English | Telugu
'దసరా' కలెక్షన్ల జోరు.. అయినా అక్కడ నష్టాలు తప్పవా!
Updated : Apr 2, 2023
నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ 'దసరా' బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల జోరు చూపిస్తోంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.21 కోట్ల షేర్ రాబట్టి సంచలనం సృష్టించిన ఈ మూవీ.. రెండో రోజు రూ.8.08 కోట్ల షేర్, మూడో రోజు రూ.9.18 కోట్ల షేర్ తో సత్తా చాటింది. దీంతో ఈ చిత్రం మూడు రోజుల్లోనే రూ.38 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.14.22 కోట్ల షేర్, రెండో రోజు రూ.5.86 కోట్ల షేర్, మూడో రోజు రూ.6.73 కోట్ల షేర్ వసూలు చేసిన దసరా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి మూడు రోజుల్లో రూ.26.81 కోట్ల షేర్(రూ.45.50 కోట్ల గ్రాస్) రాబట్టింది. ఇక కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియా రూ.4.75 కోట్ల షేర్, ఓవర్సీస్ రూ.6.70 కోట్ల షేర్ కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మూడు రోజుల్లో రూ.38.26 కోట్ల షేర్(రూ.68.45 కోట్ల గ్రాస్) సాధించింది. ఓవరాల్ గా రూ.48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కి చేరువయ్యే అవకాశముంది. నాలుగో రోజు ఆదివారం కావడంతో వరల్డ్ వైడ్ గా మరో పది కోట్ల షేర్ కోట్ల రాబట్టి.. నాలుగు రోజుల్లో రూ.48 కోట్ల షేర్ మార్క్ ని అందుకునే అవకాకాశాలు ఉన్నాయి.
దసరా మూవీ ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించడం ఖాయమే అయినప్పటికీ.. ఏరియాల వారీగా చూస్తే కొన్ని చోట్ల బయ్యర్లకు నష్టాలు తప్పవేమో అనిపిస్తుంది. తెలంగాణ, ఓవర్సీస్ లో వసూళ్ల వర్షం కురిపిస్తున్న దసరా.. ఆంధ్రప్రదేశ్ తో పాటు మిగతా భాషల్లో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోతోంది. నైజాం(తెలంగాణ)లో రూ.13.7 కోట్ల బిజినెస్ చేసిన మూవీ.. మూడు రోజుల్లోనే రూ.14.37 కోట్ల షేర్ రాబట్టి అప్పుడే లాభాల్లోకి ఎంటరైంది. సీడెడ్ లో రూ.6.5 కోట్ల బిజినెస్ చేయగా.. ఇప్పటిదాకా రూ.3.83 కోట్ల షేర్ రాబట్టింది. ఇక ఆంధ్రాలో రూ.14.45 కోట్ల బిజినెస్ చేయగా ఇప్పటిదాకా రూ.8.61 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో ఆశించిన స్థాయిలో దసరా వసూళ్లు లేవు. పైగా వచ్చే శుక్రవారం రావణాసుర, మీటర్ వంటి సినిమాలు విడుదలవుతున్నాయి. మరి ఈలోపు దసరా పుంజుకొని ఆంధ్రాలోనూ బ్రేక్ ఈవెన్ సాధిస్తుందేమో చూడాలి.