వైసీపీ కార్యాలయాలుగా వర్సిటీలు.. మండిపడ్డ లోకేష్
posted on Aug 10, 2022 @ 11:15AM
అనాదిగా రాజకీయాలను కుల మతాలే శాసిస్తున్నాయి. ప్రజాసంక్షేమం కోరి రాజకీయాల్లోకి వచ్చే వారు అధికార వర్గానికి చెంది న వారయితే మరీ మంచిది లేకపోతే ఇబ్బందులు, నిర్లక్ష్యానికి గురవుతూనే ఉన్నారనే వాదనా ఉంది. దీని మీద నిత్యం అన్ని వర్గాల నుంచి భారీ విమర్శలు ప్రభుత్వాలు ఎదుర్కొంటూనే ఉన్నాయి.
ఎన్నికల సమయంలో ఎంత చెప్పి నా, ఎన్ని వాగ్దా నాలు చేసి వెనుకబడిన వర్గాలను ఆకట్టుకోవడానికి ఎన్ని జిమ్మిక్కులు చేసినా చివరాఖరికి అధికారం అంటగడుతు న్నది మాత్రం వారి సామాజిక వర్గానికి చెందినవారే కావడం దారుణం. అందుకు జగన్ సర్కార్ తీరే ఉదాహరణ. అందుకు తాజా ఉదాహరణ ఒక బీసీ ఉద్యోగి ప్రభుత్వాధికారుల వేధింపులు తట్టుకోలేక ఉద్యోగానికి రాజీనామా చేయడం. ఇది రాష్ట్రంలోని అరా చక పాలనకు అద్దంపడుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.
అసలు విశ్వవిద్యాలయాలనే వైసీపీ కార్యాలయాలుగా మార్చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. అన్నమయ్య జిల్లా కలికిరి జేఎన్టీయూ సూపరింటెండెంట్ నాగభూషణం వీఆర్ఎస్ తీసుకుంటానని ప్రకటించడం బాధాకరమని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆయన్ని అనంతపురం నుంచి అన్నమయ్య జిల్లా కలికిరికి బదిలీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పెత్తనం మొత్తం ఒకే సామాజిక వర్గానికి అప్పజెప్పి బడుగు, బలహీన వర్గాల ఉద్యోగులను అణగదొక్కాలని చూస్తున్నా రన్నారు. వైసీపీ నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీల్లో ఇదే పరిస్థితి ఉంద న్నారు. సీఎం కులపిచ్చ తగ్గించుకుని ఇతర సామాజికవర్గాల వారి ఆత్మ గౌరవం కాపాడాలని లోకేష్ హితవు పలికారు.