మీకో తొమ్మది.. మాకో తొమ్మిది.. కేబినెట్ ను విస్తరించిన మహారాష్ట్ర సీఎం షిండే
posted on Aug 10, 2022 7:58AM
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్ నాత్ షిండే తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. 1 మహారాష్ట్రలో నాటకీయ పరిణామాల మధ్య ఏక్‌నాథ్ షిండే వర్గం, బీజేపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి విదితమే. ఇప్పుడు తాజాగా షిండే తన కేబినెట్ ను విస్తరించారు. మొత్తం 18మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ విస్తరణలో షిండే సమన్యాయం పాటించారు. తన వర్గం వారికి, బీజేపీ వారికి సమప్రాధాన్యత నిచ్చారు. మంగళవారంఆగస్టు 9) రాజ్ భవన్ లో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ 18మంది నూతన మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
మంత్రివర్గ విస్తరణకు ముందు షిండే, బీజేపీ నాయకత్వం మధ్య పలు దఫాలు చర్చలు జరిగాయి. ఎవరిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలనే విషయాలపై అమిత్ షాతో పాటు పలువురు బీజేపీ పెద్దలతో ముఖ్యమంత్రి షిండే విస్తృతంగా చర్చలు జరిపారు.
బీజేపీ నుంచి చంద్రకాంత్ పాటిల్, సుధీర్ ముంగంటివార్, గిరీష్ మహాజన్, సురేష్ ఖాడే, రాధాకృష్ణ విఖే పాటిల్, రవీంద్ర చవాన్, మంగళ్ ప్రభాత్ లోధా, విజయ్‌కుమార్ గావిట్ తో పాటు అతుల్ సేవ్ లు కేబినెట్ బెర్త్ల్ లు పొందారు. ఏక్‌నాథ్ షిండే వర్గం నుంచి దాదా భూసే, సందీపన్ బుమ్రే, ఉదయ్ సమంత్, తానాజీ సావంత్, అబ్దుల్ సత్తార్, దీపక్ కేసర్కర్, గులాబ్రావ్ పాటిల్, సంజయ్ రాథోడ్, శంభురాజే దేశాయ్ లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.