English | Telugu
100 కోట్ల జీనీ మూవీ మొదలైంది
Updated : Jul 7, 2023
వేల్స్ ఇంటర్నేషనల్ 25వ సినిమా జీని మొదలైంది. పూజా కార్యక్రమాలతో ప్రాజెక్ట్ లాంఛనంగా మొదలైందని చెబుతూ మేకింగ్ వీడియో విడుదల చేశారు మేకర్స్. అత్యంత ఆత్మీయుల సమక్షంలో పాన్ ఇండియా ప్రాజెక్టుగా జీనిని అనౌన్స్ చేశారు. జయం రవి, దేవయాని, కృతి శెట్టి, కల్యాణి ప్రియదర్శన్, వామిక గబ్బి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మహేష్ ముత్తుస్వామి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్ కోసం హాలీవుడ్ స్టంట్ ఎక్స్ పర్ట్ యానిక్ బెన్ రంగంలోకి దిగారు. ఉమేష్ జయ కుమార్ ఆర్ట్ వర్క్ ని డీల్ చేస్తున్నారు. పూజా కార్యక్రమం అనంతరం రెండు రోజులు సినిమా షూటింగ్ ఉంటుంది. ఆ తర్వాత చిన్న బ్రేక్ తీసుకుంటారు.
జూలై 20 నుంచి ఫ్రెష్ షెడ్యూల్ ని స్టార్ట్ చేస్తారు. వేల్స్ ఇంటర్నేషనల్ 25వ సినిమా కావడంతో అత్యంత భారీగా ఈ సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 100 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించనున్నారు. ఆల్రెడీ పొన్నియన్ సెల్వన్ పార్ట్ వన్ పార్ట్ టూ తో జయం రవి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ జీని లోను కథ చాలా వైవిధ్యంగా ఉంటుందని, ఆయన కెరీర్ కు ఎంతో దోహదపడుతుందని అంటున్నారు మేకర్స్. మిస్కిన్ దగ్గర పనిచేసిన అర్జునన్ జూనియర్ ఈ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఐసరి కే గణేష్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని వేల్స్ ఇంటర్నేషనల్ సోషల్ మీడియాలో అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. జయం రవి కెరియర్లో అత్యద్భుతమైన చిత్రంగా నిలుస్తుందని చెప్పారు మేకర్స్.