English | Telugu

నీ ముక్కు క్యూట్ గా ఉంది.. బేబీకి బ్రేక్ వచ్చింది.. నీకు బ్రేక్ ఎప్పుడొస్తుంది?

దీప్తి సునైనా ఈ బ్యూటీ ఇంతకు ముందు వరకు ఎవరికీ పెద్దగా తెలీదు కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ కి వెళ్లిందో అప్పటి నుంచి అందరికీ బాగా పరిచయం ఐపోయింది. ఐతే బిగ్ బాస్ కి వెళ్లి వచ్చాక చాలా మందికి అదృష్టం కలిసి వస్తుంది కానీ దీప్తికి మాత్రం ఏ అదృష్టం ఇంకా తలుపు తట్టలేదు. ఏదేమైనా తన రూట్ లో తాను వెళ్ళిపోతూ ఉంది. సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ అయ్యింది. క్యూట్ బార్బీ డాల్ లాగా కనిపిస్తూ అలరిస్తూ ఉంటుంది. దీప్తి ఫోటోలు చూసిన నెటిజన్లు హీరోయిన్‌గా ట్రై చేయవచ్చు కదా అంటూ సలహాలు ఇస్తున్నారు. చూడటానికి చిన్న పిల్లలా కనిపించే దీప్తి సునైనా ..సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్‌గా కనిపిస్తుంది. రీసెంట్ గా బ్లాక్ డ్రెస్ వేసుకుని కనిపించింది ..అంతే ఇంకేముంది.. బేబీ మూవీ ద్వారా వైష్ణవి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. మరి నీకెప్పుడు వస్తుందో బ్రేక్...ఫొటోషూట్స్ తప్ప ఏమీ లేవు నీకు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఇప్పుడు తనను క్వశ్చన్స్ అడగమని అడిగింది దీప్తి.. ఇంకేముంది వెంటనే స్టార్ట్ అయ్యింది చాటింగ్. "నీ ముక్కు ఇన్ఫినిటీ షేప్ లో ఉంటుంది..భలే క్యూట్ గా" అనేసరికి "మీ ఊహలకే వదిలేస్తున్నా" అని చెప్పింది. "ఏ ఫ్రూట్ అంటే నీకు ఇష్టం" అని అడిగేసరికి "మీ క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేయను" అని చెప్పింది. "షూటింగ్స్ ఏమీ లేవనుకుంటా ఊరికే స్టోరీస్ పెడుతున్నారు" అనేసరికి సైలెంట్ గా అలా చూస్తూ ఉంది.

ఐతే బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి మూవీ ఛాన్సెస్ కోసం తెగ వెయిట్ చేస్తోంది దీప్తి. బిగ్ బాస్ 2 లో కనిపించింది. ఇప్పుడు సీజన్ 7 స్టార్ట్ కాబోతోంది. ఈ మధ్య సీజన్స్ లో వచ్చిన వాళ్లంతా ఎంతో కొంత అక్కడక్కడా మెరుస్తూనే ఉన్నారు. కానీ దీప్తి మాత్రం అలాగే ఉండిపోయింది అంటున్నారు నెటిజన్స్. ఐతే దీప్తి మాత్రం స్పీడ్ గా కాకుండా నెమ్మదిగా సినిమాలవైపుకు అడుగులేస్తోంది. 2018లో హీరో నిఖిల్ నటించిన 'కిర్రాక్ పార్టీ' మూవీలో నటించింది. ప్రస్తుతం యూట్యూబ్ లోనే మ్యూజిక్ వీడియోస్ చేస్తూ పాపులారిటీని సంపాదిస్తోంది. ఇటీవల 'ఏమై ఉండచ్చో' మ్యూజిక్ వీడియోలో నటించింది. ఈ సాంగ్ బాగా పాపులర్ అయ్యింది.