English | Telugu
'ఎన్టీఆర్ 30' ఫస్ట్ లుక్ కి ముహూర్తం ఫిక్స్!
Updated : Apr 25, 2023
'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఎన్టీఆర్ 30'(వర్కింగ్ టైటిల్). యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదలకి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న 'ఎన్టీఆర్ 30'పై తారక్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. "వస్తున్నా" అంటూ అనౌన్స్ మెంట్ వీడియోతోనే ఆకట్టుకున్నారు మూవీ టీమ్. పక్కా యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే ఎన్టీఆర్ 30 ఫస్ట్ లుక్ కి డేట్ ఫిక్స్ అయినట్లు సమాచారం. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా మే 20న ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటే టైటిల్ ని కూడా రివీల్ చేసే అవకాశముంది అంటున్నారు.
ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. 2024, ఏప్రిల్ 5న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది.