English | Telugu

రిష‌బ్‌కి ర‌క్షిత్ విషెస్‌.. 'కిరిక్ పార్టీ' సీక్వెల్ సంగ‌తేంటి?

డివైన్ బ్లాక్ బస్ట‌ర్ మూవీ 'కాంతార‌'తో నేష‌న‌ల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నారు రిష‌బ్ శెట్టి. ఆయన పుట్టినరోజు ఇవాళ. కాంతారా సక్సెస్ తర్వాత ఇండస్ట్రీలో ఆయన జరుపుకుంటున్న తొలి పుట్టిన రోజు ఇది. రిషబ్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ స్పెషల్ అకేషన్ ని పురస్కరించుకొని రిషబ్ శెట్టికి త‌న‌ ఫ్రెండ్ రక్షిత్ శెట్టి కూడా విషెస్ చెప్పారు. ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్ ప‌నుల్లో బిజీగా ఉన్నారు రిష‌బ్‌. ఆ సినిమా బాక్సాఫీస్ సక్సెస్ తెచ్చుకోవడం తోపాటు, ప్రేక్షకుల మనసులు కూడా కొల్లగొట్టింది. కర్ణాటకలోని కొన్నిచోట్ల ఓ వర్గం ఆచరిస్తున్న ఆచారాలను గురించి చెప్పిన సినిమా అది. అటవీ ప్రాంతంలో జీవిస్తున్న వారి జీవన విధానాన్ని కూడా కళ్ళకు కట్టిన చిత్రం.

అదే సందర్భంలో రక్షిత్ శెట్టి తెర‌కెక్కించిన‌ '777 చార్లీ' కూడా అంతే పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఓ వ్యక్తికి ఓ కుక్కకి మధ్య ఉన్న రిలేషన్షిప్ ని వ్యక్తం చేస్తూ చార్లీ తెర‌కెక్కించారు. ఈ రెండు సినిమాలు కన్నడ ఇండస్ట్రీ వైపు యావత్ భారతం చూపు తిరిగేలా చేశాయి.

ర‌క్షిత్‌శెట్టి విష్ చేస్తూ "అద్భుతమైన ఏడాది కావాలి. అనుకున్న‌వ‌న్నీ జ‌ర‌గాలి. ఎన్నెన్నో విజయాలు అందుకోవాలి. ఆనందంగా ఉండాలి" అని ఆకాంక్షించారు. రక్షిత్ శెట్టి విషెస్ చూసిన వారందరూ వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన 'కిరాక్ పార్టీ' చిత్రాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 'కిరాక్ పార్టీ' సీక్వెల్ కూడా తీస్తే బాగుంటుందని మెసేజ్లు పోస్ట్ చేస్తున్నారు అభిమానులు. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన కిరాక్ పార్టీతోనే రష్మిక మందన్న హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ప్రేమ, అది పెళ్లి పీటల వరకు వెళ్లడం, బ్రేక‌ప్ కావ‌డం తెలిసిందే. ఇప్పుడు కిరాక్ పార్టీ సీక్వెల్‌ ఉంటే అందులో రష్మిక ఉంటారా లేదా అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విషయం.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.