English | Telugu
చలాకీ చంటికి గుండెపోటు!
Updated : Apr 23, 2023
ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఎందరో గుండెపోటుకి గురవుతున్నారు. పలువురు సెలబ్రిటీలు సైతం గుండెపోటు బారిన పడుతున్నారు. తాజాగా జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి గుండెపోటుతో ఆసుపత్రి పాలయ్యాడు. ఆయన తీవ్ర అస్వస్థకు గురి కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స అందించిన వైద్యులు ఆయనకు స్టెంట్ వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.
బుల్లితెరపై, వెండితెరపై కమెడియన్ గా చంటి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కొన్ని టీవీ షోలకు యాంకర్ గానూ వ్యవహరించారు. అలాగే బిగ్ బస్-6 లో కంటెస్టెంట్ గా అలరించాడు. అయితే ఈమధ్య అటు బుల్లితెర మీద గాని, ఇటు వెండితెర మీద గాని చంటి సందడి ఎక్కువగా కనిపించడం లేదు. ఈ క్రమంలో ఆయన గుండెపోటుతో ఆస్పత్రిపాలు కావడం అభిమానులు, సన్నిహితుల్లో ఆందోళన కలిగించింది. ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పలువురు పోస్ట్ లు పెడుతున్నారు. కాగా కుటుంబసభ్యులు సకాలంలో స్పందించి, ఆస్పత్రికి తలరించడంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారని.. రెండు రోజుల్లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశముందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.