'రజాకార్' ఫస్ట్ లుక్.. కళ్ళకు కట్టినట్లున్న దృశ్యం!
రజాకార్ల దురాగతాలు.. ఇప్పటివరకు సన్నివేశాలకో లేదంటే సంభాషణలకో పరిమితమై మాత్రమే కొన్ని తెలుగు చిత్రాలు వచ్చాయి. అయితే, ఈ అంశంపై తొలిసారిగా పూర్తి స్థాయిలో ఓ సినిమా రాబోతోంది. అదీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా. ఆ చిత్రమే.. 'రజాకార్'. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీకి "సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్" అనే ట్యాగ్ లైన్ జోడించడం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. యాట సత్యనారాయణ తనే రచించి, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గూడురు నారాయణ రెడ్డి నిర్మిస్తున్నారు. 'ధమాకా'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన భీమ్స్ సెసిరోలియో ఈ సినిమాకి సంగీతమందించడం విశేషం.