English | Telugu
'బ్రో' ఫస్ట్ డే కలెక్షన్స్ .. రికవరీ శాతం ఎంతో తెలుసా!
Updated : Jul 29, 2023
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో రూపొందిన 'బ్రో'.. శుక్రవారం (జూలై 28) ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' వంటి విజయవంతమైన చిత్రాల తరువాత పవన్ కళ్యాణ్ నుంచి.. 'విరూపాక్ష' వంటి బ్లాక్ బస్టర్ మూవీ అనంతరం సాయితేజ్ నుంచి వచ్చిన మూవీ కావడంతో సహజంగానే ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇందులో పవన్ ది మెయిన్ లీడ్ కాకపోవడం, సాధారణ స్థాయిలోనే టికెట్ రేట్స్ ఉండడంతో ఆ ప్రభావం ఫస్ట్ డే కలెక్షన్స్ పై కనిపించిందన్నది ట్రేడ్ వర్గాల మాట. ఓవరాల్ గా చూస్తే మాత్రం.. ఓపెనింగ్స్ డీసెంట్ గానే ఉన్నాయని చెప్పొచ్చు. రూ. 97 కోట్ల షేర్ టార్గెట్ తో బాక్సాఫీస్ ముంగిట నిలిచిన 'బ్రో'.. తొలి రోజు రూ.30.01 కోట్ల షేర్ రాబట్టుకుని దాదాపు 31 శాతం రికవరీ చూసింది. శని, ఆదివారాల్లో రాబట్టే వసూళ్ళని బట్టి.. 'బ్రో' బాక్సాఫీస్ ఫలితంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది. ఏరియాల వారిగా 'బ్రో' DAY 1కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
నైజాం: రూ. 8.45 కోట్ల షేర్ (జి.ఎస్.టితో కలుపుకుని)
సీడెడ్: రూ. 2.70 కోట్లు
ఉత్తరాంధ్ర: రూ. 2.60 కోట్లు (జీఎస్టీతో కలుపుకుని)
ఈస్ట్ గోదావరి: రూ. 2.45 కోట్లు (జీఎస్టీతో కలుపుకుని)
వెస్ట్ గోదావరి: రూ. 2. 98 కోట్లు (జీఎస్టీతో కలుపుకుని)
గుంటూరు: రూ. 2.51 కోట్లు (జీఎస్టీతో కలుపుకుని)
కృష్ణా: రూ. 1.21 కోట్లు (జీఎస్టీతో కలుపుకుని)
నెల్లూరు: రూ. 71 లక్షలు (జీఎస్టీతో కలుపుకుని)
ఆంధ్ర +తెలంగాణ మొత్తం: రూ. 23.61 కోట్ల షేర్ (రూ. 35. 50 కోట్ల గ్రాస్)
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: రూ. 2.10 కోట్లు
ఓవర్సీస్: రూ. 4.30 కోట్లు
వరల్డ్ వైడ్ డే 1 కలెక్షన్స్: రూ.30.01 కోట్ల షేర్ (రూ. 48.50 కోట్లు గ్రాస్)