English | Telugu
'మంగళవారం' ఫస్ట్ లుక్.. నగ్నంగా పాయల్!
Updated : Apr 25, 2023
'ఆర్ఎక్స్ 100'తో దర్శకుడిగా పరిచయమైన అజయ్ భూపతి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన 'మహా సముద్రం' మాత్రం విజయాన్ని అందుకోలేకపోయింది. 'ఆర్ఎక్స్ 100'తోనే హీరోయిన్ గా పరిచయమైన పాయల్ రాజ్‌పుత్ తన గ్లామర్ తో కుర్రకారుని కట్టిపడేసింది. అయితే ఆ తర్వాత ఆమెకు కూడా సరైన విజయాల్లేవు. ఈ క్రమంలో వీరిద్దరూ 'మంగళవారం' అనే చిత్రం కోసం జత కట్టారు.
పాయల్ రాజ్‌పుత్, అజయ్ భూపతి కలయికలో 'మంగళవారం' అనే చిత్రం రూపొందుతోన్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే పాయల్-అజయ్ షాకిచ్చారు అని చెప్పొచ్చు. పోస్టర్ మరీ బోల్డ్ గా ఉంది. పోస్టర్ లో పాయల్ వీపు కనిపించేలా నగ్నంగా వెనక్కి తిరిగి ఉండగా, ఆమె వేలిపై సీతాకోకచిలుక వాలి ఉంది. పోస్టర్ తోనే ఈ సినిమా ఎంత బోల్డ్ గా ఉండబోతుందో చెప్పేశారు మేకర్స్.
ముద్ర మీడియా వర్క్స్, ఏ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ సౌత్ ఫిల్మ్ గా రూపొందుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.