English | Telugu
మరో హ్యాట్రిక్ కి రెడీ అంటున్న అనిరుధ్.. నెలకో క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్!
Updated : Jul 7, 2023
అనిరుధ్ రవిచందర్.. ప్రస్తుతం కోలీవుడ్ లో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్. గత ఏడాది అయితే 'డాన్', 'విక్రమ్', 'తిరుచిత్రాంబళమ్' చిత్రాలతో తమిళనాట హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు అనిరుధ్. కేవలం తమిళంకే పరిమితం కాకుండా తెలుగు, హిందీలోనూ సినిమాలు చేస్తున్న ఈ స్టార్ కంపోజర్.. ఈ క్యాలెండర్ ఇయర్ లో ఇప్పటివరకు ఒక్క సినిమాతోనైనా పలకరించనేలేదు.
అయితే, ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో వరుసగా మూడు చిత్రాలతో ఎంటర్టైన్ చేయనున్నాడు ఈ 'కొలవెరి డి' సెన్సేషన్. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్.. ఇలా నెలకో క్రేజీ ప్రాజెక్ట్ తో అనిరుధ్ బాక్సాఫీస్ ముంగిట సందడి చేయనున్నాడు.
ఆ వివరాల్లోకి వెళితే.. ఆగస్టు 10న సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా రూపొందిన 'జైలర్'రిలీజ్ కానుండగా.. సెప్టెంబర్ 7న బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ 'జవాన్' జనం ముందుకు రానుంది. ఇక అక్టోబర్ 19న ఇళయదళపతి విజయ్ స్టారర్ 'లియో' సిల్వర్ స్క్రీన్ పైకి వస్తోంది. మరి.. నెలకో క్రేజీ ప్రాజెక్ట్ తో రాబోతున్న అనిరుధ్.. మరో హ్యాట్రిక్ ని తన ఖాతాలో క్రెడిట్ చేసుకుంటాడేమో చూడాలి.
ఇదిలా ఉంటే, తెలుగులో ఎన్టీఆర్ 'దేవర', విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి కాంబో మూవీలకు అనిరుధ్ ట్యూన్స్ ఇస్తున్నాడు. 2024లో ఈ సినిమాలు తెరపైకి వస్తాయి.