English | Telugu
కొడుకు సినిమాలో నాగ్ నెగటివ్ రోల్?
Updated : Jul 18, 2021
అక్కినేని బుల్లోడు అఖిల్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న సినిమా 'ఏజెంట్'. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి రూపొందిస్తున్న ఈ చిత్రంలో మాలీవుడ్ స్టార్స్ మమ్ముట్టి, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించబోతున్నట్లు ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, వీరి ఎంట్రీపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఇందులో కింగ్ నాగార్జున కూడా సందడి చేయనున్నారని సమాచారం. అంతేకాదు.. ఆయనది నెగటివ్ టచ్ ఉన్న రోల్ అని వినికిడి. త్వరలోనే 'ఏజెంట్'లో నాగ్ ఎంట్రీపై క్లారిటీ రానుంది. తనయుడి సినిమాలో తండ్రి నెగటివ్ రోల్ చేయడమంటే సాహసమనే చెప్పాలి. మరి.. ఆ ఫ్యాక్టర్ సినిమాకి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
కాగా, ఈ స్పై డ్రామాతో సాక్షి వైద్య తెలుగు తెరకు కథానాయికగా పరిచయమవుతుండగా.. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మిస్తున్నాడు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న 'ఏజెంట్'ని థియేటర్స్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే.. అఖిల్ తాజా చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' విడుదలకు సిద్ధమైంది. పూజా హెగ్డే నాయికగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్‌కి భాస్కర్ దర్శకత్వం వహించాడు.