English | Telugu
మెగాస్టార్ మూవీకి పోటీగా 'డీజే టిల్లు-2'!
Updated : Apr 2, 2023
యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన 'డీజే టిల్లు' సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రం గతేడాది ఫిబ్రవరిలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని ఘన విజయం సాధించింది. సిద్ధు హీరోగా సితార బ్యానర్ లోనే ఇప్పుడు ఈ చిత్రానికి 'టిల్లు స్క్వేర్' పేరుతో సీక్వెల్ తెరకెక్కుతోంది. అయితే ఈ సీక్వెల్ మెగాస్టార్ చిరంజీవి మూవీకి పోటీగా విడుదల కానుందని న్యూస్ వినిపిస్తోంది.
చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'భోళా శంకర్'. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, కీర్తి సురేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమిళ సినిమా 'వేదాళం'కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 11న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఇదే తేదీపై టిల్లు కన్నేసినట్లు తెలుస్తోంది. 'డీజే టిల్లు-2'ని ఆగస్టు 11న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాల్సి ఉంది.