English | Telugu
'లక్కీ భాస్కర్'గా దుల్కర్ సల్మాన్.. లక్ కలిసొస్తుందా!
Updated : Jul 28, 2023
'మహానటి', 'సీతారామం' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు(జూలై 28) ఈ మూవీ టైటిల్ ను రివీల్ చేశారు మేకర్స్.
'నమ్మశక్యంకాని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన ఒక సాధారణ మనిషి కథ'గా ఈ చిత్రం రూపొందుతోందని ప్రకటన సందర్భంగా చిత్ర నిర్మాతలు తెలిపారు. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రానికి 'లక్కీ భాస్కర్' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తాజాగా ప్రకటించారు. 'లక్కీ భాస్కర్'గా దుల్కర్ ఎలా అలరిస్తాడో, లక్ తో అతను ఏం సాధించాడో తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాలి.
ఈ ఏడాది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మించిన 'సార్'తో బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకీ అట్లూరి.. వరుసగా ఆ బ్యానర్స్ లోనే సినిమాలు చేస్తుండటం విశేషం. తమిళ హీరో ధనుష్ నటించిన 'సార్'తో మంచి హిట్ కొట్టిన వెంకీ.. మలయాళ హీరో దుల్కర్ తోనూ ఆ హిట్ మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి.
'సార్'కి చార్ట్‌బస్టర్ సంగీతం అందించిన జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.