English | Telugu

అఖిల్‌తో నాని ద‌ర్శ‌కుడు?

`అందాల రాక్ష‌సి` (2012)తో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగేసిన హ‌ను రాఘ‌వ‌పూడికి.. నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌న్ లో చేసిన `కృష్ణ‌గాడి వీర‌ప్రేమ‌గాధ‌` (2016)తో మొద‌టి విజ‌యం ద‌క్కింది. ఆపై యూత్ స్టార్ నితిన్ తో `లై` (2017), యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్ తో `ప‌డి ప‌డి లేచె మ‌న‌సు` (2018) చేసిన హ‌నుకి ఆయా చిత్రాలు ఆశించిన ఫ‌లితాల‌ను అందివ్వ‌లేక‌పోయాయి. ఈ నేప‌థ్యంలో.. మాలీవుడ్ యంగ్ స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్ కాంబినేష‌న్ లో తీస్తున్న‌ తాజా సినిమాపైనే త‌న ఆశ‌ల‌ను పెట్టుకున్నాడీ టాలెంటెడ్ డైరెక్ట‌ర్.

ఇదిలా ఉంటే.. దుల్క‌ర్ స‌ల్మాన్ సినిమా చేతిలో ఉండ‌గానే మ‌రో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని సెట్ చేసుకున్నాడ‌ట హ‌ను. అంతేకాదు.. ఇందులో అక్కినేని బుల్లోడు అఖిల్ హీరోగా న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే హ‌ను, అఖిల్ మ‌ధ్య ఈ మేర‌కు చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయ‌ని టాక్. త్వ‌ర‌లోనే అఖిల్ - హ‌ను రాఘ‌వ‌పూడి కాంబినేష‌న్ మూవీపై క్లారిటీ రానుంది.

కాగా, అఖిల్ తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్` విడుద‌ల‌కు సిద్ద‌మైంది. మ‌రోవైపు స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న‌ `ఏజెంట్`తో బిజీగా ఉన్నాడు అఖిల్. డిసెంబ‌ర్ 24న ఈ సినిమా జ‌నం ముందుకు రానుంది.