English | Telugu
పిల్లలతో ఆడుకున్న కృతిసనన్!
Updated : Apr 24, 2023
రోమ్‌లో ఉంటే రోమన్‌లా ఉండమన్నారు. ఈ సామెతను కృతిసనన్ చాలా అద్భుతంగా నేర్చుకున్నారు. ఎంత ఇంట్రస్టింగ్‌గా నేర్చుకున్నారో, అంతకు రెట్టింపు శ్రద్ధగా పాటిస్తున్నారు. ఆమె పార్టీలకు వెళ్తే డ్రస్సింగ్ స్టైల్‌ని బీట్ చేసేవాళ్లుండరు. షూటింగులకు వెళ్తే సిన్సియారిటీకి ఫిదా కాని వారు ఉండరు. కేరక్టర్లను సెలక్ట్ చేసుకుంటే క్లాప్స్ కొట్టనివారే ఉండరు. అందుకే కృతిసనన్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ రేంజ్‌లో ఉంటుంది.రీసెంట్‌గా ఈమె చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో నాన్‌స్టాప్‌గా వైరల్ అవుతోంది. కృతి ఫ్యాన్స్ ని ఫుల్ ఖుష్ చేస్తోంది. ఇటీవల ఆమె ఎకనామీ క్లాస్‌లో విమానంలో ట్రావెల్‌చేశారు. తెల్లటి డ్రస్‌లో పింక్ షాల్‌లో ఉన్నారు కృతిసనన్. బ్లాక్ మాస్క్ పెట్టుకున్నారు. ఆమె ప్లెయిన్‌లో ఉండటం చూసి సేమ్ ఫ్లైట్‌లో ట్రావెల్ చేస్తున్న ఓ చిన్నారి ఆమెను పలకరించింది. అంతే, చిన్నారిని చూసిన కృతిసనన్ కూడా చిన్నపిల్లగా మారిపోయారు. చిన్నారి చేతులు పట్టుకుని తెగ ఆడించారు. ఫ్లైయింగ్ కిస్సులు ఇవ్వడం, ఆడుకోవడం అందరినీ అట్రాక్ట్ చేసింది.
మామూలు ఆడియన్స్ ఫిదా అయితే ఫర్వాలేదు, కృతి చేష్టలు చూసి సహ సెలబ్రిటీలు కూడా మురిసిపోతున్నారు. ఆమెకన్నా ముందు దీపిక పదుకోన్, కార్తిక్ ఆర్యన్, ఆమిర్ ఖాన్ కూడా ఎకనామి క్లాస్‌లో ట్రావెల్ చేసినప్పుడు కో ప్యాసింజర్స్ తో సరదాగా ఉన్న సందర్భాలను గుర్తుచేసుకుంటున్నారుఅన్నట్టు ఆమె ఆదిపురుష్‌లో జానకి కేరక్టర్‌లో నటించారు. ఆ సినిమా కబుర్లు కూడా కో ప్యాసెంజర్స్ తో చెప్పారా? అని కొందరు నెటిజన్లు సరదాగా అడుగుతున్నారు. ఈ చిత్రంతో పాటు కృతిసనన్ కిట్టీలో మరికొన్ని సినిమాలున్నాయి. టబు, కరీనాకపూర్‌తో కలిసి ది క్రూలో నటిస్తున్నారు కృతి. షాహిద్ కపూర్‌తో మరో సినిమాలోనూ నటిస్తున్నారు ఈ బ్యూటీ.