English | Telugu

కావాలా సాంగ్‌కు స్టెప్పులేసిన ర‌మ్య‌కృష్ణ‌

జైల‌ర్ వైర‌ల్ సాంగ్ కావాలా... కు స్టెప్పులేశారు రమ్య‌కృష్ణ‌. జైల‌ర్ ఆడియో లాంచ్ చెన్నైలో జ‌రిగింది. ఈ వేడుక కోసం చ‌క్క‌గా రెడీ అయ్యారు ర‌మ్య‌కృష్ణ‌. త‌న వ్యానిటీ వ్యాన్‌లో కావాలా పాట‌కు అద్దిరిపోయే స్టెప్పులేశారు. ఆమె ఆ పాట‌కు వేసిన డ్యాన్స్ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. వారెవా... ఇర‌గ‌దీశారు మేడ‌మ్ అంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు నెటిజ‌న్లు.

త‌న ముగ్గురు స్టాఫ్‌తో క‌లిసి వ్యానిటీ వ్యాన్‌లో స్టెప్పులేశారు ర‌మ్య‌కృష్ణ‌. ఫుల్ బ్లాక్ డ్ర‌స్‌లో, ప‌ర్ఫెక్ట్ గా కావాలా హుక్ స్టెప్‌ని మ్యాచ్ చేశారు. 52 ఏళ్ల వ‌య‌సులో ఈ రేంజ్ గ్లామ‌ర్‌ని, పిక్చ‌ర్ ప‌ర్ఫెక్ట్ స్టెప్పుల‌ను ఆమె నుంచి ఎవ‌రూ ఊహించ‌ర‌ని అంటున్నారు ర‌మ్య‌కృష్ణ ఫ్యాన్స్.

ర‌జ‌నీకాంత్‌, త‌మ‌న్నా భాటియా న‌టించిన సినిమా జైల‌ర్‌. ఈ సినిమా ఆడియో వేడుక నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఘ‌నంగా జ‌రిగింది. స్టార్ స్ట‌డ‌డ్ ప్రోగ్రామ్‌గా ఎలివేట్ అయింది. ఈ స్టేజ్ మీద త‌మ‌న్నా కావాలా పాట‌కు పెర్ఫార్మ్ చేశారు.

జైల‌ర్ సాంగ్ కావాలాను శిల్పా రావు, అనిరుద్ ర‌విచంద్ర‌న్ పాడారు. ఈ పాట ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. చిన్న పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రూ ఫిదా అవుతున్నారు ఈ పాట‌కు.

జైలర్ సినిమా ఆగ‌స్ట్ 10న విడుద‌ల కానుంది. ఈ సినిమాకు నెల్స‌న్ దిలీప్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బీస్ట్ మూవీ ఫ్లాప్ కావ‌డంతో వెంట‌నే, ఈ సినిమాకు అత‌న్ని తీసేయ‌మ‌ని ర‌జ‌నీకాంత్‌కి ప‌లువురు స‌ల‌హా ఇచ్చార‌ట‌. అయితే, స‌న్ పిక్చ‌ర్స్ ధైర్యం చేసి ముందుకు రావ‌డంతో సినిమా పట్టాలెక్కింద‌ట‌.

ఈ చిత్రంలో ముత్తువేల్ పాండ్య‌న్‌గా న‌టించారు ర‌జ‌నీకాంత్‌. డార్క్ కామెడీ థ్రిల్ల‌ర్ ఇది. క‌న్న‌డ సూప‌ర్ స్టార్ శివ‌రాజ్‌కుమార్ విల‌న్‌గా న‌టించారు. ర‌మ్య‌కృష్ణ‌, యోగిబాబు, వ‌సంత్ ర‌వి, వినాయ‌క‌న్ ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. జాకీ ష్రాఫ్, మోహ‌న్‌లాల్ స్పెష‌ల్ రోల్స్ చేశారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .