English | Telugu
చైతూ సినిమాకి అనిరుధ్ బాణీలు?
Updated : Jul 6, 2023
తమిళనాట స్టార్ కంపోజర్ గా రాణిస్తున్న అనిరుధ్ రవిచందర్.. అడపాదడపా తెలుగు సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి', నాని 'జెర్సీ', 'గ్యాంగ్ లీడర్' చిత్రాలకు స్వరాలు సమకూర్చిన అనిరుధ్.. ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ 'దేవర'తో పాటు విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి కాంబో మూవీకి కూడా పనిచేస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. తాజాగా అనిరుధ్ మరో టాలీవుడ్ వెంచర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఆ వివరాల్లోకి వెళితే.. 'ప్రేమమ్', 'సవ్యసాచి' తరువాత కథానాయకుడు నాగచైతన్య, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో కీర్తి సురేశ్ హీరోయిన్ గా కనిపిస్తుందని టాక్. కాగా, గుజరాత్ నేపథ్యంలో సాగే ఈ పాన్ - ఇండియా వెంచర్ కి అనిరుధ్ బాణీలు అందిస్తాడని చెప్పుకుంటున్నారు. అదే గనుక నిజమైతే.. చైతూ - అనిరుధ్ కాంబోలో ఇదే ఫస్ట్ మూవీ అవుతుంది. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత వస్తుంది.