English | Telugu
నేటితో 'దసరా' సత్తా తేలిపోనుంది!
Updated : Apr 3, 2023
నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ 'దసరా' బ్రేక్ ఈవెన్ కి చేరువైంది. రూ.48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ నాలుగు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.47 కోట్లకు పైగా షేర్ రాబట్టి సత్తా చాటింది. దీంతో నాని కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇప్పటిదాకా నాని కెరీర్ లో రూ.40 కోట్ల షేర్ తో 'MCA'(మిడిల్ క్లాస్ అబ్బాయి) మూవీ టాప్ లో ఉండగా.. ఇప్పుడు 'దసరా' సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే రికార్డు కలెక్షన్స్ తో టాప్ ప్లేస్ లోకి వచ్చింది. నేడో రేపో రూ.50 కోట్ల షేర్ మార్క్ ని కూడా అందుకోనుంది.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.14.22 కోట్ల షేర్, రెండో రోజు రూ.5.86 కోట్ల షేర్, మూడో రోజు రూ.6.73 కోట్ల షేర్ వసూలు చేసిన దసరా.. నాలుగో రోజు కూడా రూ.6.72 కోట్ల షేర్ తో అదే జోరు కొనసాగించింది. ఏరియాల వారీగా చూస్తే నైజాంలో రూ.18.32 కోట్ల షేర్(రూ.13.70 కోట్ల బిజినెస్), సీడెడ్ లో రూ.4.65 కోట్ల షేర్(రూ.6.50 కోట్ల బిజినెస్), ఆంధ్రాలో రూ.10.56 కోట్ల షేర్(రూ.14.45 కోట్ల బిజినెస్) గా ఉన్నాయి. నైజాంలో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించిన దసరా.. ఫుల్ రన్ లో అక్కడ రూ.25 కోట్ల షేర్ రాబట్టినా ఆశ్చర్యంలేదు. సీడెడ్, ఆంధ్రాలో మాత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ సాధించాల్సి ఉంది. మొత్తానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి నాలుగు రోజుల్లో రూ.33.53 కోట్ల షేర్(రూ.56.50 కోట్ల గ్రాస్) రాబట్టింది. ఇక కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియా రూ.6.25 కోట్ల షేర్, ఓవర్సీస్ రూ.7.35 కోట్ల షేర్ కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం నాలుగు రోజుల్లో రూ.47.13 కోట్ల షేర్(రూ.84 కోట్ల గ్రాస్) సాధించింది.
ఓవరాల్ గా రూ.48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ మొదటి రోజు నుంచే వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.21 కోట్ల షేర్ రాబట్టి సంచలనం సృష్టించిన ఈ చిత్రం.. రెండో రోజు రూ.8.08 కోట్ల షేర్, మూడో రోజు రూ.9.18 కోట్ల షేర్, నాలుగో రోజు రూ.8.87 కోట్ల షేర్ తో సత్తా చాటింది. నాలుగు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.47 కోట్లకు పైగా షేర్ సాధించిన ఈ చిత్రం నేడు బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశముంది. అదే సమయంలో వీకెండ్ ముగియడంతో నేటి నుంచి వసూళ్ళ జోరుకి కాస్త బ్రేక్ లు పడే అవకాశముంది. నేటి నుంచి కలెక్షన్స్ లో పెద్దగా డ్రాప్స్ లేకపోతే మాత్రం.. ఈ సినిమా ఫుల్ రన్ లో రూ.65-70 కోట్ల షేర్ రాబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.