English | Telugu
కమల్‌హాసన్ ప్రొడక్షన్‌కి జాన్వీ సై!
Updated : Jul 7, 2023
జాన్వీ కపూర్ కోలీవుడ్ ఎంట్రీకి అంతా సిద్ధమైందనే మాటలు వినిపిస్తున్నాయి. కమల్ హాసన్ నిర్మిస్తున్న ఓ చిత్రంతో ఆమె తమిళ సినీ పరిశ్రమంలో అడుగుపెడతాననేది తాజా వార్త. కమల్ హాసన్ ప్రస్తుతం నటుడుగానే కాదు నిర్మాతగా కూడా చాలా బిజీగా ఉన్నారు. ఓవైపు వరసగా సినిమాల్లో నటిస్తూ, మరోవైపు యంగ్‌స్టర్స్‌తో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకం మీద వరుసగా సినిమాలు తెరకెక్కిస్తున్నారు కమల్ హాసన్.
ఈ క్రమంలోనే ఆయన విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో 'లవ్ టుడే' ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తారని సమాచారం. హిందీలో వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నారు జాన్వీ. తెలుగులో ఆమె ఎన్టీఆర్ సరసన 'దేవర' చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా తర్వాత తెలుగులో మరో సినిమా కూడా సంతకం చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కమల్ హాసన్ ప్రొడక్షన్ కాబట్టి కమల్ హాసన్ తో చిన్నతనం నుంచి తనకున్న అసోసియేషన్ కారణంగా ఆయన వైపు నుంచి ఆఫర్ రాగానే వెంటనే జాన్వి ఓకే చెప్పారు అన్నది కోలీవుడ్ లో వైరల్ అవుతున్న విషయం.
అజిత్ కుమార్ తో లైకా ప్రొడక్షన్లో సినిమా చేయాల్సింది విఘ్నేష్ శివన్. కానీ కథ అజిత్ కి నచ్చకపోవడంతో ఆ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లలేదు. ఇప్పుడు ఆ కథలో కొన్ని మార్పులు చేసి ప్రదీప్ రంగనాథన్, జాన్వి కపూర్ తో సినిమా చేయాలన్నది విఘ్నేష్ ఆలోచన. కమల్ కి ఈ ఆలోచన నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.