English | Telugu
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల్లో సత్తా చాటిన 'ఆర్ఆర్ఆర్', 'కాశ్మీర్ ఫైల్స్'!
Updated : Feb 21, 2023
దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్- 2023 వేడుకలు సోమవారం సాయంత్రం ముంబైలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో 2022కి గాను భారతీయ చిత్రాలకు పలు విభాగాల్లో అవార్డులు అందించారు. అవార్డు అందుకున్న చిత్రాలలో 'ఆర్ఆర్ఆర్' కూడా ఉండటం విశేషం.
2022కి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులలో ఉత్తమ చిత్రంగా 'ది కాశ్మీర్ ఫైల్స్' నిలవగా, ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ గా 'ఆర్ఆర్ఆర్' నిలిచింది. ఉత్తమ నటీనటులుగా భార్యాభర్తలు రణబీర్ కపూర్, ఆలియా భట్ అవార్డులు అందుకోవడం విశేషం. 'బ్రహ్మాస్త్ర' చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా రణబీర్ కపూర్, 'గంగూబాయి కతియావాడి' చిత్రానికి గాను ఉత్తమ నటిగా ఆలియా భట్ అవార్డులు అందుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా ఆర్.బల్కీ(చుప్), మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ గా రిషబ్ శెట్టి(కాంతార), క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ గా వరుణ్ ధావన్(బేడియా), క్రిటిక్స్ బెస్ట్ యాక్ట్రెస్ గా విద్యా బాలన్(జల్సా), మోస్ట్ వెర్సటైల్ యాక్టర్ గా అనుపమ్ ఖేర్ అవార్డులు గెలుచుకున్న వారిలో ఉన్నారు.