ గా పనిచేసిన ఆయన మంగళవారం బెంగళూరులోని ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. కె. విశ్వనాథ్, దాసరి నారాయణరావు, బాపు, జంధ్యాల వంటి ప్రముఖ దర్శకుల చిత్రాలకు ఎడిటర్ గా పనిచేసిన ఆయన ఉత్తమ ఎడిటర్ గా మూడుసార్లు నంది అవార్డు అందుకున్నారు. 'సప్తపది', 'సాగర సంగమం', 'శుభసంకల్పం' సినిమాలకు ఆయన నంది అవార్డులు అందుకోగా.. ఆ మూడు చిత్రాలకుకె.విశ్వనాథ్ దర్శకుడు కావడం విశేషం.
పూర్ణోదయ, విజయ మాధవి ప్రొడక్షన్స్ వంటి బ్యానర్లలో ఎడిటర్ జి.జి. కృష్ణారావు ఎన్నో చిత్రాలకు పనిచేశారు. ఆయన ఎడిటర్ గా పని చేసిన సినిమాల్లో 'శంకరాభరణం', 'సాగర సంగమం', 'స్వాతిముత్యం', 'శుభలేఖ', 'బొబ్బిలిపులి', 'సర్దార్ పాపారాయుడు', 'శ్రుతిలయలు', 'నాలుగు స్తంభాలాట', 'సిరివెన్నెల', 'సప్తపది', 'శుభసంకల్పం', 'స్వరాభిషేకం', 'శ్రీరామరాజ్యం' వంటి ఎన్నో క్లాసిక్ సినిమాలు ఉన్నాయి.