ప్రజానాయకులకు ఆదరణ తగ్గదు!
posted on Aug 10, 2022 @ 12:06PM
మంచి ఉపాధ్యాయుడికి గుర్తింపు ఉంటుంది, మంచి క్రీడాకారుడినీ ఎప్పుడూ గౌరవిస్తారు, అలాగే మంచి నాయకుడిని ఎక్కడున్నా ఆదరించి పలకరించడం జరుగుతుంది. దీనికి పార్టీలతో సంబంధం లేదు. కావడానికి పార్టీలు, సిద్ధాంతాల్లో వైరుధ్యం ఉన్నా, గతంలో స్నేహం దెబ్బతిన్నా మళ్లీ కలుస్తారు, పలకరించుకుంటారు, కలిసి ప్రయాణించాలనీ అనుకోవచ్చు.
ఇపుడు తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ ప్రయాణంలో జరిగింది ఇదే. గతంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఎన్నడూ సుముఖంగా లేని ప్రధాని మోదీ ఇపుడు నీతి ఆయోగ్ సదస్సుకి ఆహ్వానించారు. చంద్రబాబు కూడా నిరాకరించలేదు. ప్రధాని పిలిచారు గనుక వెళ్లాలన్న గౌరవంతో వెళ్లారు. అక్కడ చక్కగా పాత మిత్రులు కలుసుకుని పాట పాడుకున్నంతగా మోదీ చంద్రబాబును పలకరించారు. మా వూరు రావట్లేదా అంటే ఇక్కడ నాకేం పని మాస్టారూ అన్నారు బాబు. మీతో మాట్లాడా ల్సింది శానా ఉంది మళ్లొచ్చిపోరాదూ.. అంటే బాబు సరేనన్నారు. ఇది టీడీపీ నాయకులూ ఊహించని మలుపు. ఆహ్వానించడం మాట అటుంచితే దగ్గరికి వచ్చి మరీ పలకరించి మళ్లీ కలుద్దామనడం ఎంతో హర్షణీయం.
రాష్ట్రముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రెడ్డి పలుమార్లు వెళ్లినా కేవలం తన రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా వెళ్లారన్నది అం దరం వింటున్న మాట. అన్నిసార్లూ కలిసినా, అంత అవకాశం ఇచ్చినా రాష్ట్ర ప్రయోజనాల గురించి అంతగా చర్చంచే అవకాశం పీఎం ఇవ్వలేదన్న ప్రచారమూ ఉంది. కనుకనే రాజు వెళ్లారు, వచ్చారన్నట్టుగా ఢిల్లీ నుంచి వచ్చాక ఇంటికెళ్లి కాఫీ తాగి పడుకో వడం తప్ప మీడియాకు, కనీసం తన పార్టీవారికయినా ఒక్కింత వివరాలు చెప్పలేకపోయారని విశ్లేషకులు అంటున్నారు.
కాగా, ప్రధానితో ఆయన భేటీపై వైసీపీలో ఉలికిపాటు చాలా ఎక్కువగా ఉందని టీడీపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఆ పార్టీ లోని భయమంతా ఇటీవల సజ్జల మాటల్లోనే కనిపించిందని, ప్రధాని వద్ద జగన్‌రెడ్డి ప్రాధాన్యం తగ్గలేదని చెప్పుకోవడానికి ఆయన చాలా తాపత్రయపడ్డారు. జగన్‌రెడ్డిని ప్రధాని గంటసేపు తన పక్కనే కూర్చోబెట్టుకున్నారని సజ్జల చెప్పారు. మరి గంటసేపు కూర్చుని రాష్ట్రానికి ఏం తెచ్చారో మాత్రం చెప్పలేదని ఒక మాజీ మంత్రి ఎద్దేవా చేశారు.
ఇదిలా ఉండగా, మాధవ్ అశ్లీల వీడియోపై పోరాటాన్ని ఉధృతం చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ నేతలు.. ప్రత్యేకించి మహిళా నేతలు బలంగా పోరాడుతున్నారని, అదే సమయంలో రాయలసీమ నేతలు కూడా ఈ అంశంపై గట్టిగా మాట్లాడాలని సూచించారు. ‘మూడేళ్లు గడచిపోయాయి. ఇక అందరం ప్రజా సమస్యలపై మరింత ఉధృతంగా పోరాడా ల్సిన సమయం వచ్చిం దని పొలిట్‌బ్యూరోలో సభ్యులుగా ఉన్నసీనియర్లలో కొందరు ఇంకా పూర్తి స్థాయిలో పోరాట స్ఫూర్తి ప్రదర్శించడం లేదన్నారు.
ఆ లోపం త్వరగా సవరించుకోవాలని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో జెన్‌కో నిర్మించిన కృష్ణపట్నం థర్మల్ కేంద్రాన్ని అదానీ గ్రూపు తీసుకునే ప్రయత్నం చేస్తోందని, దీనిపై బీజేపీ సహా అన్ని పార్టీలనూ కలుపుకొని పోరాడుతున్నామని సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు. భావ సారూప్య పార్టీల ను కలుపుకొని సమష్టిగా పోరాటం చేయాలని చంద్రబాబు సూచిం చారు. కాగా, రాష్ట్రం అభివృద్ధి పథంలో బాగా వెనుకబడిపోవడంపై ప్రవాసాంధ్రుల్లో తీవ్రమైన ఆవేదన ఉందని, వారిని అన్ని రకా లుగా కలుపుకొని పోవడానికి కార్యాచరణ రూపొందించుకోవాలని ప్రస్తుతం అమెరికాలో ఉన్న సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి సూచించారు. యువతకు ప్రాధాన్యంపై కమిటీపార్టీ సంస్థాగత నిర్మాణంలో యువతకు మరింత ప్రాధాన్యం ఎలా కల్పించాలో సూచనలివ్వడానికి కమిటీని వేయాలని పొలిట్‌బ్యూరో భేటీలో నిర్ణయించారు.