రవితేజ 'రావణాసుర' రీమేక్ సినిమానా!
మాస్ మహారాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'రావణాసుర'. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.