English | Telugu

వెంకీ, కమల్‌ తో శ్రీకాంత్ అడ్డాల మల్టీస్టారర్!!

'కొత్త బంగారు లోకం' సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల మొదటి సినిమాతోనే మెప్పించాడు. ఆ తర్వాత వెంకటేష్, మహేష్ బాబు హీరోలుగా మల్టీ స్టారర్ మూవీ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక రీసెంట్ గా 'నారప్ప'తో ఆకట్టుకున్న శ్రీకాంత్ అడ్డాల.. త్వరలో ఓ క్రేజీ మల్టీ స్టారర్ చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల ఇద్దరు సీనియర్ హీరోలను సింగిల్ ఫ్రేమ్‌ లోకి తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉన్నారట. కమల్‌ హాసన్‌, వెంకటేష్ లతో మల్టీ స్టారర్ సినిమాను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. గతంలోనే ఈ కాంబినేషన్‌ లో మూవీ చేసేందుకు శ్రీకాంత్ ట్రై చేయగా ఎందుకనో కుదర్లేదు. అయితే తాజాగా నారప్ప సినిమాతో బౌన్స్ బ్యాక్‌ అయిన శ్రీకాంత్.. ఈసారి మాత్రం ఈ కాంబినేషన్‌ లో మల్టీ స్టారర్ చేసేందుకు గట్టిగానే ట్రై చేస్తున్నారట.

కాగా.. కమల్‌ హాసన్‌, వెంకటేష్ లు గతంలో ఈనాడు(2009) మూవీలో కలిసి నటించారు. మరి ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల ఈ టాలెంటెడ్ యాక్టర్స్ ని మరోసారి సింగిల్ ఫ్రేమ్‌ లోకి తీసుకొస్తారేమో చూడాలి.