English | Telugu

కార్తికేయ, నేహా శెట్టిల 'బెదురులంక' వచ్చేస్తోంది

కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'బెదురులంక 2012'. ఆయన సరసన 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రాన్ని లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేనినిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సి. యువరాజ్ చిత్ర సమర్పకులు.'బెదురులంక 2012' చిత్రాన్ని ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఈరోజు ప్రకటించారు.

చిత్రనిర్మాతబెన్నీ ముప్పానేని మాట్లాడుతూ "అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్టైనర్ ఇది. కొత్త కంటెంట్, బ్యూటిఫుల్ విజువల్స్, మంచి పాటలతో మేం 'బెదురులంక2012' తీశాం. ప్రేక్షకుల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళుతుందీ సినిమా. ఇప్పటివరకు గోదావరి నేపథ్యంలో వచ్చిన రూరల్ డ్రామాలకు చాలా భిన్నంగా ఉంటుంది. గోదావరి బేస్డ్ రూరల్ డ్రామా అంటే 'బెదురులంక 2012' ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది" అన్నారు.

దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ "ఇప్పటికే విడుదలైన టీజర్, పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రేక్షకులు అందరూ సినిమా విడుదల ఎప్పుడు? అని అడుగుతున్నారు. ఆగస్టు 25న 'బెదురులంక 2012' ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపిస్తాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. త్వరలో ట్రైలర్ విడుదల తేదీ వెల్లడించడంతో పాటు మిగతా పాటలనువిడుదల చేస్తాం. మణిశర్మ గారు అద్భుతమైన బాణీలు అందించారు. పాటల్లోనూ, సన్నివేశాల్లోనూ కార్తికేయ, నేహా జోడీ మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని అమితంగాఆకట్టుకుంటుంది" అని అన్నారు.

కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, ఎడిటర్ గా విప్లవ్ వ్యవహరిస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.