శక్తిమాన్ హీరో నీచ వ్యాఖ్యలు

ఏదో కొంచం గుర్తింపు రాగానే తామేం మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుందనుకునే వారు ఉంటారు. అందులోనూ సాంప్రదాయం, నాగరికత, కట్టు బాట్లు, హిందూ ధర్మం అంటూ ఇష్టారీతిన మాట్లాడితే తిరుగే ఉండదన్న భావనలో ఉంటారు. సంప్రదాయం అంటూ మహిళలను కించ పరిచే వ్యాఖ్యలు చేసి ఏదో హిందూ ధర్మాన్ని ఉద్ధరించడానికే తాము అలా మాట్లాడుతున్నామని విర్రవీగుతుంటారు. అదిగో సరిగ్గా అలాంటి కోవలోకే చేరుతాడు శక్తిమాన్ హీరో ముఖేష్ ఖన్నా. దూరదర్శన్ లో వచ్చిన శక్తిమాన్ సీరియల్ తో ప్రాచుర్యం పొంది బాలీవుడ్ అవకాశాలను అందిపుచ్చుకున్న ఈ నటుడు మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేశారు. ‘మహాభారత్’ సీరియల్ లో భీష్మ పాత్రలో నటించిన ముఖేష్ ఖన్నా ఆడవారు ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలి అంటూ నీతిబోధలు చేయడానికి ప్రయత్నించి అభాసుపాలయ్యారు. ఆయన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే శృంగారం కోరే మహిళలు వేశ్యలతో సమానమని అన్నారు. పురుషులు మహిళల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. నాగరిక సమాజంలో సంప్రదాయబద్ధంగా ఉండే మహిళలెవరూ శృంగారం గురించి మాట్లాడరన్నారు. అలా మాట్లాడే వారు తన దృష్టిలో వేశ్యలతో సమానమని పేర్కొన్నారు.  బీష్మ ఇంటర్నేషనల్ పేరిట తాను నడుపుతున్న యూట్యూబ్ చానెల్ లో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు  వెల్లువెత్తడంతో సెక్స్ మోసాల గురించి యువతను హెచ్చరించడంలో భాగంగానే తానా వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచ్చుకోవడానికి ప్రయత్నించారు. మహిళల గురించి అనుచితంగా మాట్లాడిన ముకేశ్‌ఖన్నాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందిగా ఢిల్లీ మహిళా కమిషన్‌ సైబర్‌ సెల్‌ పోలీసులకు నోటీసు పంపింది.    

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి దామోదరరెడ్డి?

మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది తేలిపోయిందా అంటే కాంగ్రెస్ వర్గాలు ఔననే అంటున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా రాంరెడ్డి దామోదరరెడ్డి దాదాపుగా ఖరారయ్యారని చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మునుగోడు లో విజయం సాధించాలన్న పట్టుదలతో కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డికి దీటైన అభ్యర్థిగా రాంరెడ్డి దామోదరరెడ్డి నిలుస్తారని భావిస్తున్నదని చెబుతున్నారు. ఈ మేరకు రాంరెడ్డి దామోదరరెడ్డి అభ్యర్థిత్వాన్ని పీసీసీ ప్రతిపాదించగా సీఎల్పీ కూడా సమర్ధించిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. అలాగే రాంరెడ్డి దామోదరరెడ్డి అభ్యర్థిత్వానికి పార్టీ సీనియర్ నాయకులు జానారెడ్డి, పీసీసీ మాజీ చీఫ్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు కూడా మద్దతు ఇస్తున్న్లారని అంటున్నారు.  

బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ గా సునీల్ బన్సాల్

బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ గా సునీల్ బన్సాల్ నియమితులయ్యారు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కమలం పార్టీ ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. మునుగోడు ఉప ఎన్నిక అలాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ ఇన్ చార్జ్ గా తరుణ్ చుగ్ స్థానంలో సునీల్ బన్సాల్ ను నియమించింది. బుధవారం(ఆగస్టు11) ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ కేంద్రంగా దక్షిణాది రాష్ట్రాలలో బలోపేతం అయ్యే లక్ష్యంతో సాగుతున్న బీజేపీ ఆ లక్ష్య సాధనలో భాగంగానే సునీల్ బన్సాల్ ను నియమించింది. ఇప్పటి వరకూ ఆయన ఉత్తర ప్రదేశ్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయనకు జాతీయ కార్యదర్శిగా ప్రమోషన్ ఇచ్చి తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జిగా నియమించింది. సునీల్ బన్సాల్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సన్నిహితులు.  ఇప్పటికే తెలంగాణలో   దుబ్బాక, హుజూరాబాద్‌ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ  విజయం సాధించింది. ఇప్పుడు  మనుగోడులో విజయం సాధించి ముచ్చటగా మూడో ఉప ఎన్నికలో విజయాన్ని కూడా ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగానే కేంద్ర మంత్రి అమిత్ షా ఈ నెల 21న మునుగోడులో బీజేపీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 

నితీష్ కొత్త కేబినెట్ లో కీలక పదవులన్నీ ఆర్జేడీకే?

ఎన్డీయేతో తెగదెంపులు చేసుకున్న నితీష్ మహాఘట్ బంధన్ లో చేరి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి విదితమే. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్, డిప్యూటీ సీఎంగా తేజస్వీ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. కాగా మహాఘట్ బంధన్ లో పెద్ద పార్టీ ఆర్జేడీయే అన్న సంగతి విదితమే. ఆర్జేడీ నేత తేజస్వి కుమార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక కొత్త కేబినెట్ కూర్పులో అత్యధిక మంత్రి పదవులూ, అందులోనూ కీలక శాఖలూ నితీష్ కుమార్ ఆర్జేడీకే కట్టబెట్టే అవకాశం ఉంది. సంకీర్ణ ప్రభుత్వంలో మిగిలిన పార్టీలకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించాల్సి ఉండటంతో నితీష్ కుమార్ తన మంత్రివర్గంలో గత ఎన్డీయే కేబినెట్ లో ఉన్న జేడీయూ మంత్రులకు స్థానం కల్పించనున్నారు. అంటే నీతీష్ కొత్త కొలువులో వారికి స్థానం కల్పించబోతున్నారు. అంటే 12 నుంచి 13 మంది జేడీయూ సభ్యులకు నితీష్ క్యాబినెట్ లో స్థానం లభిస్తుంది. అలాగే నాలుగు కేబినెట్ పోస్టులు కాంగ్రెస్ కు ఇస్తారు. మరో ఒకటి రెండు పోస్టులు ఇతర పార్టీలకు దక్కే అవకాశం ఉండగా మిగిలినవన్నీ అంటే 18 నుంచి 19 మంత్రి పదవులు ఆర్జేడీ సభ్యులకు లభించే అవకాశం ఉంది. అంతే కాకుండా కీలకమైన హోం, ఆర్థిక శాఖలు ఆర్జేడీకే దక్కే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. నిన్నటి వరకూ రాష్ట్రంలో ప్రధాన విపక్షంగా ఉన్న ఆర్జేడీ ఈ రోజు (ఆగస్టు 10) నుంచి అధికార పక్షంగా మారిపోయింది.  

బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణ స్వీకారం.. డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్

 బీహార్ సీఎంగా నితీష్ కుమార్ బుధవారం ( ఆగస్టు 10) ప్రమాణ స్వీకారం.. ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాకుండానే 8వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన నేతృత్వంలో బీహార్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. పాట్నాలోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో నితీష్ తో పాటు డిప్యూటీ సీఎంగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. నితీష్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది ఎనిమిదోసారి.  రెండేళ్ల కిందట బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో నితీష్ నేతృత్వంలోని జేడీయూ కేవలం 43 స్థానాలలో మాత్రమే విజయం సాధించింది. 245 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో ఆర్జేడీ  75 స్థానాలు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. బీజేపీ 74 స్థానాలకు పరిమితమైంది. ప్రభుత్వాన్నిఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 122. 74 స్థానాలలో విజయం సాధించిన బీజేపీ నితీష్ నేతృత్వంలోని జేడీయూకు మద్దతు ఇచ్చింది. దాంతో నితీష్ ముఖ్యమంత్రిగా బీహార్ లో ఎన్డీయే ప్రభుత్వం కొలువు దీరింది. అయతే ఈ ఏడాది ఆరంభంలో బీజేపీ, జేడీయూ మధ్య విభేదాలు పొడసూపాయి. అవి పెరిగి పెద్దవై చివరికి నితీష్ ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చేయడానికి కారణమయ్యాయి. ఎన్డీయేతో తెగతెంపులు చేసుకున్న నితీష్ కుమార్ ఆర్జేడీ, కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి  కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.  

ఢిల్లీలో చంద్రబాబు మోడీ ఏం మాట్లాడుకున్నారో తెలుసా?!

ప్రధాని మోడీ తనంత తానుగా చంద్రబాబు వద్దకు వచ్చి ఏం మాట్లాడారో ఇప్పుడు తెలిసిపోయింది. మోడీ తనతో ఏం మాట్లాడారన్నది స్వయంగా చంద్రబాబే చెప్పారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగస్టు (9) మంగళవారం వర్చువల్ పద్ధతిలో జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో మాట్లాడారు. ఆ సందర్భంగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రస్తావన వచ్చింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కమిటీ సమావేశానికి చంద్రబాబు వెళ్లిన సంగతి విదితమే. ఆ సమావేశంలో ప్రధాని మోడీ చంద్రబాబు వద్దకు వచ్చి పలకరించి ఒకింత పక్కకు తీసుకువెళ్లి ఓ ఐదు నిముషాలు ప్రత్యేకంగా ముచ్చటించిన సంగతి విదితమే. మోడీ, చంద్రబాబు మధ్య జరిగిన ఆ చిరు భేటీకే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ కాళ్ల కింద భూమి కదిలిపోయినంత హడావుడి చేసింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల అయితే ఏకంగా మీడియా సమావేశం పెట్టి మరీ వచ్చే ఎన్నికలలో బీజేపీ- తెలుగుదేశం పొత్తు కుదిర్చేసుకున్నాయని, అయినా సరే గెలుపు మాదేనని చెప్పుకోవడానికి ప్రయత్నించారు. అసలింతకీ వారిద్దరి మధ్యా ఏం జరిగిందనేది పొలిట్ బ్యూరో సమావేశంలో ఒక సభ్యుడు అడిగినప్పుడు చంద్రబాబు చెప్పారు. సమావేశంలో తాను వేరే వారితో మాట్లాడుతుండగా మోడీ అటుగా వచ్చారనీ, తనను పలకరించి పక్కకు తీసుకువెళ్లి.. మనం కలిసి చాలా కాలమైంది.. ఇటీవల ఢిల్లీ రాలేదా అని అడిగారనీ చంద్రబాబు వివరించారు. దానికి తాను నాకు ఢిల్లీలో పనేముందని బదులిచ్చానన్నారు. అప్పుడు మోడీ అలా కాదు మీతో చాలా మాట్లాడాల్సి ఉంది. ఒక సారి వీలు చూసుకుని ఢిల్లీ రండి అని ఆహ్వానించారన్నారు. అలాగే వచ్చే ముందు పీఎంవోకు సమాచారమిస్తే అనువైన సమయం చెబుతాను అని మోడీ చెప్పారనీ తాను సరేనన్నానీ చంద్రబాబు వివరించారు.   

జగన్నాటకం.. మాధవ్ వీడియోపై పొంతన లేని మాటలు.. విచారణ లేకుండానే క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం

గోరంట్ల మాధవ్ అసభ్య వీడియో విషయంలో వైసీపీలో తడబాటు స్పష్టంగా కనబడుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ వైసీపీ ఈ దిక్కుమాలిన వీడియో విషయంలో మాధవ్ ను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నం ప్రస్ఫుటంగా తెలుస్తోంది. ఈ విషయంలో గోరంట్ల మాధవ్ ను వెనకేసుకు రావడానికి ఆ పార్టీ గంటకో మాట, పూటకో కారణం చూపుతున్నారు. వీడియో బయటపడిన రోజు గోరంట్ల మాధవ్  మీడియా ముందుకు వచ్చి సదరు వీడియో మార్ఫింగ్ అని చెబుతూ ఈ విషయంపై ఎస్పీకి ఫిర్యాదు చేశానని చెప్పారు. దానినే పట్టుకుని మాధవ్ ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ పూర్తయిన తరువాత మాధవ్ తప్పు చేసినట్లు తేలితే.. అంటే ఆ వీడియోలో ఉన్నది మాధవే అని రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చారు. అంటే సజ్జల మాధవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారని కమిట్ అయ్యారు. ఆ తరువాత ఓ రెండు రోజుల పాటు వైసీపీలో ఎవరూ ఈ విషయంపై మాట్లాడేందుకు ముందుకు రాలేదు. అటు గోరంట్ల మాధవ్ కూడా నోరు మెదప లేదు.   కానీ మీడియాలో, సామాజిక మాధ్యమంలో సామాన్య జనంలో కూడా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుండటంతో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ గోరంట్ల మాధవ్ వీడియో విషయంలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ణప్తి చేసి చేతులు దులుపుకున్నారు. ఆ తరువాత నుంచి ఈ వీడియో సెంట్రిక్ గా కుల చిచ్చు పెట్టడం నుంచి అన్ని విధాలుగా ఎంపీని కాపాడడానికే ప్రయత్నించారు. అయితే ఈ క్రమంలో గోరంట్ల మాధవ్ నుంచి ప్రతి ఒక్కరూ పొంతన లేని మాటలు మాట్లాడారు. తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని మాధవ్ చెప్పారు. ఆ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించామని చెప్పారు. ఆ మరుసటి రోజే హిందూపురంఎస్పీ ఫకీరప్ప ఎంపీ గోరంట్ల మాధవ్, హోమంత్రి చెప్పిన మాటలన్నీ శుద్ధ అబద్ధాలని తేల్చేశారు. మాధవ్ తమకు ఫిర్యాదు చేయలేదని వెల్లడించారు. ఆయన అభిమాని ఎవరో వచ్చి ఫిర్యాదు చేశారని చెప్పారు. అలాగే ఆ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపలేదనీ చెప్పాశారు. దీంతో ప్రజలకు అసలు ఎవరు చెబుతున్నది నమ్మాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.  ఎస్పీ ఫకీరప్ప మాట్లాడుతూ గోరంట్ల మాధవ్ వీడియోను ఇంకా ఫోరెన్సిక్‌కు పంపలేదని.. సామాజిక మాధ్యమంలో వైరల్ అయిన వీడియోను ఫోరెన్సిక్ కు పంపలేమనీ, ఒరిజనల్ వీడియో దొరికితేనే ఫోరెన్సిక్ కు పంపగలమనీ అన్నారు. అసలా వీడియోలో ఉన్నది మాధవా కాదా అన్నది కూడా చెప్పలేమని వివరణ కూడా ఇచ్చారు. అంటే ఒరిజనల్ దొరకదు, మేం దర్యాప్తు చేసినా ఏం తేలదు..ఇక ఈ కేసు కంచికి వెళ్లినట్లే అని చెప్పకనే చెప్పేశారు. ఇలా ఫకీరప్ప విలేకరుల సమావేశం పూర్తయ్యిందో లేదో అలా ఎంపీ మాధవ్ మీడియా ముందుకు వచ్చి... తాను నిర్దోషినని తనకు తానే ప్రకటించేసుకుని యథా ప్రకారం బూతు పురాణం విప్పేశారు. అసభ్యతకు నిలువెత్తు నిదర్శనంగా దర్శనమిచ్చిన ఎంపీని కాపాడేందుకు జగన్ పార్టీ ఎంత చేయాలో అంత చేసింది. చివరకు ఇక ఆ విషయంలో పార్టీ పరంగా తీసుకునే చర్యలేమీ ఉండవని చేతులు దులిపేసుకుంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో సజ్జల, హోంమంత్రి మీడియా సాక్షిగా చెప్పిన అబద్ధాలు, ఎంపీని కాపాడేందుకు పడిన తాపత్రయం మాత్రం జనానికి స్పష్టంగా అర్ధమైపోయిందని విమర్శకులు అంటున్నారు. ఈ రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన వారు ఏ ఛండాలం చేసినా కాపాడేందుకు పార్టీ, ప్రభుత్వం సదా తయారుగా ఉంటాయని ఈ ఎపిసోడ్ ద్వారా తేటతెల్లమైందని విశ్లేషకులు అంటున్నారు. 

వరవరరావుకు సుప్రీ కోర్టులో భారీ ఊరట.. శాశ్వత బెయిలు మంజూరు

విప్లవ రచయత వరవరరావుకు సుప్రీం కోర్టు శాశ్వత బెయిలు మంజూరు చేసింది. అయితే ఆయన గ్రేటర్ ముంబై దాటి వెళ్ల కూడదని షరతు విధించింది.  కేసు దర్యాప్తును ప్రభావితం చేసే చర్యలకు పాల్పడకూడదనీ, సాక్షులతో సంప్రదింపులు జరపరాదనీ ఆంక్షలు విధించింది. వయోభారం, అనారోగ్యం కారణంగా తనకు పర్మినెంట్ బెయిలు మంజూరు చేయాలన్న వరవర రావు దాఖలు చేసుకున్న పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు వరవరరావుకు అంతకు ముందు ఇచ్చిన ఆరు నెలల బెయిలు కాలపరిమితిని ఎత్తివేసి శాశ్వత బెయిలు మంజూరు చేసింది. కోరేగావ్ అల్లర్ల కేసులో నిందితుడిగ ఉన్న వరవరరావును ఎన్ఐఏ 2018 అగస్టు 28న అరెస్టు చేసిన సంగతి విదితమే. ఆయనతో పాటు మరో 16 మందిని కూడా ఎన్ఐఏ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరందరిపై కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రపన్నారన్న అభియోగాలు మోపింది. 

పయ్యావులను టార్గెట్ చేశారా? ఎందుకేంటి?

జగన్ సర్కార్    తెలుగుదేశం సీనియర్ నాయకుడు,  ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ను టార్గెట్ చేసిందా? అందుకే ఆయనకు భద్రత ఉపసంహరించిందా? అంటే పయ్యావుల మాత్రం ఔననే అంటున్నారు. కావాలనే ప్రభుత్వం తన భద్రతకు భంగం వాటిల్లేలా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఉండే వారకి భద్రత కల్పించనంటున్న జగన్ సర్కార్ తెలంగాణలో నివసిస్తున్న వైసీపీ నేతలకు ఎలా, ఎందుకు భద్రత కల్పిస్తోందో చెప్పాలని నిలదీశారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాననీ, ప్రభుత్వఆర్థికఅరాచకత్వాన్ని ప్రశ్నిస్తున్నననే జగన్ తనను టార్గెట్ చేశారని పయ్యావుల ఆరోపించారు. భద్రత పెంచాలని కోరినా ఇంత వరకూ పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వానికి చెందిన తప్పులను ఎత్తి చూపుతున్నందుకే ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందని ఓ సీనియర్ అధికారే స్వయంగా తనకు తెలిపారని కూడా పయ్యావుల అన్నారు. గన్ లైసెన్స్ కు అప్లై చేసుకుంటే ఆల్ ఇండియా పర్మిట్ అంటూ నాలుగు నెలల నుంచీ తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. నక్సల్స్ నుంచి తన కుటుంబానికి ముప్పు ఉందని, ఇప్పటికే తన నియోజకవర్గంలో నక్సల్స్, మాజీ మిలిటెంట్ల కదలికలు పెరిగాయని, ఆ విషయం తెలిసి కూడా తనకు భద్రత కల్పించడం లేదని ఆయన ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. అయితే పోరాటాలలో రాటు తేలిన తనను ప్రభుత్వం బెదరించి లొంగదీసుకోవడం సాధ్యం కాదని అన్నారు. తాను ప్రస్తావిస్తున్న అంశాలూ, రాస్తున్న లేఖలు జగన్ సర్కార్ కు ఇబ్బంది కలిగిస్తున్నందునే తనను సర్కార్ టార్గెట్ చేసిందని పయ్యావుల అన్నారు. 

ప్రాణాలు తీసిన టిక్‌టాక్ ప్రేమ‌!

టిక్‌టాక్‌లో, సానియా ఖాన్ తన విడాకుల గురించి, ఆమె వ‌ర్గం, కుటుంబం నుండి వచ్చిన మ‌ద్ద‌తు గురించి మాట్లాడింది, తన వ‌ర్గంలో తనను తాను ఎవ్వ‌రి అభిమానం పొంద‌లేక‌పోయాన‌ని అభివర్ణిం చింది. సానియా పాకిస్తానీ-అమెరికన్ మహిళ, విడా కులకు దారితీసిన సంబంధం తాలూకు గాయం గురించి టిక్‌టాక్‌లో వీడియోలను పోస్ట్ చేసింది. ఆమె విడిపోయిన భర్త సుదూర ప్ర‌యాణం చేసి వ‌చ్చి మ‌రీ చంపాడు. గత నెలలో చికాగోలో ఈ సంఘటన జరిగింది, సానియా ఖాన్ చికాగో నుంచి బయలుదేరి టేనస్సీకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, తాము ఇంట్లో లేమ‌ని చిన్నబోర్డు పెట్టారు. కానీ లోప‌ల ఘోరం జ‌రిగిపోయింది. 36 ఏళ్ల రహెల్ అహ్మద్, తరువాత తుపాకీతో ఆత్మహత్య చేసుకున్నాడు. టిక్‌టాక్ లో విఫలమైన వివాహం గురించి పోస్ట్ చేసిన తర్వాత ఆమె ను చంపడానికి  అహ్మద్ జార్జియా నుండి చికాగోలోని ఖాన్ ఇంటికి వెళ్లాడని  మీడియా తెలిపింది. స్థానిక పోలీసులు జూలై 18న సాయంత్రం 4.30 గంటలకు పోలీసులు అక్కడికి చేరుకున్నారని,  ఖాన్, అహ్మద్‌ల మృతదేహాల ను తుపాకీ గాయాలతో కనుగొన్నారని పేర్కొంది. సుమారు ఐదు సంవత్సరాలు అహ్మద్‌తో డేటింగ్ చేసిన తర్వాత, ఆమె జూన్ 2021లో అతనిని వివాహం చేసుకుంది, వారు కలిసి చికాగో వెళ్లారు. అహ్మద్ కుటుంబం అతను కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. జార్జియా పోలీసులు తమ చికాగో సహచరులకు 36 ఏళ్ల అతను  త‌న భార్య నిర్ణ‌యం మార్పించి ఇంటికి తీసుకువ‌ద్దామ‌నే  చికాగో (1,100 కిలోమీటర్ల కంటే ఎక్కువ) వెళ్లినట్లు చెప్పారు. టిక్‌టాక్‌లో, వివాహ గాయం, విడాకుల కళంకంతో పోరాడుతున్న మహిళలకు ఖాన్ చాలాకాలం నుంచి మ‌ద్ద‌తు నిస్తున్న‌ వారికి సామాజిక న్యాయం జ‌రిగేలా చూస్తూ నాయ‌కురాలుగానూ ప్ర‌సిద్ధి పొందారు,  మహిళ మరణంతో ఆమె స్నేహితులు చలించిపోయారు. 29 సంవ‌త్స‌రంలోకి వ‌స్తున్నాన‌ని, ఇది ఒక కొత్త ప్రారంభం కానుంది. ఆమె చాలా ఉత్సాహంగా ఉంది అని బ్రియానా విలియమ్స్, ఒక విశ్వవిద్యాలయ స్నేహితురాలు ఒక ఉత్త‌రం ద్వారా చెప్పారు. ఆమె మీకు తనకు మంచి మిత్రుడ‌ని, ఎంతో స‌హాయ‌ప‌డుతూండేవాడ‌ని మెహ్రూ షేక్ ఖాన్‌ను త‌న ట్విట‌ర్‌లో పేర్కొన్నారు ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చాలా యాక్టివ్‌గా ఉండేవాడు, అక్కడ అతను వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, మెటర్నిటీ షూట్‌లు, బేబీ షవర్స్ ఇతర ప్ర‌చారాలద్వారా  ఆమె అభిమానిగా  అనుసరించాడు. ఆమె టిక్‌టాక్ వీడియోలలో ఒకదానిలో, ఖాన్ తన వ‌ర్గం వారు, కుటుంబం నుండి మ‌ద్ద‌తే  గురించి మాట్లాడాడు, తన సంఘంలో తనను తాను వెలివేయ‌బ‌డిన‌ట్టుగా వర్ణించు కున్నాడు. దక్షిణాసియా మహిళగా విడాకులు తీసుకోవడం కొన్నిసార్లు మీరు జీవితంలో విఫలమైనట్లు అనిపిస్తుంద‌ని ఆమె ఒక పోస్ట్‌లో పేర్కొంది.

అమరావతి వేదికగా తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. చక్రం తిప్పుతున్న ఆర్ఎస్ఎస్ కీలక నేత

బీజేపీ తెలంగాణలో జోరు పెంచింది. ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా ఏ పార్టీ నుంచైనా సరే కమలం గూటికి చేరేవారి గురించి దుర్భిణి పట్టి మరీ గాలిస్తోంది. చేరికల కమిటీ చైర్మన్ ఒక వైపు అదే పనిలో వచ్చేవారూ, రాని వారు అన్న తేడా లేకుండా పార్టీల్లో పెద్దగా ప్రాముఖ్యత లేని నాయకులందరికీ ఫోన్లు చేసి మరీ కమలం గూటికి రావాలని ఆహ్వానించేస్తున్నారు. అలా కమలం ఆహ్వానిస్తున్న నేతలలో కాంగ్రెస్ వారు ఉన్నారు, టీఆర్ఎస్ వారూ ఉన్నారు. చివరాఖరికి తెలంగాణలో ఉండీ లేనట్లుగా మిగిలిన వైసీపీ వారూ ఉన్నారు. ఇది చాలదన్నట్లు ఆపరేషన్ ఆకర్ష్ పని కోసం ఆర్ఎస్ఎస్ కూడా రంగంలోనికి దిగిందని చెబుతున్నారు. ఆర్ఎస్ఎస్ కు చెందిన ఓ కీలక నాయకుడు కూడా కమంల ఆపరేషన్ ఆకర్ష్ కోసం చాలా సీరియస్ గా  పని చేస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆరు నూరైనా.. నూరు ఆరైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అత్యధిక స్థానాలలో విజయం సాధించి తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని చాలా సీరియస్ గా చేపట్టిందని పరిశీలకులు అంటున్నారు. ఒక వైపు తెలంగాణ నుంచి చేరికల కమిటీ చైర్మన్ ఈటల తన పని తాను చేసుకుపోతుంటే.. బీజేపీ మరో వైపు నుంచి అమరావతి వేదికగా తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమానికి సమాంతరంగా పావులు కదుపుతోంది. వ్యూహాలు రచిస్తోంది.  ఈ నేపథ్యంలోనే వివిధ పార్టీలలో గుర్తింపు లేని నాయకులను, అసంతృప్తితో ఉన్న నాయకులనూ, గుర్తింపు ఉన్నా కూడా వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ లభిస్తుందో లభించదో అన్న డైలమాలో ఉన్న నేతలనూ బీజేపీ బీజేపీ వలవేసి పట్టుకుంటోందని అంటున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే జయసుధను పార్టీలోకి ఆహ్వానించారు. ఆమె ఆ ఆహ్వానాన్ని మన్నించి పార్టీలోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకంగా ఉండి ఆ తరువాత తెరాస గూటికి చేరిన నిజామాబాద్ జిల్లాకు చెందిన మండవ వెంకటేశ్వరరావుకు కూడా కమలం పార్టీ నుంచి ఫోన్ వెళ్లిందని చెబుతున్నారు.  గతంలో నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల సందర్బంగా తన కుమార్తె కవిత కోసం కేసీఆర్ స్వయంగా మండవ వెంకటేశ్వరరావును ఆయన ఇంటికి వెళ్లి మరీ గులాబి కండువా కప్పారు. ఆ తరువాత మండవను పట్టించుకున్న పాపాన పోలేదు. దాంతో ఆయన పరిస్థితి తెరాసలో ఉండీ లేనట్టుగా మారిపోయింది. ఇప్పుడు మండవకు కమలంగూటికి రావల్సిందిగా బీజేపీ నుంచి ఆహ్వానం అందింది. ఇలా గతంలో రాజకీయంగా కీలకంగా వ్యవహరించి ఇప్పుడు పెద్దగా గుర్తింపు లేకుండా ఉన్న నేతలను వెతికి పట్టుకుని మరీ కాషాయ కండువా కప్పేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని సమాచారం. తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ జోరును పెంచేందుకు ఏపీలోని అమరావతి వేదికగా వ్యూహాత్మకంగా ఓ ఆర్ఎస్ఎస్ అగ్ర నేత పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు.  ఇప్పటికే  పలువురు నేతలతో ఆయన టచ్ లోకి వచ్చారని చెబుతున్నారు. అలా ఆర్ఎస్ఎస్ నేత ఇప్పటికే సంప్రదించిన వారిలో తెరాస నాయకులే కాకుండా కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారని చెబుతున్నారు.  మండవ వెంకటేశ్వరరావు, జయసుధలతో పాటు కాంగ్రెస్ కు చెందిన రామిరెడ్డి దామోదరరెడ్డి, జగ్గారెడ్డి, దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కూడా బీజేపీతో టచ్ లోకి వచ్చారని చెబుతున్నారు. వీరే కాకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, రసమయి బాలకిషన్, జూపల్లి కృష్ణారావు, రోహిత్ రెడ్డిలను కూడా కమలం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా సంప్రదింపులు జరిపిందని చెబుతున్నారు. అమరావతి వేదికగా అత్యంత రహస్యంగా జరుగుతున్న ఈ సంప్రదింపులు సత్ఫలితాలను ఇస్తున్నాయని బీజేపీకి చెందిన విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. కాగా మునుగోడు ఉప ఎన్నిక తరువాత ఈ కార్యక్రమం మరింత జోరందుకుంటుందనీ, ముఖ్యంగా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలపై బీజేపీ మరింతగా దృష్టి సారిస్తుందని చెబుతున్నారు. అమరావతి వేదికగాఈ  సీక్రెట్ ఆపరేషన్ జరుగుతుండటం, అదీ ఓ ఆర్ఎస్ఎస్ కీలక నేత దీనిని పర్యవేక్షిస్తుండటంతో టీఆర్ఎస్ వలసల నివారణకు ఎటు నుంచి ప్రయత్నించాలో కూడా అర్ధం కాని పరిస్థితులలో పడిందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఇతర పార్టీలను నిర్వీర్యం చేసే లక్ష్యంతో గతంలో కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ పేరిటి వలసలను ప్రోత్సహించడమే ఇప్పుడు టీఆర్ఎస్ కు బూమరాంగ్ అయ్యిందని పరిశీలకులు అంటున్నారు.  అసంతృప్తులను బుజ్జగించడమెలా, వలసనలను నిరోధించడమెలా అని కేసీఆర్ తల పట్టుకుంటున్నట్లు తెరాస శ్రేణులు అంటున్నాయి.  జూపల్లి కృష్ణారావును బుజ్జగించడానికి కేసీఆర్, కేటీఆర్ చేసిన ప్రయత్నాలు విఫలమైన ఉదంతాన్ని ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు. ఏది ఏమైనా రానున్న రోజులలో బీజేపీలోకి వలసలు మరింత పెరిగే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

బ‌డుల విలీనం..  త‌ల్లిదండ్రుల ఆగ్ర‌హం

అనుకున్నంతా అయింది. పాఠశాలల్లో తరగతుల విలీనం ప్రభుత్వబడులపై తీవ్ర ప్రభావం చూపింది. సర్కారు అంచనాలను తల కిందులు చేస్తూ ఏకంగా 6 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వబడులకు రాంరాం చెప్పేశారు. ఈ ఏడాది జగనన్న విద్యా కానుక కిట్లను 47.4 లక్షల మందికి ఇవ్వాలని అంచనా వేయగా ఈ ఆగస్టు 1వ తేదీ నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థుల సంఖ్య 41.2 లక్షలు మాత్రమే ఉంది.  ఆరో తరగతి విద్యార్థుల సంఖ్య గతంలోకంటే పెరిగి సాధారణ స్థితికి వచ్చినా, ఒకటో తర గతిలో చేరేవారం సంఖ్య త‌గ్గుముఖం ప‌ట్టింది. ప్రభుత్వబడుల్లో విద్యార్థుల నమోదుకు ఈ నెలాఖరు వరకు గడువు ఉన్నం దున ఈ సంఖ్య స్వల్పంగా పెరిగి 42 లక్ష లకు చేరినా ఐదు లక్షలకు పైగా లోటు ఉంటుందని భావిస్తున్నారు. 2021-22 విద్యా సంవత్సరంలో 45.71 లక్షల మంది విద్యా ర్థులు ప్రభుత్వబడుల్లో చదువుకున్నారు. కాగా ఇపుడు ఈ  గణాంకాల ప్రకారం చూస్తే, ఈసారి 4.55 లక్షల మంది బడికి దూరం కావ‌డం గ‌మ‌నార్హం.  అస‌లు విలీనంతోనే స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది.  ఈ ఏడాది ప్రాథమిక పాఠశాలల్లో చేపట్టిన తరగతుల విలీన ప్రక్రియ తీవ్ర గందరగోళా నికి కారణమైంది. 5,870 ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను ఒక కిలోమీటరు పరిధిలో ఉన్న ప్రాథమికో న్నత, ఉన్నత పాఠ శాలల్లో విలీనం చేస్తున్నారు. చిన్న పిల్లలను దూరం పంపలేమని బడులు తెరిచిన రోజు నుంచే విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. ఈ ప్రక్రియ ప్రాథమిక విద్యావ్యవస్థను గందరగోళం చేస్తుందని ఉపాధ్యాయ సంఘాలు గగ్గోలు పెట్టాయి. కానీ విధానపర నిర్ణయంలో వెనక్కి తగ్గేది లేదంటూ ప్రభుత్వం విలీనంపై భీష్మించింది. మొండిగా ముందడుగు వేసింది. దీంతో ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే ప్రభుత్వబడుల్లో చేరిక‌ల‌పై ఆందో ళన మొదలైంది. దాదాపు ప‌ది శాతం విద్యార్థులు ప్రైవేటు బాట పట్టే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరించాయి. అంతదూరం పంపడం తప్ప దనుకుంటే మా పిల్లలకు ప్రభుత్వబడి అక్కర్లేదంటూ అనేకచోట్ల తల్లిదండ్రులు తెగేసి చెప్పారు. అందుకు అను గుణంగానే ప్రైవేటు పాఠశాలలకు క్యూ కట్టారు. ప్ర‌భుత్వం తీసుకున్న ఈ స‌రికొత్త విధాన నిర్ణ‌యం ఎవ‌రినీ ఆక‌ట్టుకోవ‌డం లేదు. పైగా తీవ్ర నిర‌స‌న లు వెల్లువెత్తుతున్నాయి. మ‌రి జ‌గ‌న్ స‌ర్కార్ త్వ‌ర‌లో మార్పులు చేర్పులు చేప‌ట్టి త‌ల్లిదండ్రుల‌కు న‌మ్మ‌కం క‌లిగించాలి. 

ప్రపంచానికి కొత్త వైరస్ ముప్పు

ఒక దాని తరువాత ఒకటి అన్నట్లుగా వైరస్ లు ప్రపంచ ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయి. చైనా నుంచి ఆరంభమై ప్రపంచం మొత్తన్ని గడగడలాడించిన కరోనా వైరస్ ముప్పు ఇంకా పూర్తిగా తొలిగిపోక ముందే మంకీవైరస్ వ్యాప్తి బెంబేలెత్తిస్తోంది. అంతలోనే చైనాలో మరో ప్రాణాంతక వైరస్ వెలుగులోనికి వచ్చింది. ఈ వైరస్ ను లాంగ్యా హెనిపా వైరస్ అంటున్నారు. ఇది జంతువుల నుంచి మనుషులకు సోకుతుందని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా పెంపుడు జంతువుల నుంచే ఈ వైరస్ వ్యాపిస్తోందని చెబుతున్నారు. చైనాలో ఇప్పటికే 35 మంది ఈ వైరస్ బారిన పడి ప్రత్యేక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా లాగే ఇది కూడా ప్రాణాంతక వైరస్ అని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి సోకిన వారికి విపరీతమైన జ్వరం, అలసట, దగ్గు, వాంతులు, కండరాల నొప్పి తదితర లక్షణాలు ఉంటాయని, ఈ వైరస్ ప్రభావం లివర్, కిడ్నీల వైఫల్యానికి దారి తీస్తుందని చెబుతున్నారు. అలాగే రక్తంతో ప్లేట్ లెట్స్ సంఖ్య విపరీతంగా పడిపోయి ప్రాణాల మీదకు వస్తుందని చెబుతున్నారు. తొలుత ఈ వైరస్ గురించి తైవాన్ సెంటర్స ఫర్ డిసీజ్ కంట్రోల్ గుర్తించింది. 

దొంగ భ‌క్తి!

మ‌నం ఏంచేస్తున్నా పైవాడు గ‌మ‌ని స్తూనే ఉంటాడ‌న్నది అనాదిగా ప్ర‌వ‌చ‌ కులు,మ‌త‌బోధ‌కులు అంటున్న‌ మాట‌. ధ‌ర్మ‌మార్గాన న‌డ‌వాలి, ధ‌ర్మచిం త‌నే చేయాలి. ఆ ప‌రిధి దాటి మ‌నిషి ఇవ‌త‌ ల‌కి రాకూడ‌దు. వ‌స్తే దేవుడు శపిస్తాడు, నీకు తెలీకుండానే అనేకా నేక ఇబ్బందు ల‌కు గుర‌వుతావు. మ‌రి తెలిసి చేసే త‌ప్పులు దేవుడు కాయ‌డా? ఏమో మ‌రి కానీ జ‌బ‌ల్సూర్ దొంగ‌ని మాత్రం దేవుడు ఏమేర‌కు క‌రుణిస్తాడో చూడాలి.  ఇత‌గాడి పేరు, ఊరూ సంగ‌తి అటుంచితే అత‌ను దొంగ‌త‌నం చేయ‌డానికి మ‌ధ్య‌ ప్ర‌దేశ్ జ‌బ‌ల్పూర్‌లో  ఒక గుడికి వెళ్లా డు. చుట్టూరా ఎవ‌రూలేరు, అయినా ప‌రికించి చూశాడు. కాస్తంత ధైర్యం తెచ్చ‌కుని హుండీ ద‌గ్గ‌రికి వెళ్లాడు. కానీ అత‌ను అమాం తం దాన్ని ప‌గ‌ల‌గొట్టి సొమ్ము మూట‌గ‌ట్టుకుపోలేదు. ఎదురుగా అమ్మ‌వారిని స్మ‌రించుకున్నాడు. రెండు చేతులూ జోడిం చి త‌ల్లీ నా త‌ప్పు ను కాయి అని కోరుకున్నాడు. హుండీ ప‌గ‌ల‌గొట్టి డ‌బ్బులు తీసుకున్నాడు.  ఆ దేవ‌త అలా బొమ్మ‌లా చూస్తుండిపోయింది. త‌న భ‌క్తుడు ఇంత‌ప‌నిచేశాడేమిటా అనుకొనీ ఉండ‌వ‌చ్చు. మొత్తానికి ఆమె అపా ర క‌రుణామూర్తి గ‌నుక పైకి ఏమీ అనలేదు, శూల‌మూ విస‌ర‌లేదు. దొంగ‌గారు హ‌మ్మ‌య్య‌.. అనుకున్నాడు. మూట తీసుకుని బ‌య‌ట‌ప‌డ్డాడు. కానీ దేవుడి గ‌ర్భ‌గుడిలోనూ సిసి టీవీలు ఉంటాయ‌న్న సంగ‌తి పాపం ఆ పిచ్చాడికి తెలియ‌లేదు. అదుగో వాటికి దొరికాడు.. అదీ అమ్మ‌వారి మ‌హ‌త్తు! అత‌గాడి విన్యాసాల‌న్నీ సోష‌ల్ మీడియాలో ఇపుడు చ‌క్క‌ర్లు కొడుతు న్నాయి. మొద‌టి సారే అయినా, వెధ‌వ ప‌ని వెధ‌వ ప‌నేగా! పోనీలే త‌ర్వాత తెలుసుకుంట‌డ‌నేది ఉండ‌దు. 

అమెరికా నల్ల కలువ సెరీనా టెన్సిస్ కు గుడ్ బై

ప్రపంచ టెన్నిస్ ఆల్ టైం గ్రేట్ క్రీడామణుల్లో ఒకరైన సెరెనా విలియమ్స్… ఆ ఆటకు గుడ్ బై చెప్పేసింది. మహిళా టెన్నీస్ కే వన్నెతెచ్చిన క్రీడాకారిణిగా సెరేనాను టెన్నిస్ అభిమానులు అభివర్ణిస్తారు.  పదునైన షాట్లతో, పవర్ ఫుల్ స్ట్రోక్స్ తో ఆమె   ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంటే ప్రేక్షకులు మైమరచిపోతారు. 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ను తన ఖాతాలో వేసుకున్న అమెరికా క్రీడాకారిణి సెరినా విలియమ్స్ కు ప్రపంచ వ్యాప్తంగా అసంఖ్యాకమైన అభిమానులు ఉన్నారు. అటువంటి సెరీనా విలియమ్స్ టెన్నిస్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించింది. రిటైర్మెంట్ ప్రకటన అని కాదు కానీ ఇక క్రీడకు దూరం అవుతున్నట్లు వివరణ ఇచ్చింది. టెన్నిస్ కు గుడ్ బై చెప్పి జీవితంలోని ఇతర పార్శ్వాల వైపు మళ్లుతున్నట్లు సెరీనా పేర్కొంది. ప్రస్తుతం టొరెంటో నేషనల్ ఓపెన్ టోర్నీ ఆడుతున్న సెరీనా వచ్చె నెలలో 41వ పడిలోకి అడుగిడ నుంది.  స్వదేశంలో జరుగుతున్న టొరెంటో ఓపెన్ టోర్నీయే సెరీనా చివరి టోర్నమెంట్ అవుతుంది.  

హ‌ర్‌ఘ‌ర్ తిరంగాను తిర‌స్క‌రించిన శిరోమణి అకాలీదళ్(ఎ)

దేశంలో ప‌రిస్థితులు చాలాచిత్రంగా ఉన్నాయి. మీ ఇల్లు, ఉద్యోగం, భార‌తీయ‌తా బాహాటంగ ప్రక‌టించుకోవాలి. లేకపోతే ఎవ‌రైనా ఏదైనా సంశ‌యిస్తారు. పూర్వీకుల కాలం నుంచి భార‌త్‌లో ఉన్నా, భార‌త్‌లోనే ఏదో ఒక రాష్ట్రంలో పుట్టి పెరుగుతున్నా స‌రే నీ దేశభ‌క్తిని మ‌రోసారి ప్ర‌క‌టించుకోవాలి. ఇది బీజేపీ వారి శాస‌నం. దీనికి తిరుగులేదు. బీజేపీ వారి త‌ల‌తిక్క ఆలోచ‌న‌కు విప‌క్షా ల‌తో పాటు ప్ర‌జ‌లూ న‌వ్వుకుంటున్నారు. తాజాగా బీజేపీ వారు కొత్త నినాదం తెచ్చారు. మ‌న దేశ స్వాతంత్య్ర‌దినోత్స‌వం సంద ర్భంగా ప్ర‌తీ ఒక్క‌రూ మొబైల్లో త్రివ‌ర్ణ‌ప‌తాకాన్ని పెట్టుకోవాల‌ని, ఇళ్ల మీద జెండాను ఎగుర‌వేయాల‌ని. అలా చేస్తేనే మ‌న‌సావాచా దేశ‌భ‌క్తుల‌ని ప్ర‌ధాని ఉవాచ సారాంశం. ప్ర‌జ‌ల‌కు లేని అనుమానాన్ని క‌ల్పించ‌డం అంటే ఇదే.  మా వూళ్లో, రాష్ట్రంలోనే క‌దా ఉంట‌, ఎటూ వెళ్లిపోలేదే .. అనే ఆలోచ‌న‌లో జనం పడేలా కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీరు ఉంది. అయితే ఇదంతా కేవ‌లం బీజేపీ వీరాభిమానుల సంఖ్య‌ను లెక్కించ‌డానికి వేసిన వినూత్న ప‌థ‌కం అంటూ విమ‌ర్శ‌కులు అంటు న్నారు. కొండ‌క‌చో ఇదీ నిజ‌మేన‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో అడిగిన‌ట్టు విడిగా ఎవ‌రినీ మా పార్టీనా ఎగ స్పార్టీనా అని ఎవ‌రు మాత్రం అడ‌గ గలుగుతారు. అందుకే ఈ ప‌థ‌కం వేసారని అంటున్నారు. కాగా ఇటువంటి పిచ్చి ఆలోచ‌న‌లు, వ్యూహాలు మానుకోవాల‌ని శిరోమ‌ణి అకాలీద‌ళ్ (అమృత్‌స‌ర్‌) పార్టీ చీఫ్ సిమ్రాన్ జిత్ సింగ్‌ మాన్ మండిప‌డుతున్నారు. హ‌ర్ ఘ‌ర్ తిరంగా అనే నినాదాన్ని కేంద్రం మానుకోవాల‌ని ఆయ‌న సూచించారు. ఆగ‌ష్టు 14,15 తేదీల్లో త‌మ నినాదాన్ని అమ‌లు చేయాల‌ని కేంద్రంలోని  బీజేపీ స‌ర్కార్ ప్ర‌క‌టించ‌డాన్ని ఆయ‌న ఖండించారు. అస‌లా మాట‌కు వ‌స్తే, త‌మది వేరే వ‌ర్గమ‌ని తిరంగా ప్రచారంలో పాల్గొనేది లేద‌ని ఎస్ ఏడి(ఏ) ఛీఫ్ స్పష్టం చేశారు.

14 నెల‌లు..రూ.20 కోట్ల అవినీతి!

ప‌క్క‌నే ఉన్నంత వ‌ర‌కూ మ‌నోడు, ప‌క్క‌కి వెళితే ప‌రాయోడు..బెమ్మంగారు జెప్పారు.. చెట్టుకింద చుట్ట‌తాగుతూ మ‌నిమ‌న్న‌న్ చెప్పాడు. నిజ‌వే. దీనికి కాలం, ప్రాంతంతో బొత్త‌గా సంబంధం లేదు. ఎవ‌రు ఎందులోక‌యినా జంప్ కావ‌డానికి మ‌న దేశంలో ఉన్నంత సౌక‌ర్యం మ‌రోటి ఉండ‌దేమో! ఇపుడు తాజాగా త‌మిళ‌నాట ఇదే జ‌రుగుతోంది. డీఎంకే పాల‌న‌లో కేవ‌లం 14 మాసాల్లో రూ.20 కోట్లు భోంజేశార‌ని అన్నా డీఎంకే తాత్కాలిక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్రతిప‌క్ష నేత ఎడ‌ప్పాడి ప‌ళ‌నిస్వామి ఆరోపించారు.  మంగళవారం (ఆగస్టు9)ఆయ‌న క‌డియంప‌ట్టిలో ఆయన పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడారు.  అన్నాడీఎంకే అమలుచేసిన సంక్షేమ పథకాలను డీఎంకే ప్రభుత్వం రద్దు చేయడంతో పాటు మరికొన్ని పథకాలకు పేర్లు మార్చి తాము ప్రవేశపెట్టినట్లు ప్రకటనలు గుప్పిస్తోందన్నారు.  గతంలో కరుణానిధి, తర్వాత స్టాలిన్‌, తర్వాత ఉదయనిధి, భవిష్యత్తులో ఇన్బనిధి.. ఇదేమైనా రాజకీయ పరంపరా?  అని ప్ర‌శ్నిం చారు. ఆ పార్టీలో మరెవ్వరినీ ముఖ్యమంత్రిని కానివ్వరని ఆరోపించారు. ఆస్తి, విద్యుత్‌ చార్జీలు పెంపుతో డీఎంకే ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, జరగబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పళనిస్వామి పేర్కొన్నారు

ప్రియాంకా గాంధీకి కరోనా.. హోం క్వారంటైన్ లో కాంగ్రెస్ నాయకురాలు

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనకు కరోనా సోకిందనీ, స్వల్ప లక్షణాలు ఉన్నాయనీ, హోం క్వారంటైన్ లో విశ్రాంతి తీసుకుంటున్నాననీ ఆమె ట్వీట్ చేశారు. కాగా ప్రియాంక గాంధీకి కరోనా సోకడం రెండు నెలల వ్యవధిలో ఇది రెండో సారి. కొద్ది రోజుల కిందట ఆమె తల్లి, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా సోనియాగాంధీ అప్పట్లో కొద్ది రోజులు ఆసుపత్రిలో చేరిన సంగతి విదితమే. ఇలా ఉండగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కూడా అనారోగ్యం పాలయ్యారు. అయితే ఆయనకు కరోనా కాదని చెబుతున్నారు. స్వల్ప అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. అనారోగ్యం కారణంగా బుధవారం (ఆగస్టు10) ఆయన రాజస్థాన్ పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆయన బుధవారం రాజస్థాన్ లోని అల్వార్ లో పర్యటించాల్సి ఉండగా అది రద్దైంది.

అధికారుల పని ఎస్ బాస్ అనడమే.. గడ్కరీ ఉవాచ

అధికారం ఎంత పనైనా చేయిస్తుంది. అందుకు ప్రధాని మోడీ అయినా, మంత్రి గడ్కరీ అయినా మినహాయింపు కాదనడానికి తాజాగా గడ్కరీ చేసిన వ్యాఖ్యే నిదర్శనం. అధికారులకు ఉద్యోగ నిబంధనలు బుక్ రూల్ అలాంటివన్నీ ఉన్నా మంత్రులు చెప్పిన దానికి ఎస్ బాస్ అని తీరాల్సిందేనని గడ్కరీ తేల్చేశారు. విధినిర్వహణలో ఎలా వ్యవహరించాలన్నదానికి అధికారులకు బోలెడు నిబంధనలున్నాయి. వాటిని కాదని మంత్రో, ముఖ్యమంత్రో చెప్పారనీ రూల్స్ ను ఉల్లంఘిస్తే.. మంత్రులకూ ముఖ్యమంత్రులకూ ఏం కాదు. కానీ అధికారులు మాత్రం కోర్టు అక్షింతలు వేయించుకోవాల్సి ఉంటుంది. ఆ ఉల్లంఘన ఇంకొంచెం తీవ్రమైనదైతే ఉద్యోగానికే ఎసరు రావచ్చు.. కొండొకచో జైలుకూ వెళ్లాల్సి రావచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైస్ హయాంలో జరిగిందదే. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ లో జగన్ హయాంలో జరుగుతున్నదీ అదే. ప్రభుత్వం చెప్పిన దానికల్లా సరేనంటూ తలలూపేసిన కారణాన పలువురు ఐఎస్ఎస్ అధికారులు కోర్టులలో అక్షింతలు వేయించుకున్నారు. మొట్టికాయలు భరించారు.  సామాజిక సేవా శిక్షను సైతం అనుభవించారు. అయినా సరే వ్యవస్థలలో మంత్రులదే అంతిమ నిర్ణయం అంటున్నారు కేంద్ర మంత్రి గడ్కరీ.  మంత్రులు ఏం చెప్పినా.. ఎస్ బాస్ సఅంటూ చేయడమే  బ్యూరోక్రాట్ల పని అని తేల్చేశారు. ప్రభుత్వం పని చేసేదే మంత్రుల భాగస్వామ్యంతో అని వారికి హితవు చెప్పారు.  (బ్యూరోక్రాట్లు  చెప్పినట్టుగా ప్రభుత్వం పనిచేయదు. మంత్రుల ఆదేశాలకు బ్యూరోకాట్లు  ‘యస్ సర్’ అని అనాల్సిందే. అని విస్పష్టంగా చెప్పేశారు.  ఏ చట్టం కూడా పేదల సంక్షేమానికి అడ్డుకాదన్న మహాత్మాగాంధీ మాటలను ప్రస్తావిస్తూ, అవసరమైతే   చట్టాన్ని పది సార్లు ఉల్లంఘించాల్సి వచ్చినా వెనుకాడేది లేదని   గడ్కరీ స్పష్టం చేశారు.