English | Telugu
'దసరా' దెబ్బకి నాని రేంజ్ పెరిగింది!
Updated : Apr 2, 2023
నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ 'దసరా' భారీ వసూళ్లతో సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. మూడు రోజుల్లోనే రూ.70 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం నాని కెరీర్ లో వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన మొదటి సినిమాగా నిలవనుంది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.38 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరిచింది. నైజాంలో, ఓవర్సీస్ లో రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. దీంతో నాని తదుపరి సినిమాల బిజినెస్ రేంజ్ పెరుగుతోంది.
నాని తన 30వ సినిమాని శౌర్యువ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ అనౌన్స్ మెంట్ వీడియోతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఇప్పుడు దసరా వసూళ్ల వర్షం కురిపిస్తుండటంతో.. 'నాని 30' చిత్రీకరణ ప్రారంభ దశలో ఉండగానే అదిరిపోయే బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయట. సౌత్ ఇండియా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం ఏకంగా రూ.35 కోట్ల ఆఫర్ వచ్చిందట. ఈ లెక్కన శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, ఇతర డిజిటల్ రైట్స్ కలిపి నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే 60 కోట్లకు పైగా రావొచ్చు. దసరా మూవీ దాదాపు 50 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసింది. 'నాని 30' కూడా 40 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసే అవకాశముంది. మొత్తానికి థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి నాని సినిమాలు విడుదలకు ముందే వంద కోట్ల బిజినెస్ చేస్తున్నాయన్నమాట.