ప్ర‌జానాయ‌కుల‌కు ఆద‌ర‌ణ త‌గ్గ‌దు!

మంచి ఉపాధ్యాయుడికి గుర్తింపు ఉంటుంది, మంచి క్రీడాకారుడినీ ఎప్పుడూ గౌర‌విస్తారు, అలాగే మంచి నాయ‌కుడిని ఎక్క‌డున్నా ఆద‌రించి ప‌ల‌క‌రించ‌డం జ‌రుగుతుంది. దీనికి పార్టీలతో సంబంధం లేదు. కావ‌డానికి పార్టీలు, సిద్ధాంతాల్లో వైరుధ్యం ఉన్నా, గ‌తంలో స్నేహం దెబ్బ‌తిన్నా మ‌ళ్లీ క‌లుస్తారు, ప‌ల‌క‌రించుకుంటారు, క‌లిసి ప్ర‌యాణించాల‌నీ అనుకోవ‌చ్చు. ఇపుడు తెలుగు దేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ ప్ర‌యాణంలో జ‌రిగింది ఇదే. గ‌తంలో ఆయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌పుడు ఎన్న‌డూ సుముఖంగా లేని ప్ర‌ధాని మోదీ ఇపుడు నీతి ఆయోగ్ స‌ద‌స్సుకి ఆహ్వానించారు. చంద్ర‌బాబు కూడా నిరాక‌రించ‌లేదు. ప్ర‌ధాని పిలిచారు గ‌నుక వెళ్లాల‌న్న గౌర‌వంతో వెళ్లారు. అక్క‌డ చ‌క్క‌గా పాత మిత్రులు క‌లుసుకుని పాట పాడుకున్నంత‌గా మోదీ చంద్ర‌బాబును ప‌ల‌క‌రించారు. మా వూరు రావ‌ట్లేదా అంటే ఇక్క‌డ నాకేం ప‌ని మాస్టారూ అన్నారు బాబు. మీతో మాట్లాడా ల్సింది శానా ఉంది మ‌ళ్లొచ్చిపోరాదూ.. అంటే బాబు స‌రేన‌న్నారు. ఇది టీడీపీ నాయ‌కులూ ఊహించ‌ని మ‌లుపు. ఆహ్వానించ‌డం మాట అటుంచితే ద‌గ్గ‌రికి వ‌చ్చి మ‌రీ ప‌ల‌క‌రించి మ‌ళ్లీ క‌లుద్దామ‌న‌డం ఎంతో హ‌ర్ష‌ణీయం.  రాష్ట్ర‌ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత జ‌గ‌న్ రెడ్డి ప‌లుమార్లు వెళ్లినా కేవ‌లం త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల దృష్ట్యా వెళ్లార‌న్న‌ది అం ద‌రం వింటున్న మాట‌. అన్నిసార్లూ క‌లిసినా, అంత అవ‌కాశం ఇచ్చినా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల గురించి అంత‌గా చ‌ర్చంచే అవకాశం పీఎం ఇవ్వ‌లేద‌న్న ప్ర‌చార‌మూ ఉంది. క‌నుక‌నే రాజు వెళ్లారు, వ‌చ్చార‌న్న‌ట్టుగా ఢిల్లీ నుంచి వ‌చ్చాక ఇంటికెళ్లి కాఫీ తాగి ప‌డుకో వ‌డం త‌ప్ప మీడియాకు, క‌నీసం త‌న పార్టీవారిక‌యినా ఒక్కింత వివ‌రాలు చెప్ప‌లేక‌పోయారని విశ్లేష‌కులు అంటున్నారు.  కాగా, ప్రధానితో ఆయన భేటీపై వైసీపీలో ఉలికిపాటు చాలా ఎక్కువగా ఉందని టీడీపీ నేత ఒక‌రు వ్యాఖ్యానించారు.  ఆ పార్టీ లోని భయమంతా ఇటీవ‌ల స‌జ్జ‌ల‌ మాటల్లోనే కనిపించింద‌ని, ప్రధాని వద్ద జగన్‌రెడ్డి ప్రాధాన్యం తగ్గలేదని చెప్పుకోవడానికి ఆయన చాలా తాపత్రయపడ్డారు. జగన్‌రెడ్డిని ప్రధాని గంటసేపు తన పక్కనే కూర్చోబెట్టుకున్నారని సజ్జల చెప్పారు. మరి గంటసేపు కూర్చుని రాష్ట్రానికి ఏం తెచ్చారో మాత్రం చెప్పలేద‌ని ఒక మాజీ మంత్రి ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండ‌గా, మాధవ్‌ అశ్లీల వీడియోపై పోరాటాన్ని ఉధృతం చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ నేతలు.. ప్రత్యేకించి మహిళా నేతలు బలంగా పోరాడుతున్నారని, అదే సమయంలో రాయలసీమ నేతలు కూడా ఈ అంశంపై గట్టిగా మాట్లాడాలని సూచించారు. ‘మూడేళ్లు గడచిపోయాయి. ఇక అందరం ప్రజా సమస్యలపై మరింత ఉధృతంగా పోరాడా ల్సిన సమయం వచ్చిం ద‌ని పొలిట్‌బ్యూరోలో సభ్యులుగా ఉన్నసీనియ‌ర్ల‌లో  కొందరు ఇంకా పూర్తి స్థాయిలో పోరాట స్ఫూర్తి ప్రదర్శించడం లేదన్నారు. ఆ లోపం త్వరగా సవరించుకోవాల‌ని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో జెన్‌కో నిర్మించిన కృష్ణపట్నం థర్మల్‌ కేంద్రాన్ని అదానీ గ్రూపు తీసుకునే ప్రయత్నం చేస్తోందని, దీనిపై బీజేపీ సహా అన్ని పార్టీలనూ కలుపుకొని పోరాడుతున్నామని సీనియర్‌ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు. భావ సారూప్య పార్టీల ను కలుపుకొని సమష్టిగా పోరాటం చేయాలని చంద్రబాబు సూచిం చారు.  కాగా, రాష్ట్రం అభివృద్ధి పథంలో బాగా వెనుకబడిపోవడంపై ప్రవాసాంధ్రుల్లో తీవ్రమైన ఆవేదన ఉందని, వారిని అన్ని రకా లుగా కలుపుకొని పోవడానికి కార్యాచరణ రూపొందించుకోవాలని ప్ర‌స్తుతం అమెరికాలో ఉన్న‌ సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి సూచించారు.  యువతకు ప్రాధాన్యంపై కమిటీపార్టీ సంస్థాగత నిర్మాణంలో యువతకు మరింత ప్రాధాన్యం ఎలా కల్పించాలో సూచనలివ్వడానికి కమిటీని వేయాలని పొలిట్‌బ్యూరో భేటీలో నిర్ణయించారు.

క‌మ‌లం నీడ‌లోకి జ‌య‌సుధ‌!

ఆశించిన మార్పు జ‌రిగితే ఉండే ఉత్సాహం వేరే లెవెల్‌. ఇపుడు భార‌తీయ జ‌న‌తాపార్టీది అదే స్థితి. మునుగోడు ఉప ఎన్నిక జ‌రిగే వర‌కూ క‌మ‌ల‌నాధుల ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ వ్యూహాల‌న్నీ అటుకేసే ప‌నిచేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఈ నెల 21న కేంద్రమంత్రి అమిత్ షా బ‌హిరంగ స‌భ జ‌రుగ‌నుంది. దీన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టాల‌ని బీజేపీ తెలంగాణా నాయ‌కులు, అభిమానులు స‌న్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా పార్ట‌లోకి చేరేవారికి రెడ్ కార్పెట్ వెల్‌క‌మ్ చెబుతున్నారు. మునుగోడు కేంద్రంగా   తెలంగాణాలో రాజ‌కీయాల‌ను ఉర‌క‌లు వేయించాల‌ని బీజేపీ వ్యూహాల మీద వ్యూహాలు ర‌చిస్తోంది. అభిమానుల్లోనూ జోష్ నింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. అందులో భాగంగానే ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ను ప‌క‌డ్బందీగా అమ‌లుచేస్తున్నారు. టీఆర్ ఎస్‌, కాంగ్రెస్ సీనియ‌ర్ల‌ను గాలం వేసి లాగే య‌త్నాలు మ‌రింత ముమ్మ‌రం చేశారు. కేంద్ర హోం మంత్రి  అమిత్ షా స‌మావేశంలో ఆయన ముందు వారిని పార్టీలో చేర్చేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మరంగా చేప‌డుతున్నారు. ఆయ‌న ముందు తెలంగాణా బీజెపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు అంద‌రూ బండి సంజ‌య్ నాయ‌క‌త్వం ఎంత బ్ర‌హ్మాండంగా ప‌నిచేస్తున్న‌ది ప్ర‌ద‌ర్శించాల‌న్న ఆతృతనూ ప్ర‌ద‌ర్శిస్తున్నారు.  ఇప్ప‌టికే ప్ర‌ముఖ సినీ న‌టి జ‌య‌సుధ బీజేపీ తీర్ధం పుచ్చుకోవ‌డానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే సీనియ‌ర్ నాయ‌కులు,  రిటైర్డ్ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతోనూ బీజేపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ సినీనటి జయసుధ, ఉత్తర తెలంగాణకు చెందిన ఒక సినీ నిర్మాతతో బీజేపీ చేరికల కమిటీ సభ్యులు మంతనాలు జరుపుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు వివరించాయి. జయసుధ 2009లో సికింద్రాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే.   కాగా, బీజేపీలో చేరాలన్న ఆ పార్టీ నేతల ప్రతిపాదనపై జయసుధ ఇప్పటి వరకూ స్పష్టత ఇవ్వలేదని కమలం వర్గాలు పేర్కొన్నాయి. తనకు పార్టీ జాతీయ నాయకత్వం నుంచి విస్పష్ట హామీ ఇవ్వాలని ఆమె కోరినట్లు సమాచారం. మరోవైపు మాజీ ఐఏఎస్‌ అధికారి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రతినిధి తేజావత్‌ రామచంద్రునాయక్‌తోనూ బీజేపీ చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం జిల్లాలకు చెందిన పలువురు సీనియర్‌ నేతలతో, ఉద్యమకారులతో బీజేపీ చేరికల కమిటీ చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

బెంజి కారుతో రోజాకు కొత్త తలనొప్పి

గత చంద్రబాబు ప్రభుత్వ హాయాంలో నగరి ఎమ్మెల్యే రోజక్కకు తిప్పలు తప్పలేదు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ బంపర్ మెజార్టీతో వైయస్ జగన్ అధికారంలోకి వచ్చారు. అయితే జగనన్న   రాజ్యంలో కూడా ప్రస్తుత పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాకు తిప్పలు కుప్పలు తెప్పలుగా పెరిగాయట. ఈ మూడేళ్ల కాలంలో ఆమె   ఉక్కిరిబిక్కిరి అయిపోతోన్నారట.  రోజా.. వెండి తెర మీద హీరోయిన్‌గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించినా.. బుల్లితెరపై పలు కార్యక్రమాల్లో జడ్జిగా వ్యవహరించినా.. ఆ క్రమంలో విమర్శలు వచ్చినా.. ఆరోపణలు వచ్చినా అవి ఇలా వచ్చి..  అలా టచ్ చేసి అలా  వెళ్లిపోయేవి. కానీ ఇటీవల రోజా తన కుమారుడు కృష్ణ కౌశిక్‌ బర్త్‌డే గిఫ్ట్‌గా అక్షరాల కోటిన్నర రూపాయిలు పెట్టి మెర్సిడెస్ బెంజ్ కారు కోనిచ్చారు. ఆ కారు.. ఏ మూహుర్తాన కొన్నారో కానీ.. నాటి నుంచి ఆర్కే రోజాపై ఇటు విపక్షం.. అటు నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో అధికారులకు సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తులు, అప్పులు.. ఏడు కార్లు ఉన్నాయని క్లి  ఆర్కే రోజా లెక్కలు కట్టి అణాపైసాలతో సహా చెప్పారని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. ఆ లెక్కలు చెప్పిన ఆర్కే రోజా కారు కోనుగోలు కోసం చేసిన కోటిన్నర నగదు ఎలా వచ్చాయో కూడా చెప్పాలని సామాజిక మాధ్యమం సాక్షిగా  ప్రశ్నల బాణాలు సంధిస్తున్నారు. అంతేకాదు.. ఎన్నికల సందర్భంగా ఆర్కే రోజా సమర్పించిన అఫిడవిట్ సైతం సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది.   రోజా..  ఏపీఐఐసీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి..  మంత్రిగిరినే పట్టేసిన తర్వాత... సచివాలయం సాక్షిగా కలెక్షన్ క్వీన్‌ అవతారం ఎత్తారన్న చర్చ, విమర్శ..  రాష్ట్ర వ్యాప్తంగా జోరందుకుంది. అయితే తనపై వస్తున్న ఆరోపణలపై   ఆర్కే రోజా   స్పందిస్తూ.. కౌంటర్లు ఇస్తున్నా.. ఆమెపై వస్తున్న ఆరోపణలకు మాత్రం పుల్‌స్టాప్ పడడం లేదు. అంతేకాదు.. ఆర్కే రోజా ఇస్తున్న సమాధానాలకు.. అటు టీడీపీ నేతలే కాదు.. ఇటు నెటిజన్లు సైతం కౌంటర్లు ఇస్తూ మరింత ఇరుకున పెడుతున్నారు. మరో వైపు పర్యాటక శాఖ మంత్రిగారికి  బెంజి కారు.. రిషి కొండ గిఫ్ట్ అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.   ఈ విమర్శలు ఇలా ఉండగా మరోవైపు.. తన సొంత నియోజకవర్గం నగరిలో కూడా రోజాకు అసమ్మతి సెగ.. నాగు పాము బుసలు కొట్టినట్లు కొడుతోందట.   మంత్రి వర్గ సహచరుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం ప్రస్తుతానికి  రోజా  విషయంలో సైలంట్ గానే ఉన్నా.. అది తుపాను ముందు ప్రశాంతత వంటిదని రోజా వర్గీయులే అంటున్నారు. అలాగే మరోవైపు జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీలోని లీడర్ నుంచి కేడర్ వరకు అందరూ రోజాకు పట్టపగలే చుక్కులు చూపించేశారనీ, సొంత  పార్టీ  అధికారంలో ఉన్నా.. తాము చేసిన పనులకు బిల్లులు పెట్టుకున్నా నగదు రావడం లేదని.. పనుల కోసం అప్పు చేసి.. వాటిని తీర్చలేక వడ్డిలకు వడ్డీలు కడుతూ.. ఆస్తులు ఆమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వారంతా ఆర్కే రోజా ముందు ఏకరువు పెడుతుండటంతో వారిని  సముదాయించలేక   రోజా  తల ప్రాణం తోకకు వస్తోందని బాధపడుతున్నారట. కార్యకర్తల  బాధలు వినేందుకు తాను ఉన్నాననీ, తన బాధలు వినేందుకు ఎవరున్నారనీ చెబుతూ వారిని సముదాయించుకువస్తున్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి.  

ఎన్డీఎ ఖాళీ.. శుభం కార్డు పడినట్లేనా?

 జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఎ) కథ ముగిసినట్లేనా? ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్’పేయి సారధ్యంలో 24 పార్టీల కూటమిగా  కేంద్రంలో చక్రం తిప్పిన ఎన్డీఎ చిత్రానికి శుభం కార్డు పదినట్లేనా? అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు. ఇంతవరకు జాతీయ స్థాయిలో ఎంతో కొంత గుర్తింపు ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారధ్యంలోని జనతా దళ్ (యు) కూటమిలో కొనసాగడంతో, జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఉనికి ఉందని పించుకుంది. ఇప్పుడు, కొంచెం ఆలస్యంగానే అయినా పులి మీద స్వారీలోని ప్రమాదాన్ని గుర్తించి  నితీష్ కుమార్, కూటమికి గుడ్ బై చెప్పడంతో, ఎన్డీఎ కథ కంచికి చేరినట్లే అంటున్నారు. నిజానికి, 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ‘ఏకపార్టీ’ ఆధిక్యత సాధించిన రోజునే, ఎన్డీఎ కథ చివరి పేజికి చేరింది. ఇంచు మించుగా మూడు దశాబ్దాల తర్వాత మొదటిసారిగా లోక్ సభలో బీజేపీ సొంతగా సాధారణ మెజారిటీ (272)కు 10 సీట్లు అదనంగా (282) గెలిచి, మూడు పదుల చరిత్రను తిరగ రాసింది. అలాగే, 2019 ఎన్నికల్లో బీజేపీ సొంత బలమే 303 కు చేరింది. మరో వంక ప్రతిపక్ష కూటమి, యూపీఎకు సారధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ దినదిన ప్రవర్థమానంగా దిగజారి ప్రాంతీయ పార్టీల పంచన చేరే పరిస్థితికి చేరుతోంది. అయినా 2014లో తిరిగి 2019లో బీజీపీ  ప్రధాని మోడీ సారధ్యంలో ఎన్డీఎ సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో తెలుగు దేశం, శివసేన, అకాలీదళ్, సహా అనేక ప్రాంతీయ పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. అయితే, ఆ తర్వాత ఏమి జరిగింది అన్నది చరిత్ర. ఎవరి కారణాలు వారికీ ఉన్నా, ఒక్కొక్క పార్టీ ఎన్డీఎకి దూరమవుతూ వచ్చాయి. ఆ క్రమమలోనే ఇప్పుడు జేడీ(యు) వంతు వచ్చింది.  2019 ఎన్నికల్లోనూ అకాలీ దళ్, శివసేన, పాశ్వాన్ పార్టీ ఎల్’జేపీ, ఎఐఎడిఎంకే, జేడీ(యు)సహా అప్నా దళ్, ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ వంటి మరికొన్ని చిన్నా చితక పార్టీలు సహా మొత్తం తొమ్మిది పార్టీలు కలిసి పోటీచేశాయి. కానీ, ఇప్పుడు ఆ చిన్నా  చితక పార్టీలలో కొన్ని మాత్రమే కూటమిలో మిగిలాయి. బీజేపీ సహజ మిత్ర పక్షాలు శివసేన, అకాలీ దళ్’ తాజాగా జేడీ(యు) సహా ప్రధాన ప్రాంతీయ పార్టీలు అన్నీ ఎన్డీఎ గూడు వదిలి పోయాయి.. ఇక  ఇప్పుడు ఎన్డీఎలో ఉన్న పార్టీలు ఏవీ రాజకీయంగా అంతగా ప్రభావం చూపగలిగే పార్టీలు కాదు. ఏ పార్టీకి కూడా లోక్ సభలో  ఒకటి రెండు స్థానాలకు మించి లేవు.  అయితే, మిత్ర పక్షాలు బీజేపీకి ఎందుకు దూరం అవుతున్నాయి? బీజేపీతో చెలిమిని మిత్ర పక్షాల ఎందుకు దృతరాష్ట్ర కౌగిలిగా భావిస్తున్నాయి? బీజేపీకి మిత్ర పక్షాలు దురమవుతున్నాయా? లేక బీజేపీనే ఉద్దేసపూర్వకంగా మిత్ర పక్షాలను పోమ్మనకుండా పొగబెట్టి, సాగనంపుతోందా? మిత్ర పక్షాలు మోడీ, షా జోడీ రాజాకీయ వ్యూహ చతురతను తట్టుకోలేక చక్రబంధాలను చేదించుకుని బయట పడుతున్నారా? అంటే,ఇదమిద్దంగా ఇదీ కారణం అని చెప్పడం కొంచెం కష్టమే అవుతుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. తెలుగు దేశం పార్టీ బయటకు వచ్చిన కారణాలకు, ఇప్పుడు నితీష్ కుమార్  బయటకు వెళ్ళిన కారణాలకు పొంతన లేదు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రత్యేక హోదా కోసం  ధర్మ పోరాటం ప్రకటించి బయటకు వచ్చారు. చంద్రాబాబు రాజకీయ ప్రయోజనాలు చూసుకోలేదు.కానీ, నితీష్ కుమార్ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగుతుందని, కమల దళానికి కతీఫా చెప్పలేదు. బీజేపీ చెలిమి భస్మాసుర హస్తం అవుతోందన్న భయంతోనే ఆపర్తితో తెగతెంపులు చేసుకున్నారు. అలాగే, అకాలీ దళ్, శివసేన ఒక్కొక్క పార్టీది ఒక్కొక్క క(వ్య)థ.    అయితే, ఒకటి మాత్రం నిజం, మోడీ, షా జోడీ నాయకత్వంలో బీజేపీ శతృమిత్ర బంధాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలను,‘సమ’ దృష్టితో చూస్తోంది. అన్ని పార్టీలను రాజకీయ ప్రత్యర్ధులుగానే చూస్తున్నారు. అందుకే మోడీ, షా జోడీ అడుగులు  ఏక పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణం వైపుకు సాగుతున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి, ఒక విధంగా మోడీ,షా జోడీ రాజకీయ అశ్వమేధ యాగం సాగిస్తున్నారు. కాంగ్రెస్ ముక్త భారత్’ లక్ష్యంగా మొదలు పెట్టిన ఈ యాగం కాంగ్రెస్ కథ ముగింపుతో ముగిసేలా లేదని జరుగుతున్నపరిణామాలు, నడుస్తున్న చరిత్ర స్పష్టం చేస్తున్నాయి.  అయితే, గతంలో కాంగ్రెస్ పార్టీ ఏకచత్రాధిపత్యం నడిచే రోజుల్లో, హస్తం పార్టీ కూడా ఇవే పోకడలు పోయింది. ఒక దశలో ఇందిరాగాంధీ, ప్రతిపక్ష్లాల గొంతు నొక్కేందుకు ఏకంగా దేశంలో అత్యవసర పరిస్థితినే విధించారు. ఇప్పుడు ఆ పరిస్థతి పునరావృతం అయ్యే అవకాసం లేదు కానీ, అధికార ఇదే ధోరణి, ఇవే పోకడలు కొనసాగితే ప్రజవామ్య వ్యవస్థ వొడిదుడుకులు ఎదుర్కొనవలసి వస్తుందని అయితే, రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

వైసీపీ కార్యాల‌యాలుగా వ‌ర్సిటీలు.. మండిప‌డ్డ లోకేష్‌

అనాదిగా రాజ‌కీయాలను కుల మ‌తాలే శాసిస్తున్నాయి. ప్ర‌జాసంక్షేమం కోరి రాజ‌కీయాల్లోకి వ‌చ్చే వారు అధికార వ‌ర్గానికి చెంది న వార‌యితే మ‌రీ మంచిది లేక‌పోతే ఇబ్బందులు, నిర్ల‌క్ష్యానికి గుర‌వుతూనే ఉన్నార‌నే వాద‌నా ఉంది. దీని మీద నిత్యం అన్ని వ‌ర్గాల నుంచి భారీ విమ‌ర్శ‌లు ప్ర‌భుత్వాలు ఎదుర్కొంటూనే ఉన్నాయి.  ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎంత చెప్పి నా, ఎన్ని వాగ్దా నాలు చేసి వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి ఎన్ని జిమ్మిక్కులు చేసినా చివ‌రాఖ‌రికి అధికారం అంట‌గ‌డుతు న్న‌ది మాత్రం వారి సామాజిక వ‌ర్గానికి చెందిన‌వారే కావ‌డం దారుణం. అందుకు జ‌గ‌న్ స‌ర్కార్ తీరే ఉదాహరణ. అందుకు తాజా ఉదాహ‌ర‌ణ ఒక బీసీ ఉద్యోగి ప్ర‌భుత్వాధికారుల వేధింపులు త‌ట్టుకోలేక ఉద్యోగానికి రాజీనామా చేయ‌డం. ఇది రాష్ట్రంలోని అరా చ‌క పాల‌న‌కు అద్దంప‌డుతోంద‌ని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ అన్నారు. అస‌లు విశ్వ‌విద్యాల‌యాల‌నే వైసీపీ కార్యాల‌యాలుగా మార్చేస్తున్నార‌ని లోకేష్ మండిప‌డ్డారు.  అన్నమయ్య జిల్లా కలికిరి జేఎన్టీయూ సూపరింటెండెంట్ నాగభూషణం  వీఆర్ఎస్ తీసుకుంటానని ప్రకటించడం బాధాకరమని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆయన్ని అనంతపురం నుంచి అన్నమయ్య జిల్లా కలికిరికి బదిలీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.   పెత్తనం మొత్తం ఒకే సామాజిక వర్గానికి అప్పజెప్పి బడుగు, బలహీన వర్గాల ఉద్యోగులను అణగదొక్కాలని చూస్తున్నా రన్నారు. వైసీపీ నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీల్లో ఇదే పరిస్థితి ఉంద న్నారు. సీఎం కులపిచ్చ తగ్గించుకుని ఇతర సామాజికవర్గాల వారి ఆత్మ గౌరవం కాపాడాలని లోకేష్ హితవు పలికారు.

మునుగోడులో టీఆర్ఎస్ వ్యూహం అదేనా?

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు అవసరం లేని తలనొప్పి వచ్చి పడింది. అదే మునుగోడు ఉప ఎన్నిక. అది టీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కాదు. అక్కడ ఏ పార్టీ గెలిచినా టీఆర్ఎస్ కు ఒరిగేది కానీ, పోయేది కానీ ఏముండదు. అయినా అనివార్యంగా  ఆ ఉప ఎన్నికను ప్రతిష్ఘాత్మకంగా తీసుకోవలసిన అవసరం తన్ను కొచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు జరగనున్న ఈ ఉప ఎన్నికలో విజయం సాధిస్తేనే రాష్ట్రంలో తమ సత్తా ఏ మాత్రం తగ్గలేదని చాటుకునేందుకు అవకాశం ఉంటుంది. అందుకు భిన్నంగా ఫలితం వస్తే.. ఇంత కాలంగా టీఆర్ఎస్ పనై పోయింది. కేసీఆర్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది అంటూ బీజేపీ  చేస్తున్న ప్రచారానికి ఊతం లభిస్తుంది. ఆ ప్రచారమే వాస్తవమా అన్న అనుమానం పార్టీ శ్రేణుల్లో ప్రబలే ప్రమాదమూ ఉంది. పరిశీలకులు చేస్తున్న విశ్లేషణలు ఇలా ఉంటే.. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆలోచన మాత్రం వేరేలా ఉందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక జస్ట్ ఉప ఎన్నిక అంతే అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యను ఉటంకిస్తూ.. టీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకోవడం లేదని చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగా కేటీఆర్ తనయుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా ఆస్క కేటీఆర్ అన్న కార్యక్రమంలో నెటిజన్లతో భేటీ సందర్భంగా దాదాపుగా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక వల్ల వచ్చిదీ, పోయేదీ ఏం ఉండదు అని వ్యాఖ్యానించారు. మునుగోడులో విజయం కోసం టీఆర్ఎస్ ఏ మంత సీరియస్ గా ప్రయత్నించడం లేదని చాటేందుకే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అలా మాట్లాడారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. అసలీ ఉప ఎన్నికపై కంటే కేసీఆర్ దృష్టి అంతా ఆ తరువాత రానున్న అసెంబ్లీ ఎన్నికలపైనే ఉందని వారంటున్నారు. ఆ ఎన్నికల్లో  విజయం కోసమే ఆయన ఇప్పటి నుంచీ వ్యూహరచన చేస్తున్నారని చెబుతున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమేననీ, దానికి తమ అధినేత కేసీఆర్ కూడా గుర్తించారనీ అంటున్నారు. అయితే ఆయన అంచనా ప్రకారం టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు గంపగుత్తగా ఒకే పార్టీకి పడితేనే టీఆర్ఎస్ కు కష్టమనీ, అలా కాకుండా టీఆర్ఎస్ ప్రత్యర్థుల మధ్య వ్యతిరేక ఓటు చీలిపోతే  పార్టీ విజయం సునాయాసమని ఆయన భావిస్తున్నారు. పార్టీ ప్రత్యర్థుల మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే ముచ్చటగా మూడో సారి టీఆర్ఎస్ అధికారంలోకి రావడం, తాను ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే మునుగోడు ఉన ఎన్నికను పెద్దగా సీరియస్ గా తీసుకోనవసరం లేదంటున్నారు. అన్నిటికీ మించి జాతీయ స్థాయిలో బీజేపీ పరువు తీయడానికి ఈ ఎన్నికను ఉపయోగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. హస్తిన స్థాయిలో చక్రం తిప్పి మరీ టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టడమే లక్ష్యంగా మునుగోడు ఉప ఎన్నికకు మార్గం సుగమం చేసిన బీజేపీకి గుణపాఠం చెప్పేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కేసీఆర్ తన మంత్రివర్గ సహచరుల వద్ద, పార్టీ ముఖ్యుల వద్దా చెప్పినట్లు టీఆర్ఎస్ శ్రేణుుల చెబుతున్నాయి. జాతీయ స్థాయిలో బీజేపీకి దిమ్మ తిరిగేలా మునుగోడు ఉప ఎన్నికలో ఆ పార్టీ పరాజయం పాలయ్యేలా ఎత్తులు వేయాలని ఆయన భావిస్తున్నారు. అందుకే మునుగోడు ఉప ఎన్నికలో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ కాంగ్రెస్ కు మద్దతు నిచ్చి ఆ పార్టీని గెలిపిస్తే బీజేపీకి గాలి తీసేసినట్లౌతుందని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. పరిశీలకులు కూడా పోటీ పడి ఓడిపోయి హుజూరాబాద్ లో భంగపడిన దాని కంటే.. కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి ఊతం ఇచ్చి.. బీజేపీని ఓడించడం వల్లే రాజకీయంగా ఎక్కువ ప్రయోజనం టీఆర్ఎస్ కు ఉంటుందని అంటున్నారు. అందుకే మునుగోడు ఉప ఎన్నికను కలిసి వచ్చిన అవకాశంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావించే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. మునుగోడు కచ్చితంగా కాంగ్రెస్ కు కంచుకోట. అక్కడ బీజేపీకి గానీ, టీఆర్ఎస్ కు గానీ పెద్దగా పట్టు లేదు. అయితే కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేను తమ పార్టీలో చేర్చుకుని బీజేపీ అక్కడ ఉప ఎన్నికలో లబ్ధి పొందేలా పథక రచన చేసి అమలు చేస్తోంది. ఇక్కడే కేసీఆర్ తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టే అవకాశం ఉందంటున్నారు. బీజేపీకి రాష్ట్రంలో ప్రచారం చేసుకుంటున్నంతగా బలం కానీ, ప్రజాభిమానం కానీ లేదని చాటేందుకు మునుగోడు ఉప ఎన్నికను సాధనంగా వాడుకోవాలని భావిస్తున్నట్లు తెరాస శ్రేణులు చెబుతున్నాయి. అందుకే మునుగోడులో కాంగ్రెస్ కు ఇప్పటికే గట్టి  ఓటు బ్యాంకు ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి రాజీనామా కారణంగా అక్కడ తగ్గిన ఓటును తన మద్దతు ద్వారా కాంగ్రెస్ కు అందేలా చేస్తే కాంగ్రెస్ విజయం సాధిస్తుంది. టీఆర్ఎస్ కు అది ఎటూ సిట్టింగ్ సీటు కాకపోవడం వల్ల కాంగ్రెస్ విజయం సాధిస్తే.. బీజేపీది బలం కాదు వాపు మాత్రమే అని చాటేందుకు పనికి వస్తుంది. ఆ తరువాత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎటూ కాంగ్రెస్, బీజేపీల మధ్య ప్రభుత్వ ఓటు వ్యతిరేక ఓటు చీలి తమ విజయం ఖాయమౌతుందన్నది టీఆర్ఎస్ వ్యూహంగా చెబుతున్నారు. మునుగోడు విజయంతో కాంగ్రెస్ మరింత ఉత్సాహంగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతుంది. అప్పుడు కచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక భారీగా ఉంటుందన్నది కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు.   మునుగోడు ఉప పోరును పూర్తిగా బీజేపీ- కాంగ్రెస్ మధ్య ముఖాముఖీ పోరుగా మారితేనే టీఆర్ఎస్ కు రాజకీయంగా ప్రయోజనం చేకూరుతుందన్న భావనలో కేసీఆర్ ఉన్నారని పరిశీలకులు అంటున్నారు. అందుకే మునుగోడు ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం లేదనీ, అదొక ఉప ఎన్నిక అంతేనని కేసీఆర్ వ్యాఖ్యానించారంటున్నారు.

బ‌ల‌ప‌డుతున్న నీటిచ‌క్రం ... భ‌యాందోళ‌న‌ల్లో ప్ర‌జ‌లు

వాతావరణ మార్పు నీటిచక్రాన్ని తీవ్రతరం చేస్తోంది, మరింత శక్తివంతమైన తుఫాను లు, వరదలను తీసుకువస్తోంది. తీవ్రమవుతున్న నీటి చక్రం అంటే తడి, పొడి తీవ్రతలు, నీటి చక్రం సాధారణ వైవి ధ్యం రెండూ పెరుగుతాయి. శక్తివంత మైన తుఫానువ్యవస్థలు జూలైచి వరలో యు. ఎస్ అంతటా ఆకస్మిక వరదలను ప్రేరేపిం చాయి, రికార్డ్ వర్షపాతంతో సెయింట్ లూ యిస్ పొరుగు ప్రాంతాలను ముంచెత్తా యి, తూర్పుకెంటకీలో బురదజల్లులు ప‌డ్డాయి, ఇక్కడ వరదల్లో కనీసం 16 మంది మరణిం చారు. నెవాడాలోని మరో వరద లాస్ వెగాస్ స్ట్రిప్‌ను ముంచెత్తింది. నీటికి సంబంధించిన విపరీతమైన సంఘటనలపై వాతావరణ మార్పుల ప్రభావం ఎక్కువగా స్పష్టంగా కనిపిస్తోంది. యుఎస్‌లో తుఫానులు ఈ వేసవిలో భారతదేశం, ఆస్ట్రేలియాలో గత సంవ త్సరం పశ్చిమ ఐరోపాలో తీవ్ర వ‌ర‌ద‌ల‌కు కార‌ణ‌మ‌య్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తల అధ్యయనాలు నీటి చక్రం తీవ్రమవుతోంది,  గ్రహం వేడెక్కుతున్న కొద్దీ తీవ్రతరం అవుతుం దని తెలియ‌జేశాయి. వాతావ‌ర‌ణ మార్పుల‌పై ప్ర‌భుత్వ ప్ర‌త్యేకశాఖ‌ కోసం 2021లో శాస్త్ర‌వేత్త‌లు చేసిన అంతర్జాతీయ వాతా వరణ అంచనా వివరాలను తెలియజేస్తుంది. ఇది మధ్యధరా, నైరుతి ఆస్ట్రేలియా, నైరుతి దక్షిణ అమెరికా, దక్షిణాఫ్రికా, పశ్చిమ ఉత్తర అమెరికాలో ఎండబెట్టడంతో సహా చాలా ప్రాంతాలలో మరింత తీవ్రమైన వర్షపాతం, పొడి తీవ్రతలతో సహా తడి తీవ్రతలు రెండింటిలో పెరుగుదలను నమోదు చేసింది. భవిష్యత్తులో వేడెక్కడంతో తడి, పొడి తీవ్రతలు పెరుగుతూనే ఉంటా యని కూడా ఇది తెలియ‌జేస్తుంది.  వాతావరణం, సముద్రం, భూమి, ఘనీభవించిన నీటి రిజర్వాయర్ల మధ్య కదులుతూ పర్యావరణం ద్వారా నీటి చక్రాలు. ఇది వర్షం లేదా మంచుగా పడి, భూమిలోకి ప్రవేశించవచ్చు, జలమార్గంలోకి పరుగెత్తవచ్చు, సముద్రంలో చేరవచ్చు, స్తంభింప జేయవచ్చు లేదా వాతావరణంలోకి తిరిగి ఆవిరైపోవచ్చు. మొక్కలు కూడా భూమి నుండి నీటిని తీసుకుంటాయి, వాటి ఆకుల నుండి ట్రాన్స్పిరేషన్ ద్వారా విడుదల చేస్తాయి. ఇటీవలి దశాబ్దాలలో ఊహించ‌ని మార్పు చోటుచేసుకుంది. అనేక కారకాలు నీటి చక్రాన్ని తీవ్రతరం చేస్తున్నాయి, అయితే అత్యంత ముఖ్యమైన వాటిలో ఒకటి వార్మింగ్ ఉష్ణోగ్రతలు గాలిలో తేమ మొత్తంపై గరిష్ట పరిమితిని పెంచుతాయి. ఇది మరింత వర్షం కురిసే అవకాశాలను పెంచుతుంది. వాతావరణ మార్పు ఈ అంశం ఐపిసిసి నివేదికలో చర్చించబడిన సాక్ష్యాలన్నింటిలో నిర్ధారించబడింది. ఇది ప్రాథమిక భౌతిక శాస్త్రం నుండి కంప్యూటర్ నమూనాల ద్వారా అంచనా వేశారు. ఇది వేడెక్కుతున్న ఉష్ణోగ్రతలతో వర్ష పాతం తీవ్రతలో సాధారణ పెరుగు దలగా ఇప్పటికే పరిశీలన డేటాలో తెలియ‌జేశారు. విపత్తుల కోసం సిద్ధం చేయడం కంటే దీనిని నీటి చక్రంలో ఇతర మార్పులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. నీరు అన్ని పర్యావరణ వ్యవస్థలకు, మానవ సమాజాలకు మరియు ముఖ్యంగా వ్యవసాయానికి అవసరమైన వనరు. ఒక ఇంటెన్ సిఫైయింగ్ వాటర్ సైకిల్ అంటే తడి, పొడి తీవ్రతలు, నీటి చక్రం సాధారణ వైవిధ్యం రెండూ పెరుగుతాయి, అయితే ప్రపంచ వ్యాప్తంగా ఒకే విధంగా ఉండవు. చాలా భూభాగాలకు వర్షపాతం తీవ్రత పెరుగుతుందని అంచనా వేయబడింది, అయితే మధ్య ధరా, నైరుతి దక్షిణ అమెరికా,పశ్చిమ ఉత్తర అమెరికాలో పొడిబారడం అత్యధికంగా పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా, గ్లోబల్ ఉష్ణోగ్రతలు పెరిగే ప్రతి ఒక్క‌ డిగ్రీ సెల్సియస్‌కు రోజువారీ తీవ్ర అవపాత సంఘటనలు దాదాపు 7 శాతం మేర పెరిగే అవకాశం ఉంది. గ్లోబల్ ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ నీటి చక్రంలోని అనేక ఇతర ముఖ్యమైన అంశాలు కూడా మారుతాయి, పర్వత హిమానీ నదాల తగ్గింపు, కాలానుగుణ మంచు కవచం తగ్గడం, ముందుగా మంచు కరిగిపోవడం, వివిధ ప్రాంతాలలో రుతుపవన వర్షాలలో విరుద్ధమైన మార్పులతోసహా, నివేదిక చూపిస్తుంది. కోట్లాది ప్రజల నీటి వనరులపై ప్రభావం చూపు తుంది. నీటి చక్రం  ఈ అంశాలలో ఒక సాధారణ ఇతివృత్తం ఏమిటంటే, అధిక గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు పెద్ద ప్రభావాలకు దారితీ స్తాయి. ఐపిసిసి విధాన సిఫార్సులు చేయదు. బదులుగా, ఇది విధాన ఎంపికలను జాగ్రత్తగా మూల్యాంకనం చేయడానికి అవసరమైన శాస్త్రీయ సమాచారాన్ని అందిస్తుంది. విభిన్న ఎంపికల యొక్క చిక్కులు ఏమిటో ఫలితాలు చూపుతాయి. నివేదికలోని శాస్త్రీయ ఆధారాలు ప్రపంచ నాయకులకు స్పష్టంగా చెబుతున్న విషయం ఏమిటంటే, గ్లోబల్ వార్మింగ్‌ను పారిస్ ఒప్పందం లక్ష్యం 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయడం వల్ల గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తక్షణం, వేగవంతమైన,  పెద్ద ఎత్తున తగ్గించడం అవసరం. ఏదైనా నిర్దిష్ట లక్ష్యంతో సంబంధం లేకుండా, వాతావరణ మార్పు ప్రభావాల తీవ్రత గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలతో దగ్గరి సంబంధం కలిగి ఉందని స్పష్టంగా తెలుస్తుంది. ఉద్గారాలను తగ్గించడం వల్ల ప్రభావాలను తగ్గిస్తుంది. డిగ్రీ  ప్రతి భాగం ఎంతో కీల‌కం

జ‌య‌హో భార‌త్‌!

ఊహించిన‌దానికంటే భార‌త్ క్రీడాకారులు 2022 కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చారు. భార‌త్ ను క్రీడాచ‌రిత్రంలో ఉన్న‌త స్థాయిలో నిల‌బెట్టారు. జ‌య‌హో భార‌త్‌. సోమవారం (ఆగస్టు 8) 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో భారతదేశం చిరస్మ రణీయ ప్ర‌ద‌ర్శ‌న‌ను ముగించింది. బ్యాడ్మింటన్‌లో పివి సింధు, లక్ష్య సేన్, సాత్విక్ రంకిరెడ్డి/చిరాగ్ శెట్టి వరుసగా మహిళల సింగిల్స్, పురుషుల సింగిల్స్, పురుషుల డబుల్స్ టైటిల్స్ ను గెలుచుకోవడంతో హ్యాట్రిక్ విజయాలు సాధించినందున ఆఖరి రోజున దేశం నాలుగు స్వర్ణాలను గెలుచుకుంది. పురుషుల టేబుల్ టెన్నిస్ సింగిల్స్ ఈవెంట్‌లో శరత్ కమల్ స్వర్ణం కైవసం చేసుకోవడం ద్వారా కేక్‌పై చెర్రీని జోడించాడు. ఈ విజయం కొన సాగుతున్న ఎడిషన్‌లో అతని నాల్గవ పతకం, గేమ్‌ల చరిత్రలో మొత్తంగా 12వ పతకం, ఇది అతన్ని రెండవ అత్యంత  భారతీయ అథ్లెట్‌గా చేసింది. మొత్తం 61 పతకాలతో భారత్ పట్టికలో 4వ స్థానంలో నిలిచింది.  కాగా 2018 లెక్కల కంటే ఐదు తక్కువ పతకాలను సాధిం చింది, అయితే సంఖ్యలను పరిశీలిస్తే, భారతదేశం మెరుగైన ప్రదర్శన కనబరిచింది. గోల్డ్‌కోస్ట్‌ గేమ్స్‌లో భారత్‌ 66 పతకాలు - 26 బంగారు పతకాలు, 20 రజతాలు, కాంస్యాలు గెలుచుకుంది. వాస్తవం ఏమిటంటే, భార‌త్ అత్యంత విజయవంతమైన క్రీడ ఈ గేమ్స్‌ చరిత్రలో షూటింగ్ 2022 లో లేదు. 2018లో ఈ క్రీడలో భారత్ మొత్తం 16 పతకాలను గెలుచుకుంది, ఇందులో భారీ ఏడు బంగారు పతకాలు ఉన్నాయి. బర్మింగ్‌హామ్‌లో షూటింగ్‌లో భాగంగా షూటింగ్ జరిగితే, పతకాల పట్టికలో భారతదేశం ఎంత ఎత్తులో ఉండేదో ఊహించుకోవచ్చు. 2018తో పోలిస్తే 2022లో భార‌త్ స్టార్స్  ప్రదర్శన క్రీడల వారీగా ప‌రిశీలిద్దాం.  రెజ్లింగ్‌లో 12 పతకాలు సాధించడం ద్వారా భారత్ తమ 2018 స్కోరుతో సరిపెట్టుకుంది. అయితే ఈసారి వారికి అదనపు బంగారు పతకం లభించింది. సిడబ్ల్యు జీ  2022లో ఆరుగురు భారతీయ రెజ్లర్లు స్వర్ణం సాధించగా, 2018లో ఐదుగురు ఆ ఘనత సాధించారు. రెజ్లింగ్ తర్వాత, 2020లో భారత్‌కు అతిపెద్ద పతకాన్ని అందించింది వెయిట్‌లిఫ్టింగ్. మూడు స్వర్ణాలతో మొత్తం 10 పతకాలు సాధించిన తర్వాత 2018లో చేసిన దానికంటే 2022లో భారత్ మెరుగైన ప్రదర్శన చేసింది. 2018లో భారత్ 9 వెయిట్ లిఫ్టింగ్ పతకాలు సాధించగా, వాటిలో ఐదు బంగారు పతకాలు ఉన్నాయి. 2022లో టేబుల్ టెన్నిస్‌లో ఏడు పతకాలతో భారతదేశం చిరస్మరణీయమైన పరుగు సాధించింది. అయితే, 2018లో భారత్ ఎని మిది పతకాలు సాధించిన జాబితాలో ఇది ఒకటి తక్కువ. 2018లో స్వర్ణం సాధించిన భారత్ ఏ పతకాన్ని కోరుకోని మహిళల టీమ్ ఈవెంట్‌లో చెప్పుకో దగ్గ నిరాశ ఎదురైంది. ఇక‌ బాక్సింగ్ లో భారతదేశం వారి 2018 లెక్కింపు నుండి పడిపోయింది. భారత్ 2022లో మూడు స్వర్ణాలతో ఏడు పతకాలతో విజయవంతమైన రన్‌లో ఉన్నప్పటికీ, 2018లో తొమ్మిది పతకాలు సాధించింది. రెండు సందర్భాల్లోనూ భారత్ మొత్తం మూడు పతకాలు సాధించింది. బ్యాడ్మింటన్ విష‌యానికి వ‌స్తే, 2022లో ఈ క్రీడలో ఆరు పతకాలతో 2018లో తమ స్కోరును భారత్ సరిపెట్టుకోగలిగింది. ఏది ఏమైనప్పటికీ, మిక్స్‌డ్ టీమ్ ఫైనల్‌లో ఓడిపోయినప్పటికీ దేశం మూడు అగ్ర పోడియం ముగింపులను పొందడంతో మరిన్ని బంగారు పతకాలు ఉన్నాయి. 2018లో బ్యాడ్మింటన్‌లో భారత్‌కు రెండు స్వర్ణాలు వచ్చాయి. కాగా అథ్లెటిక్స్‌లో నీర‌జ్ ఛోప్రా లేని లోటు క‌న‌ప‌డింది. అయినా, భారతదేశం 2022లో వారి 2018 సంఖ్యను సునాయాసంగా మెరుగు పరుచుకుంది. బర్మింగ్‌హామ్‌లోని అథ్లెటిక్స్ నుండి భారతదేశం మొత్తం 8 పతకాలను పొందింది, ఇది 2018లో వారు గెలిచిన మూడింటి కంటే గణనీయంగా ఎక్కువ. 2022కి ముందు, లాన్ బౌల్స్‌లో భారతదేశం ప్రారంభమైనప్పటి నుండి ఆటలలో భాగమైనప్పటికీ ఎన్నడూ పతకం గెలవలేదు. అయితే, 2022లో మహిళల ఫోర్లలో చారిత్రాత్మక స్వర్ణంతో సహా రెండు పతకాలు దేశానికి లభించిన తర్వాత ఈ క్రీడతో దేశ భవి తవ్యం మారిపోయింది. 2018లో స్క్వాష్‌లో భారత్ రెండు పతకాలను గెలుచుకుంది మరియు 2022లో ఆ ఫీట్‌తో సరిపెట్టు కుంది. అయితే, గోల్డ్ కోస్ట్‌లో రెండు రజతాలు ఉండగా, బర్మింగ్‌హామ్‌లో భారత పతకాలు రెండూ కాంస్యం. 2018 సీడ‌బ్ల్యుజీ లో జూడో లేదు. కాగా  ఈ క్రీడలో బర్మింగ్‌హామ్‌లో భారత్ మూడు పతకాలను గెలుచుకుంది. ఇందులో రెండు రజతాలు, కాంస్యం భార‌త్ స్టార్లు త‌మ ఖాతాలో వేసుకున్నారు. క్రికెట్ విష‌యానికి వ‌స్తే, 24 సంవత్సరాలలో 2022 మొదటిసారిగా ఈ ఈవెంట్‌లో భాగంగా క్రికెట్ ఆడింది. మహిళల క్రికెట్‌కు కూడా అరంగేట్రం చేసింది హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు చారిత్రాత్మక రజత పతకాన్ని గెలుచుకోగలిగింది.చాలా మందిని దిగ్భ్రాంతికి గురిచేస్తూ, 2018లో భారత పురుషుల, మహిళల  హాకీ జట్లు రెండూ పతకాన్ని కోల్పోయాయి, అయితే 2022లో రెండు పతకాలను గెలుచుకోవడంతో వారు సవరణలు చేసుకున్నారు. మహిళలు కాంస్యం గెలుచుకోగా, పురుషులు రజతం సాధించారు. పారా పవర్ లిఫ్టింగ్ లో భారత్ 2018, 2020లో ఒక్కో పతకం సాధించింది. అయితే, ఈసారి దేశం జరుపుకోవడానికి ఒక స్వర్ణం వచ్చింది. గోల్డ్‌కోస్ట్‌లో దేశానికి ఒక కాంస్యం లభించింది.

తెలంగాణ కేబినెట్ భేటీ అజెండా ఏమిటి?

మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అని తేలిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేటీఆర్ అత్యవసరంగా కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. ఈ నెల 11 (గురువారం)న తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కేసీఆర్ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మునుగోడులో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. తెరాస సర్కార్ ఎదుట నిధుల సమీకరణ సవాల్ ఉంది. మునుగోడు ఉప ఎన్నికతో పాటు రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను అధిగమించడం ఎలా అన్న విషయంలో కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు   అధ్యక్షతన జరిగే   క్యాబినెట్  భేటీలో ప్రధానంగా రాష్ట్రానికి అదనపు వనరుల సమీకరణపై చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్ రాష్ట్రాన్ని ఆర్థిక దిగ్బంధనం చేసేసిన నేపథ్యంలో ఉద్యోగుల జీతాలకే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితుల్లో ఏం చేయాలన్న విషయంపైనే ప్రధానంగా కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. అలాగే మునుగోడు ఉప ఎన్నికకారణంగా ఎదురయ్యే రాజకీయ సవాళ్లను ఎదుర్కొనే విషయంలో కూడా కేబినెట్ చర్చిస్తుందని భావిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక కోసం వ్యయప్రయాసలు పడటం కంటే ముందస్తే బెటరని పలువురు ఇస్తున్న, చేస్తున్నసూచనల నేపథ్యంలో ఆ అంశంపై కూడా కేబినెట్ చర్చించే అవకాశం ఉందని అంటున్నారు.  మునుగోడు ఉపఎన్నిక సెప్టెంబర్ లోనే జరగవచ్చిన జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఏంచేయాలన్న విషయంపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం:దని పరిశీలకులు అంటున్నారు.  

టైరు బరస్టై కారు బోల్తా.. నలుగురు మృతి

మృత్యువు ఏ రూపంలో ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. నిజామాబాద్ జిల్లా కొత్తపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం చూస్తుంటే అది నిజమేనని నమ్మక తప్పదు. కారు టైరు బరస్ట్ కావడంతో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నుంచి నిర్మల్ వెడుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముస్కాల్ బైపాల్ కొత్తపల్లి వద్దకు రాగానే కారుటైర్ బరస్ట్ అయ్యింది. దీంతో అదుపు తప్పిన కారు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలోమరణించిన వారిలో  ఇద్దరుచిన్నారులు కూడా ఉన్నారు. ఈసంఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లోనూ ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. క్షతగాత్రులను ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు. బాధితులు హైదరాబాద్ టోలీ చౌకీకి చెందిన వారుగా గుర్తించారు.  

మీకో తొమ్మది.. మాకో తొమ్మిది.. కేబినెట్ ను విస్తరించిన మహారాష్ట్ర సీఎం షిండే

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్ నాత్ షిండే తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. 1 మహారాష్ట్రలో నాటకీయ పరిణామాల మధ్య ఏక్‌నాథ్ షిండే వర్గం, బీజేపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి విదితమే.  ఇప్పుడు తాజాగా షిండే తన కేబినెట్ ను విస్తరించారు. మొత్తం 18మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ విస్తరణలో షిండే సమన్యాయం పాటించారు. తన వర్గం వారికి,   బీజేపీ వారికి సమప్రాధాన్యత నిచ్చారు. మంగళవారంఆగస్టు 9) రాజ్ భవన్ లో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ 18మంది నూతన మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.  మంత్రివర్గ విస్తరణకు ముందు షిండే, బీజేపీ నాయకత్వం మధ్య పలు దఫాలు  చర్చలు జరిగాయి. ఎవరిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలనే విషయాలపై అమిత్ షాతో పాటు పలువురు బీజేపీ పెద్దలతో ముఖ్యమంత్రి షిండే   విస్తృతంగా చర్చలు జరిపారు.   బీజేపీ నుంచి  చంద్రకాంత్ పాటిల్, సుధీర్ ముంగంటివార్, గిరీష్ మహాజన్, సురేష్ ఖాడే, రాధాకృష్ణ విఖే పాటిల్, రవీంద్ర చవాన్, మంగళ్ ప్రభాత్ లోధా, విజయ్‌కుమార్ గావిట్ తో పాటు అతుల్ సేవ్ లు కేబినెట్ బెర్త్ల్ లు పొందారు.    ఏక్‌నాథ్ షిండే వర్గం నుంచి దాదా భూసే, సందీపన్ బుమ్రే, ఉదయ్ సమంత్, తానాజీ సావంత్, అబ్దుల్ సత్తార్, దీపక్ కేసర్కర్, గులాబ్రావ్ పాటిల్, సంజయ్ రాథోడ్, శంభురాజే దేశాయ్ లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 

175 కాదు.. 30, 35 స్థానాల్లో గెలిస్తే గొప్పే.. రఘురామకృష్ణం రాజు

రచ్చబండలో రఘురామ కృష్ణం రాజు తన సొంత పార్టీ వైసీపీని మరో సారి ఉతికి ఆరేశారు. ఢిల్లీలో చంద్రబాబు, మోడీ భేటీ విషయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల మీడియా సమావేశంలో విమర్శలు గుప్పించడాన్ని సెటైర్లతో కడిగి పరేశారు. వైసీపీలో ఏం చేసినా నాలుగుగోడల మధ్యేనని..పార్టీతో కలవడానికి ఎవరూ ముందుకు రారని పేర్కొన్నారు. మంగళవారం (ఆగస్టు9)న రచ్చబండ కార్యక్రమంలో వైసీపీ రెబల్ ఎంపీ మరో సారి సొంత పార్టీ అధినేత జగన్ పైనా, పార్టీ తీరుపైనా విమర్శల వర్షం కురిపించారు. సెటైర్లతో చెడుగుడు ఆడేశారు. ఢిల్లీలో చంద్రబాబుతో మోడీ కొద్ది సేపు ముచ్చటించడంపై సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శించడాన్ని తప్పు పట్టారు. ఔను వాళ్లిద్దూరూ మాట్లాడుకున్నారు అందులో తప్పేముంది అని ప్రశ్నించారు.  ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకే సమయంలో ముఖ్యమంత్రిగా పని చేశారని, ఎన్డీఏ లో చంద్రబాబు నాయుడు కీలక నేతగా వ్యవహరించారని గుర్తు చేశారు. వారిద్దరి మధ్య కొంతకాలం గ్యాప్ వచ్చిందని, మళ్లీ ఇప్పుడు కలుసుకున్నారని, దాన్ని కూడా తప్పు పట్టడం ఏమిటి అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ప్రధానితో ఐదు నిమిషాలు బేటి అయితే, తమ ముఖ్యమంత్రి గంట సేపు పాటు కలిసి డిన్నర్ చేశారని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు ప్రధాని, ఇతరులతో కలిసి డిన్నరే చేయలేదని గుర్తు చేశారు.   అయినా ప్రధాని గంటసేపు మధ్యాహ్న భోజనం చేశారని చెప్పడమే వింతగా ఉందని రఘురామ రాజు అన్నారు.   రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రతిపక్షాలు అన్నీ కలిసి పోటీ చేసినా, తాము మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తామని పేర్కొనడాన్ని ప్రస్తావిస్తూ, అసలు వైసీపీతో కలిసే వారెవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. మనం (వైసీపీ)  ఇలాగే నాలుగు గోడల మధ్య చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే అంటూ సెటైర్లు వేశారు. బిజెపి, జనసేన ఇప్పటికే మిత్రపక్షంగా ఉన్నాయని, వారితో టీడీపీ జత కలిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రఘురామ కృష్ణం రాజు అన్నారు. తాను ఎప్పటినుంచో ఈ విషయాన్నిచెబుతున్నానీ, అయినా 175కు 175 అసెంబ్లీ స్థానాలలో గెలుస్తామని ధీమా ఉన్నప్పుడు, వాళ్లు కలిస్తే జగన్ కు వచ్చిన నష్టమేమిటని ప్రశ్నించారు.  క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తే వైసీపీ 30 నుంచి 35 స్థానాలలో గెలిస్తే గొప్పేనన్నారు. తెలంగాణలో గెలుపు కోసమే, ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో దీటుగా పోరాటం చేస్తున్న టిడిపితో బిజెపి జతకట్టే అవకాశాలున్నట్లుగా కనిపిస్తోందని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు.  9వ తేదీ వచ్చినప్పటికీ 60 శాతం మంది ఉద్యోగులకు ఇంకా జీతాలు ఇవ్వలేదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.. ట్రెజరీకి వచ్చిన ఆదాయాన్ని తొలుత ఉద్యోగులకు జీతభత్యాలు ఇచ్చేందుకు వెచ్చించాలన్న ఆయన, ఆ సొమ్మును సంక్షేమ కార్యక్రమాల అమలుకు మళ్లించడం సరికాదన్నారు. ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించడం అన్నది ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని, ఆ తర్వాతే సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేయాలన్నారు. కానీ ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్ పై తెచ్చి పెట్టుకున్న అధికారులకు, కీలక బాధ్యతలను అప్పగించి, నిధులను దారి మళ్ళిస్తున్నారని రఘురామకృష్ణంరాజు విమర్శించారు.   రాష్ట్రంలో విప్పి చూపెడితే తప్పు లేదు కానీ, తప్పును ప్రశ్నిస్తే మాత్రం చితకబాదుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో అనంతపురం జిల్లాలో మాధవ రెడ్డి అనే వ్యక్తి క్యూలైన్లో ఎక్కువసేపు నిలబడలేక అసహనంతో నిరసన వ్యక్తం చేయగా, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అతనిని గొడ్డును బాదినట్టు బాదిన వీడియోను ఈ సందర్భంగా రఘురామకృష్ణం రాజు ప్రదర్శించారు. మాధవ రెడ్డిని చితకబాదినది గోరంట్ల మాధవ్ కాగా, ఆయన పై అప్పట్లో ఎస్పీకి ఫిర్యాదు చేయగా అతన్ని వీఆర్ లో ఉంచారన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తిని గొడ్డును బాదినట్లు, బాదినందుకు మాధవ్ కు అతనికి ఎంపీ టికెట్ ఇచ్చి ప్రోత్సహించారనీ,   ఇప్పుడు విప్పి చూపించినందుకు కూడా ప్రమోషన్ ఇస్తారేమోనని ఎగతాళి చేశారు. గోరంట్ల మాధవ్ నగ్న వీడియో మార్ఫింగ్ చేశారనే విషయం ఎలా తెలుస్తుందని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.. కేసు నమోదు చేసి విచారణ చేపడితేనే కదా వీడియో మార్ఫింగ్ చేశారా?, లేదా?? అన్న విషయం తెలిసేదని నిలదీశారు.. నగ్న వీడియో తనది కాదని, మార్ఫింగ్ చేశారని తన మిత్రుడు, సహచర ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్తుంటే, సకల శాఖామంత్రి అది మాధవ్ వీడియోని నిర్ధారించారన్నారు. సకల శాఖామంత్రి తన విశాల హృదయాన్ని చాటుకుంటూ, నాలుగు గోడల మధ్య వ్యవహారానికి ఇంత రాద్ధాంతం ఏమిటని ప్రశ్నించడం ఆయన మైండ్ సెట్ ను, పార్టీ మైండ్ సెట్ ను తెలియజేస్తుందన్నారు.  నాలుగు గోడలో లోపల జరిగిన వ్యవహారం, ఇద్దరి మధ్యలోనే ఉండి ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండి ఉండేది కాదన్నారు. కానీ నాలుగు కోట్ల మంది ప్రజలు చూసి, 8 కోట్ల కళ్ళు గాయపడిన తర్వాత, నాలుగు గోడల మధ్యలో జరిగిన వ్యవహారం అంటూ పేర్కొనడం ఎమిటని ప్రశ్నించారు.    

భగవద్గీత మత గ్రంథం కాదు.. సువేందు అధికారి

పార్టీ మారితే భాషా మారుతుంది. గతంలో విమర్శించిన వారినే పార్టీ మారిన తరువాత పొగడాల్సి ఉంటుంది. రాజకీయాలలో అది సహజం. అయితే గతంలో వల్లెవేసిన సిద్ధాంతాలు సైతం మారిపోయే పరిస్థితి సువేందు అధికారికి ఎదురైంది. తృణమూల్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి కమలం గూటికి చేరిన తరువాత ఆ గూటి పలుకులే పలకడంలో ఆశ్చర్యం ఉండదు. ఇఫ్పుడు ఆయన చేస్తున్నది అదే.. బెంగాల్ లో అధికారంలోకి వస్తే పాఠశాలల్లో భగవద్గీత బోధిస్తామని బీజేపీ నాయకుడు సువేందు అధికారి అన్నారు. భగవద్గీత ఎంత మాత్రం మతగ్రథం కాదని ఆయన అన్నారు. ఈస్ట్ మిడ్నాపూర్ లో జరిగిన ఒక రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఆయన గుజరాత్ లో కూడా పాఠశాలల్లో భగవద్గీత బోధన పాఠ్యాంశాల్లో భాగం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ప్రజాశీర్వాదంతో బెంగాల్ లో జాతీయవాద ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. అప్పుడు తప్పకుండా పాఠశాల సిలబస్ లో భగవద్గీతను చేరుస్తామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా భగవద్గీత పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. తొలి నుంచీ తృణమూల్ లో ఉన్న సువేందు అధికారి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ గూటికి చేరారు. ఆ ఎన్నికలలో మమతా బెనర్జీ పైనే పోటీ చేసి విజయం సాధించారు. అయితే బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించి అధికారం చేపట్టడంతో ఆయన మళ్లీ తృణమూల్ గూటికి చేరుతారని ప్రచారం జరిగినా అది జరగలేదు. కానీ ఎన్నికలకు ముందు తృణమూల్ వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్న పలువురు టీఎంసీ నేతలు మళ్లీ సొంత గూటికి చేరిన సంగతి విదితమే. 

ఉచితాల మీద కేంద్రం వ్యాఖ్యలపై కవిత మండిపాటు

టీఆర్‌ఎస్ శాసనమండలి సభ్యురాలు (ఎమ్మెల్సీ) కల్వకుంట్ల కవిత కేంద్రం  ఉచితాల మీద చేసిన‌ వ్యాఖ్యలపై ఆమె విరుచుకు పడ్డారు, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు 'ఉచితాలు' కాదని, అయితే, అసలు ఉచితాలు డూప్ ఏజెన్సీల రుణమాఫీయేన‌ని అన్నారు. తెలంగాణలో పేదల కోసం 250 సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. పేదల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవడం రాష్ట్ర ప్రభుత్వంగా మా బాధ్యతని ఆమె అన్నారు. దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలను ఉచితాలుగా పేర్కొనే ధోరణి ఉందని, ఈ పథకా లను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి తెస్తోందని కవిత వ్యాఖ్యానించారు. తాము ఈ ప్రవర్తనకు వ్యతిరేకమ‌ని, ఏ ప్రభుత్వమైనా పేద ప్రజల సంక్షేమమే బాధ్యత. డూప్ ఏజెన్సీల రూ. 10 లక్షల కోట్ల రుణాన్ని మాఫీ చేసిందని బీజేపీ ప్రభుత్వం ఉచితం చేసిందని  నమ్ముతున్నాన‌ని ఆమె అన్నారు. బలహీనమైన సమాజాల సంక్షేమం ఎప్పుడూ ఉచితమైనది కాదు, ఇది మన సామాజిక బాధ్యత. ఈ సందర్భంగా  ప్ర‌జ‌లు  నేడు దేశంలో ఏర్పడు తున్న ఈ వాతావరణాన్ని వ్యతిరేకించాలని  అభ్యర్థిస్తున్నానని మాజీ ఎంపీ అన్నారు.  భారతదేశం అన్ని నేపథ్యాల ప్రజలతో విభిన్నమైన దేశం. పేదరికం,  ప్రగతి చక్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి బలహీన వర్గాలకు సహాయం చేయడం ప్రభుత్వ బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా కృషి చేస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం అందుకు ఎలాంటి ఆటంకాలు కల్పించకూడదని ఆమె అన్నారు.

మౌనం వీడిన అనిత.. గోరంట్లపై చర్య ఎలా తీసుకుంటామంటూ ప్రశ్న

 అనంత పురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంప ఎట్టకేలకు హోంమంత్రి తానేటి వనిత మౌనం వీడారు. ఎంపీ మాధవ్ ను తాము వెనకేసుకు రావడం లేదన్నారు. పేరుకు గోరంట్ల ఎపిసోడ్ కు సంబంధించి ఆమె మాట్లాడినా ఆమో ప్రసంగం అంతా విపక్షాన్ని విమర్శించడానికే సరిపోయింది. ఫోరెన్సిక్ ల్యాబ్ కు   గోరంట్ల మాధవ్ వీడియో పంపినట్లు చెప్పిన ఆమె నివేదిక వచ్చాకా చర్యలుంటాయన్నారు. ఇదే విషయాన్ని రెండు రోజుల కిందటే ప్రభుత్వ సలహాదారు చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ గోరంట్ల ఎపిసోడ్ లో నోరు మెదపని తానేటి వనిత ఇక తప్పదన్నట్టు మీడియా మీదకు వచ్చి.. విపక్షం అధికారంలో ఉన్న సమయంలో మహిళలపై ఎన్నో దారుణాలు జరిగాయంటే ఆరోపణలు గుప్పించడానికే ప్రధాన్యత ఇచ్చారు.  విచారణ పూర్తై నిజానిజాలు తేలకుండా గోరంట్ల మాధవ్ పై చర్య ఎలా తీసుకుంటామని ప్రశ్నించారు. అయితే తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళలు దారుణంగా మాట్లాడుతున్నారని తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి మాటలూ, బాడీ లాంగ్వేజ్ దారుణంగా ఉన్నాయన్నారు. మూడేళ్లలో ప్రభుత్వంపై కానీ, సీఎం జగన్ పై కానీ విమర్శించడానికి ఏం లేక గోరంట్ల ఎపిసోడ్ ను అడ్డం పెట్టుకుని నాటకాలాడుతున్నారని విమర్శించారు.  టీడీపీ ప్రభుత్వ హయాంలో మహిళలపై ఎన్నో దారుణాలు జరిగాయని వనిత విమర్శించారు. తమ హయాంలో దిశ యాప్ ద్వారా 900 మహిళల్ని రక్షించామన్నారు. గోరంట్ల మాధవ్ ని ప్రభుత్వం రక్షించడం లేదని స్పష్టం చేశారు. విపక్షం తామేదో  ఎంపీని తాము కాపాడుతున్నట్టు, ఆయన వల్ల బాధింపబడిన మహిళకేదో అన్యాయం చేస్తున్నట్లు మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. 

జనతాదళ్ మంచి రాజకీయ ప్రత్యామ్నాయం: దేవెగౌడ

బీహార్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు జనతాదళ్ పరివార్ ఒకే తాటిపై ఉన్న రోజుల గురించి ఆలోచించేలా చేశాయని మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ అన్నారు. బీహార్‌లో రాజకీయ పరిణామాల మధ్య, జనతాదళ్ (సెక్యులర్) పితామహుడు హెచ్‌డి దేవెగౌడ దేశంలో ఒక రాజకీయ ప్రత్యామ్నాయంగా ఒకప్పటి జనతాదళ్ పరివార్ తిరిగి ఆవిర్భవించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. బీహార్‌లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్), లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జెడి) కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చూసిన పరిణామాలు, వారంతా ఆ రోజుల గురించి ఆలోచించేలా చేశారని ఐక్యంగా ఉన్నారని మాజీ ప్రధాని అన్నారు. బీహార్‌లో పరిణామాలను గమనిస్తూనే ఉన్నాను. జనతాదళ్ పరివార్ ఒకే తాటిపై ఉన్న రోజుల గురించి ఇది నన్ను ఆలోచింప జేసింది. రాష్ట్రం మూడు ప్రధానమంత్రుల‌ను ఇచ్చింది. నేను పెద్ద‌వాడినయ్యాను. కానీ యువ తరం నిర్ణయిస్తే, అది ఒక అవ కాశం  ఇవ్వ‌గలదని, ఇది  దేశానికి మంచి ప్రత్యామ్నాయమ‌ని దేవెగౌడ ట్వీట్‌లో పేర్కొన్నారు. మంగళ వారం, నితీష్ కుమార్ జెడియు బీజేపీ తో సంబంధాలు తెంచుకుంది.  బీహార్‌లో ప్ర‌భుత్వ ఏర్పాటులో భాగ‌స్వామ్యం అడిగేం దుకు ఆర్‌జేడీ తో తిరిగి జతకట్టింది. నీతిష్ కుమార్‌ రేపు ముఖ్య‌మంత్రి గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆర్‌జేడీ  తేజస్వి యాదవ్ అతని డిప్యూ టీగా ప్రమాణ స్వీకారం చేయడంతో. వామపక్ష పార్టీలు, ఆర్‌జేడీ, కాంగ్రెస్ భాగమైన మహాగట్బంధ‌న్‌ 2020 రాష్ట్ర ఎన్నికలలో 110 సీట్లు గెలుచుకుంది, రాష్ట్రంలో ఆర్‌జేడీ 75 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. 

బీహార్ సీఎంగా ఎనిమిదోసారి..నితీష్ ప్రమాణ స్వీకారం రేపే!

బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ బుధవారం (ఆగస్టు 10)న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రిగా మంగళవారం (ఆగస్టు9) న రాజీనామా చేసిన ఆయన ఇప్పటి వరకూ ప్రత్యర్థులుగా ఉన్నజేడీయూ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. నితీష్ కుమార్ వ్యూహాత్మకంగా అడుగులు వేయడంతో బీహార్ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. బీజేపీతో ఇలా తెగదెంపులు చేసుకున్న నితీష్ కుమార్ అలా మహాఘటబంధన్ తో చేతులు కలిపి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అయిపోయారు. బుధవారం మధ్యాహ్నం ఆయన బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో ఆయన బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం ఇది ఎనిమిదో సారి అవుతుంది. బీహార్ సీఎంగా ఇప్పటి వరకూ ఏడు సార్లు పని చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలో విజయం సాధించి ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాలేదు. బుధవారం ఆయన 8వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భాజపాతో తెగదెంపులు చేసుకున్నామని.. ఆర్జేడీ సారథ్యంలో ఏడు పార్టీలతో కూడిన మహాఘటబంధన్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని ఇప్పటికే నితీశ్‌ గవర్నర్‌ను కోరిన విషయం తెలిసిందే.   మహాఘటబంధన్‌లో స్వతంత్రులతో పాటు 164 మంది ఎమ్మెల్యేలు సహా 7 పార్టీలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ తో కలిసి మీడియా సమావేశంలో నితీష్ వెళ్లడించారు.  243 మంది సభ్యుల రాష్ట్ర అసెంబ్లీలో జేడీయూ, ఆర్జేడీ కలిసి మెజారిటీని కలిగి ఉన్నాయి. జేడీయూకి 45, ఆర్జేడీకి 79 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరికి జితన్ మాంఝీకి చెందిన హెచ్‌ఏఎం వంటి చిన్న పార్టీల మద్దతు కూడా ఉంది. రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి 77 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.   బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలను కమలం పార్టీ నాశనం చేస్తుందని, ఈ విషయాన్ని చరిత్రే చెబుతోందని  ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు. పంజాబ్‌, మహారాష్ట్రలలో జరిగిందేమిటో అందరికీ తెలుసునని అన్నారు బిహార్‌లోనూ జేడీయూని చీల్చి భాజపా సొంతంగా పాలించాలనుకుందన్నారు. అయితే సీఎం నితీష్‌ కుమార్‌ త్వరగా మేల్కొని బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చారని చెప్పారు. బిహార్‌లో బీజేపీ అజెండా అమలు కాకూడదనే తామంతా కోరుకుంటున్నట్టు  ఇలా ఉండగా   ఎన్డీయే కూటమి నుంచి నితీష్‌ కుమార్‌ వైదొలగడంపై   బీజేపీ నేతలు మండిపడుతున్నారు. నితీష్ కుమార్ బీజేపీనే కాదు   బిహార్‌ ప్రజలను కూడా మోసం చేశారని విమర్శిస్తున్నారు.  

మళ్లీ గోదావరి ఉగ్ర రూపం.. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

వరద గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మంగళవారం (ఆగస్టు 9) రాత్రికి భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 50 అడుగులు దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గత నెలలో భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమై ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రాంతాల ప్రజలు మళ్లీ ముంపు భయంతో బెంబేలెత్తుతున్నారు. గోదావరి వరద ఉధృతమౌతున్న నేపథ్యంలో తూర్పుగోదావరి, కోనసీమ, అల్లూరి సీతారామరాజు కాకినాడ, ఏలూరు, భీమవరం జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు.  ఇక మంగళవారం (అగస్టు 9) రాత్రి 7 గంటలకు ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో 7.74 లక్షల క్యూసెక్కులకు చేరిందని అధికారులు తెలిపారు. ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తున్నారు.  

బీహార్ అంత‌టా లాలూ రోహిణి భోజ్‌పురి పాట‌ 

నితీష్ కుమార్ బిజెపితో పొత్తు ను విడిచిపెట్టినప్పుడు,లాలూప్రసాద్ యాద వ్ కుమార్తెలు వేడుకగా ట్వీట్లు చేశారు. పట్టాభిషేకానికి సిద్ధంచేయండి, లాంతరు వాహకాలు వస్తున్నాయి అని! నితీష్ కుమార్ ఈరోజు బిజెపితో విడిపోయిన తర్వాత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తెలు బీహార్‌లో అతను తిరిగి గేమ్‌లోకి వచ్చాడంటూ వేడుక ట్వీట్లు చేశారు.యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య తన తండ్రిని కింగ్ మేకర్ అని పిలిచారు. లాలూ బిన్ చాలూ ఈ బిహార్ నా హోయీ (లాలూ లేకుండా బీహార్ నడపలేరు) అని భోజ్‌పురి పాటను ట్వీట్ చేశారు. జేడీయూ, ఆర్జేడీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం ఉందని లెక్కలు చెబుతున్నాయి. లాలూ యాదవ్ కుమారుడు రాజకీయ వారసుడు తేజస్వి యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్ జెడి) ఎన్నికల గుర్తు (లాంతరు) గురించి ప్రస్తా విస్తూ, పట్టాభిషేకానికి సిద్ధం, లాంతరు వాహకాలు వస్తున్నాయ‌ని ఎం.ఎస్‌. ఆచార్య హిందీలో రాశారు. దాణా కుంభ కోణా నికి సంబంధించిన కేసుల్లో బెయిల్‌పై ఉన్న లాలూ యాదవ్, పాట్నాలోని ఇంట్లో భుజం ఫ్రాక్చర్ నుండి కోలుకుంటున్నారు. భోజ్‌పురి గాయకుడు-నటుడు ఖేసరి లాల్ యాదవ్ పాడిన పాట - ఈ ఏడాది ప్రారంభంలో బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నిక లకు ముందు విడుదలైంది - తేజస్వి యాదవ్‌ను బీహార్ నాయకుడిగా పిలుచుకునే పంక్తులు ఉన్నాయి. తేజశ్వి కే బినా సుధార్ నా హోయీ (తేజశ్వి లేకుండా పురోగతి ఉండదు) అని!  ఎం.ఎస్‌.ఆచార్య షేర్ చేసిన  క్లిప్‌లో  లేనప్పటికీ, నితీష్ కుమార్ ను విమర్శించే కొన్ని పంక్తులు కూడా ఉన్నాయి. పాటకు ముందు, ఆచార్య త్వరలో ఒక అద్భుతం జ‌ర‌గ‌బోతోంది.. భోలే బాబా ఆశీర్వాదంతో అని ట్వీట్ చేసారు, తరువాత దేవ నాగరి లిపిలో వ్రాసిన కింగ్ మేకర్ పదాలతో తన తండ్రి ఫోటోను పంచుకున్నారు, "అతని చిత్తశుద్ధి ఆకాశం కంటే ఎత్తైనది; అతను ప్రజల గర్వం. లాలూ యాదవ్, రబ్రీ దేవి కుమార్తెలలో మరొకరు, రాజ్ లక్ష్మి యాదవ్ తన తండ్రికి సంబంధించిన కొన్ని ఫోటోలను పంచుకున్నారు బీహార్ తేజస్వి ప్రభుత్వాన్ని కోరుకుంటుంద‌ని రాశారు.