English | Telugu
‘చంద్రముఖి2’ హాట్ అప్‌డేట్!
Updated : Jul 29, 2023
సెప్టెంబర్‌లో చంద్రముఖి సీక్వెల్‌ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనే విషయం తెలిసినప్పటి నుంచి ఆ సినిమా లవర్స్ ఆనందానికి అవధుల్లేవు. కోలీవుడ్ ఐకానిక్ హారర్ సినిమా చంద్రముఖి. రజనీకాంత్‌తో ఫస్ట్ పార్టును తెరకెక్కించిన పి.వాసు, ఇప్పుడు సెకండ్ పార్టును లారెన్స్ డైరక్షన్‌లో చేస్తున్నారు. సెకండ్ పార్టును లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తోంది. రీసెంట్‌గా మామన్నన్‌తో తన రేంజ్ పెంచుకున్నారు వైగై పుయల్ వడివేలు. చంద్రముఖి2లో ఆయన పార్టుకు డబ్బింగ్ చెప్పడం పూర్తి చేశారు. వడివేలు డబ్బింగ్ పూర్తి చేసిన వీడియో స్పెషల్ గా రిలీజ్ చేసింది లైకా ప్రొడక్షన్స్. వడివేలు విట్టీ డైలాగులకు పడీ పడీ నవ్వుతున్నారు జనాలు. ఫస్ట్ పార్టులో ఆయన చేసిన సందడి సెకండ్ పార్టులో కూడా కంటిన్యూ అవుతుందని దీన్ని బట్టి అర్థమవుతోంది. గతేడాది మైసూరులో ప్రారంభమైంది చంద్రముఖి 2 సినిమా. ఆ మధ్య షూటింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.ఆ సినిమాను పూర్తి చేశాక రెండు రాత్రులు నిద్రపట్టలేదని అన్నారు ఆస్కార్ అవార్డు గ్రహీత.
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ ఈ సినిమాలో నాయిక. వైగై పుయల్ వడివేలు, మహిమ నంబియార్, లక్ష్మీ మీనన్, సృష్టి, రావు రమేష్, విఘ్నేష్, రవి మారియా, సురేష్ మీనన్, సుభిక్ష కృష్ణన్ ఇతర కీలక పాత్రల్ల నటిస్తున్నారు. తోట తరణి ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేశారు. ఆంటనీ కెమెరా హ్యాండిల్ చేశారు. హారర్ కామెడీ జోనర్ మవీ ఇది. గ్రాండ్ స్కేల్‌లో తెరకెక్కించారు.
చంద్రముఖి కాన్సెప్ట్ కి మన దగ్గర స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు. అలాంటివారిని మరోసారి సర్‌ప్రైజ్ చేయాలని ఈ సినిమాను తెరకెక్కించామని అన్నారు లైకా ప్రొడక్షన్స్ హెడ్ తమిళ్ కుమరన్. వినాయక చవితి స్పెషల్‌గా సెప్టెంబర్ 15న విడుదల కానుంది చంద్రముఖి2 అని చెప్పారు.