English | Telugu
బాలయ్య 'ముద్దుల మేనల్లుడు'కి 33 ఏళ్ళు!
Updated : Jul 7, 2023
నటసింహం నందమూరి బాలకృష్ణకి అచ్చొచ్చిన నిర్మాణ సంస్థల్లో భార్గవ ఆర్ట్ ప్రొడక్షన్స్ కి ప్రత్యేక స్థానం ఉంది. ఈ బేనర్ లో బాలయ్య నటించిన పలు చిత్రాలు నందమూరి అభిమానులను అలరించాయి. వాటిలో 'ముద్దుల మేనల్లుడు'ఒకటి. శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాలో బాలయ్యకి జంటగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి సందడి చేశారు. తమిళ చిత్రం 'తంగమాన రాసా'ఆధారంగా రూపొందిన ఈ మూవీలో నాజర్, బ్రహ్మాజీ, జయంతి, సంగీత, బాబూ మోహన్, ప్రసన్న కుమార్, బాలాజీ, మాడా, వసంత్, కేకే శర్మ, చిడతల అప్పారావు, అనిత, లతా శ్రీ, కల్పనా రాయ్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
కేవీ మహదేవన్ బాణీలు కట్టిన ఈ చిత్రంలోని ''ముత్యాల పందిరిలో'' అంటూ సాగే పాట విశేషాదరణ పొందగా.. ''పండగొచ్చెనమ్మో'', ''టాటా చెప్పాలోయ్'', ''నొప్పిగుంది'', ''పరువాల చిలక'', ''ద్వాపర యుగమున'' అంటూ సాగే గీతాలు కూడా రంజింపజేశాయి. కాగా 1990 జూలై 7న విడుదలైన 'ముద్దుల మేనల్లుడు' నేటితో 33 వసంతాలు పూర్తిచేసుకుంది.