English | Telugu
రాజమౌళి సినిమా.. మహేష్‌కు ఎదురుదెబ్బ!
Updated : Feb 21, 2023
ప్రస్తుతం మహేష్ బాబు మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి28 చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతోంది. ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ బేనర్‌లో కేవలం త్రివిక్రమ్ తో సినిమాలు మాత్రమే వస్తాయి. ఈ ప్రొడక్షన్ హౌస్ తోపాటు సితార ఎంటర్టైన్మెంట్స్ లో కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక భాగం నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. అయితే అతను స్లీపింగ్ పార్ట్నర్ గా ఉంటున్నారు. కాగా ఇటీవల మహేష్ బాబు చేస్తున్న ప్రతి సినిమాకి రెమ్యూనరేషన్‌తో పాటు నిర్మాణ భాగస్వామ్యం కూడా తీసుకుంటున్నారు. దీని ద్వారా ప్రాఫిట్‌లో షేర్ తీసుకుంటున్నారు. ఇలా రెమ్యూనరేషన్ అండ్ షేర్ ప్రాఫిట్ తో కలిసి మహేష్ బాబుకి ఒక్కో సినిమాకి 100 కోట్లకు పైగానే గిట్టుబాటు అవుతుంది.
త్రివిక్రమ సినిమా కూడా అలాగే చేద్దామని భావించారు. కానీ ఇప్పటికే రాదాకృష్ణ, త్రివిక్రమ్‌లు బాగస్వామిగా ఉన్నారు. మూడో వాటా అంటే కష్టమేనని తెలుస్తోంది. మహేష్ మాత్రం తన గత చిత్రాలలాగా ఈమూవీలో కూడా రెమ్యూనరేషన్, లాభాలలో వాటా కోసం ఆశపడుతున్నారు. అలాగే చేద్దామనుకున్నా కూడా మాటలు మాంత్రికుడు అవకాశం ఇవ్వలేదు. దాంతో కేవలం 70 కోట్ల రెమ్యూనరేషన్‌కి మహేష్‌ను పరిమితం చేశారు. దీని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటించనున్నారు. దీనికి నారాయణ నిర్మాత. రాజమౌళి సినిమా అంటే పెట్టిన పెట్టుబడికి రెండు నుంచి మూడు రెట్లు అధికంగా లాభాలు వస్తాయి.
ఇలాంటి టైంలో షేర్ ప్రాఫిట్ ను మహేష్ బాబుకి ఇస్తే చాలా అమౌంట్ నిర్మాత నష్టపోవాల్సి వస్తుంది. దాంతో కేవలం 100 కోట్ల రెమ్యూనేషన్‌ను మహేష్ బాబుని ఫిక్స్ చేశారట. లాభాలతో ఆయనకు సంబందం లేదని, వాటిల్లో ఆయనకు భాగం లేదని తెలుస్తోంది. రాజమౌళి చిత్రం కోసం 350 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. క్యాస్టింగ్ కోసమే 150 కోట్లు ఖర్చు అవుతుందని, జక్కన్న ఫ్యామిలీ రెమ్యూనరేషన్ రూపంలోనే కేఎల్ నారాయణ 200 కోట్ల వరకు ఈ సినిమాకు ఖర్చు పెడుతున్నాడట. ఈ విధంగా చూసుకుంటే 350 కోట్ల బడ్జెట్ తో మహేష్ బాబు సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా ఈ రెండు సినిమాల విషయంలో మహేష్ కి హ్యాండ్ ఇచ్చారని మాట వినిపిస్తోంది.