English | Telugu
త్రిష ఛాన్సు అందిపుచ్చుకున్న తమన్నా
Updated : Jul 30, 2023
కమ్ బ్యాక్‌లో బ్యూటీఫుల్ గ్రేస్‌ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు నటి త్రిష. ఈ చెన్నై సోయగం ఈ మధ్య ఏ సినిమా చేసినా హిట్టే. పొన్నియిన్ సెల్వన్ రెండు చాప్టర్లలోనూ కుందవై కేరక్టర్‌లో నటించి మెప్పించారు. ఇప్పుడు విజయ్ పక్కన లియోలోనూ ఆమే నాయిక.
ఆ మధ్య వరుసగా సినిమాలకు సంతకాలు చేసేశారు నటి త్రిష. అయితే ఇప్పుడు వాటికి కాల్షీటు సర్దలేక సతమతమవుతున్నారట. అందుకే ఓ సినిమాను వదులుకున్నారన్నది చెన్నై న్యూస్.
ఈ ఏడాది సంక్రాంతికి తునివు సినిమాతో ప్రేక్షకులను పలకరించారు హీరో అజిత్. ఆ సినిమాకు చాలా మంచి కలెక్షన్లు వచ్చాయి తమిళనాడులో. సంక్రాంతికి థియేటర్లలోనూ, థియేటర్ల ముందు కూడా దీపావళి పండగ జరుగుతోంది. రికార్డుల మోత మోగుతోందని ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఆ వెంటనే విఘ్నేష్ శివన్ సినిమా స్టార్ట్ కావాల్సింది. కానీ కాలేదు. కాస్త గ్యాప్ తర్వాత ఆయన మగిళ్ తిరుమేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో నాయికగా త్రిషను సెలక్ట్ చేశారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఆగస్టు నుంచి షూటింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చెన్నై పూందమల్లి సమీపంలో ఈ సినిమా కోసం పెద్ద సెట్ కూడా నిర్మించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి త్రిష తప్పుకున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది.
త్రిష స్థానంలో తమన్నా యాక్ట్ చేయడానికి ఓకే చెప్పారట. ఈ 33 ఏళ్ల నటి, ఇప్పుడు సూపర్ బిజీ అవుతున్నారు. ఇంతకు ముందు అజిత్‌తో వీరమ్ సినిమా చేశారు తమన్నా. ఆ తర్వాత ఇదే వారిద్దరూ కలిసి నటించడం. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత వీరిద్దరూ జోడీ కడుతుండటంతో హ్యాపీగా ఫీలవుతున్నారు జనాలు.