English | Telugu

'ఆకాశం నీ హద్దురా' రీమేక్ లో అక్షయ్‌ కుమార్‌!

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా, సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన 'సూరారై పోట్రు' మూవీ ప్రేక్షకులను మెప్పించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 'ఆకాశం నీ హద్దురా' పేరుతో తెలుగులోనూ విడుదలై ఆకట్టుకుంది. ఈ మూవీని హిందీలో రీమేక్ చేయబోతున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ రీమేక్ లో అక్షయ్‌ కుమార్‌ నటించనున్నారని టాక్ వినిపిస్తోంది.

సౌత్ సినిమాల రీమేక్‌ల పై బాలీవుడ్ స్టార్ అక్షయ్‌ కుమార్‌ ఆసక్తి చూపిస్తారు. ఇప్పటికే రౌడీ రాథోడ్, భూల్ భూలైయా, లక్ష్మి బాంబ్ వంటి రీమేక్ లలో నటించిన అక్షయ్‌.. ఇప్పుడు 'సూరారై పోట్రు' రీమేక్ లో నటించడానికి సిద్దమయ్యారట. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కించిన డైరెక్టర్‌ సుధా కొంగర హిందీలోనూ దర్శకత్వం వహించనున్నారు. ఈ రీమేక్ ని సూర్య 2డి ఎంటర్టైన్మెంట్, విక్రమ్ మల్హోత్రా అబుండాంటియా ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ప్రస్తుతం అక్షయ్‌ నటించిన 'బెల్‌బాటమ్‌', 'సూర్యవంశీ', 'ఆట్రంగి రే' సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 'పృథ్వీరాజ్‌', 'రక్షాబంధన్‌', 'రామసేతు', 'బచ్చన్‌పాండే' సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.