నాని 'మీట్ క్యూట్'లో కాజల్!!
నేచురల్ స్టార్ నాని ఒక వైపు హీరోగా వరుస సినిమాలు చేస్తూ అలరిస్తూనే.. మరోవైపు నిర్మాతగానూ తన అభిరుచుకి తగ్గట్లు సినిమాలు నిర్మించి మెప్పిస్తున్నాడు. ఇప్పటికే వాల్ పోస్టర్ సినిమా ప్రొడక్షన్ పై నాని నిర్మించిన.. అ!, హిట్ సినిమాలు విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం నాని ప్రొడక్షన్ లో రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి. అందులో ఒకటి హిట్-2 కాగా, మరోకటి 'మీట్ క్యూట్'.