English | Telugu

'ఖుషి' టైటిల్ సాంగ్ వచ్చేసింది.. మరో చార్ట్ బస్టర్ మెలోడీ!

ఇటీవల కాలంలో పాటలతో మ్యాజిక్ చేస్తున్న కొత్త సినిమా ఏదంటే.. టాలీవుడ్ మ్యూజిక్ లవర్స్ నుంచి ముక్తకంఠంతో వస్తున్న సమాధానం 'ఖుషి'. ఇప్పటికే "నా రోజా నువ్వే", "ఆరాధ్య" రూపంలో రెండు చార్ట్ బస్టర్ సాంగ్స్ 'ఖుషి' నుంచి రావడమే ఇందుకు నిదర్శనం. కట్ చేస్తే.. తాజాగా ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ నుంచి థర్డ్ సింగిల్ వచ్చేసింది. "ఖుషీ నువ్వు కనపడితే.. ఖుషీ నీ మాట వినబడితే.." అంటూ మొదలయ్యే ఈ పాటని చిత్ర దర్శకుడు శివ నిర్వాణ రచించగా.. చిత్ర స్వరకర్త హేషమ్ అబ్దుల్ వహబ్ స్వయంగా గానం చేశారు. బృంద మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో విజయ్ దేవరకొండ, సమంత జంట చూడముచ్చటగా ఉంది. విజువల్స్, లొకేషన్స్ అన్నీ కూడా ఫ్రెష్ గా అనిపిస్తున్నాయి. తెలుగు, హిందీ పదాల మేళవింపుతో ఈ గీతం సాగడం విశేషం.ఓవరాల్ గా.. 'ఖుషి' నుంచి ఇది హ్యాట్రిక్ చార్ట్ బస్టర్ మెలోడీ అని చెప్పొచ్చు. మరి.. పాటలతో టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అవుతున్న 'ఖుషి'.. బాక్సాఫీస్ ముంగిట ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న 'ఖుషి'కి శివ నిర్వాణ దర్శకత్వం వహించడమే కాకుండా కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. సెప్టెంబర్ 1న ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్స్ లోకి రానుంది. 'గీత గోవిందం' తరువాత ఆ స్థాయి సక్సెస్ లేని విజయ్ దేవరకొండకి, 'మజిలీ' అనంతరం ట్రాక్ తప్పిన శివ నిర్వాణకి, 'శాకుంతలం' రూపంలో రీసెంట్ గా డిజాస్టర్ చూసిన సమంతకి 'ఖుషి' ఫలితం ఎంతో కీలకంగా మారింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.