English | Telugu
అల్లు అర్జున్‘పుష్ప 2’లో శ్రీలీల.. అసలు ట్విస్ట్ అదే
Updated : Jul 29, 2023
ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరా? అంటే టక్కున వినిపిస్తోన్న పేరు శ్రీలీల. పవన్ కళ్యాణ్, మహేష్, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తోంది. ఒకటి రెండు కాదు.. ఏకంగా 10 భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తుంది. ఇప్పుడీ అమ్మడుకి మరో క్రేజీ ఆఫర్ వచ్చింది. అది కూడా ఏకంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో అని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే బన్నీ చేయబోయే కొత్త సినిమాలో ఏమైనా శ్రీలీల హీరోయిన్‌గా కనిపించనుందా! అనే సందేహం రాక మానదు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే..శ్రీలీలకు బన్నీ సినిమాలో ఛాన్స్ వచ్చింది హీరోయన్‌గా కాదనే టాక్ వినిపిస్తోంది.
అసలు విషయంలోకి వెళితే అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సినిమా రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. కానీ ఈ ఏడాది డిసెంబర్‌లోనే సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. సుకుమార్ సినిమాలో ఐటెమ్ సాంగ్‌కి ఓ ప్రత్యేకత ఉంటుంది. పుష్ప సినిమా మొదటి పార్ట్ పుష్ప ది రైజ్ చిత్రంలో సమంత ఐటెమ్ సాంగ్‌లో కనిపించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పుష్ప ది రూల్ మూవీ ఐటెమ్ సాంగ్‌లో ఎవరు నటిస్తారా? అనే దాని కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ లిస్టులో ఊర్వశీ రౌతేలా సహా చాలా పేర్లే వినిపించాయి.
తాజాగా ఈ లిస్టులో శ్రీలీల పేరు చేరింది. ఇది వరకే ఆహా కోసం వీరిద్దరూ కలిసి ఓ యాడ్‌లో నటించారు. కాగా.. ఇప్పుడు శ్రీలీలను పుష్ప 2లో ఐటెమ్ సాంగ్‌లో నటించమని మేకర్స్ సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలోనే దీనిపై మరింత క్లారిటీ రానుంది.