English | Telugu
విజయ్ శత్రువు ఆంటోనీ దాస్!
Updated : Jul 30, 2023
దళపతి విజయ్‌కి ఉన్న శత్రువు ఎవరో తెలుసా? ఆంటోనీ దాస్! ఆయన ఎలా ఉంటాడో తెలుసా? అచ్చం ఇలాగే... అంటూ సంజయ్ దత్ గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. దళపతి విజయ్ నటిస్తున్న సినిమా లియో. ఈ సినిమాలో ఆంటోనీ దాస్ కేరక్టర్ చేస్తున్నారు విజయ్. ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు సంజయ్ దత్. ఈ సినిమా నుంచి ఆంటోనీ దాస్ గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసి విషెస్ చెప్పారు మేకర్స్. ఆ గ్లింప్స్‌ని బట్టి ఆంటోనీదాస్ రూలర్ అని, ప్రతి ఒక్కరూ ఆయన మాట వింటారనీ అర్థమైంది. మా వైపు నుంచి మీకు చిన్న గిఫ్ట్ సార్ అంటూ, సంజయ్‌దత్‌తో పనిచేయడం చాలా ఆనందదాయకమని పోస్ట్ పెట్టారు డైరక్టర్ లోకేష్ కనగరాజ్.
37 సెకన్ల వీడియో అది. డెడ్లీ, రూత్‌లెస్ సంజయ్‌దత్‌ని చూపించారు వీడియోలో. తన చెవుల దగ్గర ఫోన్, సిగరెట్ పీలుస్తూ రూత్‌లెస్‌గా కనిపించారు సంజయ్‌దత్. ఆయన నవ్వును డెవిలిష్ స్మైల్ అంటూ వర్ణిస్తున్నారు నెటిజన్లు. కేజీయఫ్2లో సూపర్‌డూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సంజయ్ దత్ లియోలో ఎలా కనిపిస్తారో చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు జనాలు.
లియోలో విజయ్‌కి తండ్రిగా కనిపిస్తారట సంజయ్ దత్. ``సినిమాలో విజయ్‌కి తండ్రి అయినప్పటికీ, పూర్తిగా గ్యాంగ్‌స్టర్ రోల్‌లో నటించారు సంజయ్ దత్. విజయ్ కూడా ఇందులో గ్యాంగ్‌స్టర్‌గానే కనిపిస్తారు. బ్లడ్ అండ్ స్వీట్ అంటూ ఈ కథను లోకేష్ ఎలా జస్టిఫైడ్ చేశారన్నది ఆసక్తికరం`` అని అంటున్నారు యూనిట్ మెంబర్స్.
లియో కూడా లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్శ్ లోనే ఉంటుంది. ఇప్పటికీ ఈ విషయాన్ని మేకర్స్ అఫిషియల్‌గా చెప్పలేదు. కానీ, పలు అంశాలు చెప్పకనే చెబుతున్నాయని అంటున్నారు దళపతి ఫ్యాన్స్.
సంజయ్ దత్, త్రిష, అర్జున్ సర్జ, ప్రియా ఆనంద్, మిస్కిన్, గౌతమ్ వాసుదేవ మీనన్, మన్సూర్ అలీ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. అనిరుద్ రవిచంద్ ఈ సినిమాకు సంగీతం అందించారు.