English | Telugu
ఇండియన్2లో లేడీ గెటప్‌లో కమల్!
Updated : Jul 29, 2023
స్టార్ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇండియన్2. ఈ మూవీ గురించి మరో ఆసక్తికరమైన వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇండియన్ సినిమా సీక్వెల్‌లో కమల్‌హాసన్ లేడీ గెటప్‌లో కనిపిస్తారన్నది ఆ న్యూస్. కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన అవ్వై షన్ముగం (తెలుగులో భామనే సత్యభామనే పేరుతో విడుదలైంది)లో ఫీమేల్ కేరక్టర్ చేశారు కమల్‌హాసన్. 1996లో విడుదలైంది భామనే సత్య భామనే. ఆ తర్వాత 2008లో మళ్లీ లేడీ గెటప్‌లో కనిపించారు లోకనాయకుడు. దశావతారం చిత్రంలో బామ్మ కేరక్టర్ చేశారు లోకనాయకుడు. ఈ సినిమాల తర్వాత ఇప్పుడు ఇండియన్2లో మళ్లీ లేడీ గెటప్‌లో కనిపిస్తారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. సెట్లో ఆయన్ని లేడీ గెటప్‌లో చూసిన వారందరూ వావ్ అనుకున్నారట.
అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. రవివర్మ కెమెరాను హ్యాండిల్ చేస్తున్నారు. రెడ్ జెయింట్ మూవీస్, లైకా సంస్థ నిర్మిస్తున్న సినిమా ఇది. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సిద్ధార్థ్, సముద్రఖని, బాబీ సింహా, ఢిల్లీ గణేష్ తో పాటు పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కమల్ హాసన్‌కి లోకేష్ కనగరాజ్ రీసెంట్‌గా హిట్ ఇచ్చారు. ఆ వేడి చల్లారకముందే మరో సినిమాను రిలీజ్ చేయాలన్నది కమల్ ప్లాన్. అందుకే మొదలై ఆగిపోయిన ఇండియన్2ని మళ్లీ పట్టాలెక్కించారు.
కెహెచ్233
ప్రస్తుతం యుఎస్‌లో ఉన్న కమల్‌హాసన్ త్వరలోనే ఇండియాకు తిరిగి వస్తారు. ఆయన రాగానే కెహెచ్ 233 సినిమా షూటింగ్ మొదలవుతుంది. ఈ సినిమాకు హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమా కోసమే రైటింగ్ విభాగంలోనూ పనిచేస్తున్నారు కమల్‌హాసన్. తన ఓన్ బ్యానర్ మీద తెరకెక్కిస్తున్నారు ఈ మూవీని. మరోవైపు బిగ్ బాస్ తమిళ్ 7 హోస్ట్ గా కూడా బిజీ అవుతారు లోకనాయకుడు. అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి ప్రసారానికి రెడీ అవుతోంది బిగ్ బాస్ తమిళ్ సీజన్ 7.