గోరంట్ల‌పై, స‌హ‌క‌రిస్తున్న పోలీసుల‌పైనా చ‌ర్య‌లు తీసుకోండి..టీడీపీ నేత‌ అనిత

మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంలో తాను ముందుంటాన‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌చారం బాగానే చేయించుకున్నారు. కానీ త‌న ఎంపీయే ఊహిం చ‌నివిధంగా ప‌ట్టుబ‌డినా అదంతా క‌ట్టుక‌ధే అన్న‌ట్టు జ‌గ‌న్ వ్య‌వ‌హ రించ‌డంప‌ట్ల విప‌క్షాలు మండిప‌డుతున్నాయి. వైసీపీ అనంత‌పురం ఎంపీ గోరంట్లమాధ‌వ్ న్యూడ్ వీడియో లోక‌మంతా చూసి నివ్వెర‌పో యింది. అయినా అందులో ఉన్న‌ది న‌కిలీ, అదంతా మార్ఫింగ్ వ్య‌వ‌ హార‌మ‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు. ఎంత‌యినా త‌మ‌వాడు అంత దుర్మార్గానికి ఒడిగ‌డ‌తాడా అన్నది వారి ధీమా. కానీ అందులో క‌ని పించిన‌ది గోరంట్ల మాధ‌వుడే అని త‌ప్పుల్లేకుండా అంద‌రూ అన్నారు. కానీ అందుకు అవ కాశం లేద‌ని వైసీపీ కితాబునిచ్చింది.  మావాడు మ‌హా మంచివాడ‌ని చెబుతూ త‌ప్పించుకునే య‌త్నం చేస్తోంది. ఫోరెన్సిక్ నివేదిక‌లు వ‌స్తేగాని ఏదీ తేల్చ‌లేమ‌ని అం టున్నారు. సీఎం, మంత్రులు, ఎంపీలు కూడా గోరంట్ల ప‌ట్ల ఎంతో ప్రేమ‌గా ఉండ‌డం, ఆయ‌న్నుదీన్నించీ త‌ప్పించ‌డానికే పూను కున్నారని విశ్లేష‌కులు అంటున్నారు. కానీ విప‌క్షాల‌కు అంత అవ‌స‌రం లేదు. ఉన్న‌ది ఉన్న‌ట్టే చీల్చి చెండాడుతారు. అందు లోనూ ప్ర‌జ‌ల దృష్టిలో ప‌రువు పోగొట్టుకున్న వైసీపీ స‌ర్కార్ స‌మాధానం చెప్పాలన్న డిమాండ్ పెరుగుతోంది.  ఎస్పీ ఫక్కీరప్ప చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోరంట్లపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప ఆయన సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడం వీలుకాదని ఎస్పీ చెప్పడంపై టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత  అస హనం వ్యక్తం చేశారు. గోరంట్ల న్యూడ్ వీడియోను జాతీయ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్షకు పంపితే అసలు విషయాలు తెలుస్తాయని చెప్పారు. మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీ గోరంట్లపై, సహకరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్‌ను కోరారు. మహిళల పట్ల వైసీపీ నేతల అఘాయిత్యాలను కప్పిపుచ్చేందుకే కొందరు పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో జగన్‌ సర్కార్‌ విఫలమైం దన్నారు.

ఈ బంధం అనుబంధ‌మేనా?

అన్న‌య్య స‌న్నిధి.. అదే నాకు పెన్నిధి.. అంటూ చెల్లెలు అన్న‌గారి కాళ్ల‌ మీద ప‌డి క‌న్నీళ్ల‌తో క‌డిగిన‌పుడు ప్రేక్ష‌కులు అన్న‌గారినే మెచ్చుకున్నారు. సినిమాలో చెల్లెలు నిజంగానే వీర ప్రేమ ప్ర‌క‌టించింది గ‌నుక‌.  అన్నా చెల్లెళ్ల మ‌ధ్య ప్రేమ త‌రిగిపోతుందా అంటే అసాధ్య‌మంటారు పెద్ద‌వాళ్లు.. కానీ  ఇప్పుడు అవ‌స‌రార్ధం ప్రేమ‌నే ప్ర‌క‌టించారు వైసీపీ చెల్లెళ్లంతా!  ఏపీ సీఎం జ‌గ‌న్‌కు రాఖీ క‌ట్ట‌డానికి స్వీట్లు తినిపించ‌డానికి పార్టీ మ‌హిళా మంత్రులు, ఎమ్మెల్యేలు క్యూ క‌ట్టారు. వారి ప్రేమ‌ను మ‌రీ సినిమాటిక్‌గానూ ప్ర‌ద‌ర్శించారు. బొట్టుపెట్టి రాఖీ క‌ట్టి స్వీట్లు తినిపిస్తుంటే జ‌గ‌న్ మాత్రం ఏమి ప్రేమ ఎంత‌టి ప్రేమ అనుకునే ఉంటారు. హోంమంత్రి తానేటి వ‌నిత‌, మ‌రో మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీ, వాసిరెడ్డి ప‌ద్మ.. అంతా అన్న‌గారి మీద ప్రేమ‌ను ప్ర‌ద‌ర్శించ‌డంలో పోటీలుప‌డ్డారు.  మరో వైపు.. మహి ళలపై దాడులు జరిగితే... గన్ కంటే ముందు జగనన్న వచ్చేస్తాడంటూ గతంలో చెప్పిన మరో మంత్రి ఆర్కే రోజా మాత్రం.. జగనన్నకు రాఖీ కట్టలేదని.. నెటిజన్లు సోషల్ మీడియా సాక్షిగా తెగ ట్రోల్ చేస్తున్నారు.  ఇంత‌లో ఎంత మార్పు అనుకునే ఉంటారు జ‌గ‌న్‌. తాను క‌ష్టాల్లో ఉన్న‌పుడు, జైల్లో ష‌టిల్ ఆడుతున్న పుడు ఈ చెల్లెళ్ల‌లో ఏ ఒక్క‌రూ క‌నీసం అటుకేసి వెళ్ల‌లేదు. వెళితే మెడకి  ఏమి చుట్టుకుంటుందోన‌ని భ‌యం! కానీ జ‌గ‌న్ అధికారంలోకి రాగానే ఎక్క‌డా లేని ప్రేమ ఒల‌క‌బోస్తున్నారు. వాస్త‌వానికి జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డానికి  స‌హ‌క‌రించింది ఆయ‌న త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మి, సోద‌రి ష‌ర్మిల‌. కానీ వారిని  దూరం చేసుకోవ‌డం బ‌హుశా ఇప్పుడు ఇబ్బందిపెడుతుందనే విశ్లేషకుల మాట‌. ర‌క్షా బంధ‌న్ అంటే చెల్లెలు, అక్కా వ‌చ్చి రాఖీ క‌ట్ట‌డం స‌హ‌జంగా జ‌రిగేది. కానీ ష‌ర్మిల దూరంగా ఉన్నా రు. త‌ల్లి అవ‌మానంతో కూతురు వేపు వెళ్లారు.  మరోవైపు.. వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, సీఎం జగన్ సోదరి  షర్మిల.. తెలంగాణలో పంట చేలల్లో వరి నాట్లు వేస్తూ.. రైతులకు సాయం చేస్తున్న ఓ వీడియో అయితే సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ రక్షా బంధన్ వేడుకల్లో పాల్గొనకపోవడంతోనే రాజకీయ చెల్లెళ్ల ప్రేమలోనే జగనన్న తరించాల్సి వచ్చిందని నెటిజన్లు అంటున్నారు.

దేశ‌భ‌క్తి..  జాతీయ‌మా..గుజ‌రాతీయ‌మా!

అడుగో అరి భయంకరుడు కట్టబ్ర‌హ్మ‌న్నా..అది వీర పాండ్య వంశాంకురా సింహ గర్జన.. అంటూ పెద్ద ఎన్టీఆర్ మేజర్ చంద్రకాంత్ చిత్రంలో ఆవేశంగా న‌టిస్తుంటే ఇంత‌కంటే దేశ‌బ‌త్తి ఎవ‌రుకుంట‌దిరా బావా! అనుకున్నారంతా! అల్లూరి గ‌ర్జ‌న కృష్ణ గొంతులో విని ఈడ్రా మొన‌గాడంటే.. అన్నారంతా. దేశ‌భ‌క్తిని స‌రిగ్గా ఆజాదీ కా అమృతోత్స‌వ్ స‌మ‌యంలోనే విపరీతంగా  ప్ర‌చారం చేస్తోంది మోడీ ప్రభుత్వం. ఎందుకంటే బీజేపీవారి  దేశ‌భ‌క్తి అన‌న్య‌సామాన్యం. ఎవ్వ‌రికీ ఉండ‌డానికి వీల్లేదు. వారి ప్రేమ ఎల్ల‌లు దాటిపోయింది. అయినా అలా వెళ్లిన వారు తిరిగి వ‌స్తార‌నే భ్ర‌మ‌లో పెట్టి దేశానికి మాత్రం దేశ‌భ‌క్తి గీతాలను పెద్ద ఎల్పీలోనే వినిపిస్తున్నారు బీజేపీ నేత‌లు. స్వాతంత్య్ర‌  సమరంలో ఫ‌లానా ఆయ‌న గాంధీగారు అడ‌గ్గానే ఇంట్లో బంగార‌మంతా ఇచ్చేశాడ‌ట‌, ఒకామె ఏకంగా పుస్తెలే తీసిచ్చేసింది. క‌థ‌లు క‌థ‌లుగా అనాదిగా చెప్పుకుంటున్న ఇలాంటి సంఘ‌ట‌న‌లు  కోకొల్ల‌లు. కానీ తాజాగా బీజేపీ మాత్రం ఇక్కడ బ్యాంకుల నుంచి కోట్లు రుణాల రూపంలో కొల్లగొట్టి దేశ సరిహద్దు దాటేసిన దేశ భక్తులను వదిలే స్తోంది. అలా ఇక్కడ సంపద దోచుకుని పరారైన ‘దేశభక్తు’లలో  మోడీగారి గుజ‌రాత్ సంబంధీకులే అత్యధికులు కావ‌డం గ‌మ‌నార్హం. ఇంత‌కీ వీరు ఎల‌గ‌బెట్టిందేమిట‌య్యా అంటే ఇక్క‌డి వంటింట్లో పొపుల డ‌బ్బాలో చిల్ల‌ర‌తో స‌హా బ్యాంక్ మేనేజ‌ర్ల జేబుల్లో వంద‌రూపాయ‌ల‌తో స‌హా అమాంతం లాక్కుపోయి విదేశాల్లో స‌రదాగా కాలం గ‌డుపుతున్నారు. వారికి ఇక్క‌డికి రావ‌డం బొత్తిగా ఇష్టం లేద‌ు. విజ‌య్ మాల్యా, మొహుల్ చోక్సీ, నీర‌వ్ మోడీ వంటివారు అక్క‌డే కులాసాగా జీవితాంతం ఉండాల‌ను కుంటున్నారు. ఎందుకంటే ఇక్క‌డ బ్యాం కులు, జ‌నాల సొమ్ము చ‌క్క‌గా అక్క‌డ విందులు వినోదాల‌కి స‌రిపోతుంది. ప్ర‌త్యేకించి అక్క‌డ ఏ ఉద్యోగం చేయ‌క్క‌ర్లేదు. చ‌దువు కోసం విదేశానికి వెళ్లిన కుర్రాడు మాత్రం ఓ పూట చీపురు ప‌ట్టుకుని రోడ్డూడిచే ప‌ని చేస్తు న్నాడు.  పార్ల‌మెంటులో, బ‌య‌టా ఈ ఆధునిక దేశ‌భ‌క్తుల బాగోతం గురించి ప్ర‌భుత్వాన్ని, ఎంపీల‌ను ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నారు. కానీ వారికి చీమ కుట్టిన‌ట్ట‌యినా లేదు. కాబోతే, అప్పుడే మ‌త్తు నుంచి తేరుకున్న‌ట్టు తోచిన స‌మాధానం ఇచ్చి ఊరుకుంటున్నారు. కాకుంటే జ్యోతిష్యుడి ద‌గ్గ‌రికి వెళ్లి చిల‌క జ్యోసం లో ప్ర‌శ్ని స్తామంటున్నారు. అంతే త‌ప్ప వారిని  క‌నీసం  ముంబ‌యి కూడా తీసుకురాల‌ని ప‌రిస్థి తుల్లో ప్ర‌భుత్వం ఉంది. మ‌న దేశం, మ‌న వ్యాపారులు, మ‌న పారిశ్రామిక‌వేత్త‌లు, విద్యావేత్త‌లు అంటూ భారీ ప్ర‌సంగాలు చేస్తుండే ప్ర‌ధాని మోదీ అనేక ప‌ర్యాయాలు విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్లారే గాని ఎక్క‌డో ఒక‌చోట వీరిని గురించి వాక‌బు చేయ‌లేదు. అంటే మ‌నోడు. మ‌నూరోడు అనే భావ‌న పాపం ఆయ‌న్ను క‌ట్టేస్తోంది. ఆయ‌న‌మాత్రం ఏం చేస్తాడు. ఎంత‌యినా ప్రాంతీయాభిమానం. ఆయ‌న‌కు దేశ‌భ‌క్తి ప్ర‌జ‌ల‌కు ప్ర‌చార సామ గ్రి కానీ నిజానికి ఇలాంటి వార‌ని లాక్కొచ్చి పోలీస్ స్టేష‌న్లో ప‌డేసి ఉత‌కాల‌న్న ప‌ట్టు ద‌ల ఏమాత్రం లేదు. అది దేశ‌భ‌క్తి అనిపించుకోదు. ఇది దేశానికి ప‌ట్టిన దౌర్భాగ్యం.  బ్యాంకుల‌ను మోసం చేయ‌డం ఎంత తేలిక అన్న‌ది నీర‌వ్ మోడీ లాంటివారు నిరూపించారు.  ఇటువంటి వారిని దేశానికి లాక్కొచ్చి వారు దోచేసిన సొమ్మును కక్కిస్తే దేశ ఆర్థిక కష్టాలు చాలా వరకూ గట్టెక్కుతాయి. మోడీ ఎన్నికల ప్రచారంలో విదేశాలలో మూలుగుతున్న మన వారి నల్లడబ్బును వెనక్కు రప్పించి పేదలకు పంచేస్తామని ఎంతో ఘనంగా వాగ్దానం చేశారు. ఆ తరువాత ఎందుకో మరి అక్కడి సొమ్మును వెనక్కు తీసుకుకోవడం సంగతి అటుంచి.. ఇక్కడ నుంచి తన రాష్ట్రం వారు సొమ్ము దోచుకుని విదేశాలకు పారిపోతున్నా చూస్తూ ఊరుకున్నారు. ఎంతైనా దేశ భక్తి (గుజరాత్ భక్తి) కదా?  ప్రభుత్వమే ఇక్కడి బ్యాంకులను మోసగించి విదేశాలకు పారిపోయిన వారి జాబితా విడుదల చేసింది. ఆ జాబితాలో ఉన్న 28 మందిలో ఒక్క విజయ్ మాల్యాను మినహాయిస్తే మిగిలిన 27 మందీ గుజరాతీ యులే కావడం కాకతాళీయమంటే నమ్మి తీరాలి మరి. ఇంతకీ వీరు దోచేసి తీసుకుపోయిన సొమ్ము ఎంతో తెలుసా అక్షరాలా పది ట్రిలియన్ డాలర్లు.

తెలంగాణ బీజేపీకి సీఈసీ షాక్.. సాలుదొర సెలవు దొర ప్రచారానికి బ్రేక్

తెలంగాణ బీజేపీకి కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూకుడు మీద ఉన్న బీజేపీ రాష్ట్రంలో కేసీఆర్ కు వ్యతిరేకంగా సాలు దొర.. సెలవు దొర అంటూ కేసీఆర్ ఫొటోలతో భారీ కటౌట్లు ఏర్పాటు చేసి ప్రచారం ప్రారంభించింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రచారంపై అభ్యంతరం తెలిపింది. కేసీఆర్ ఫొటోలతో ఆయన వ్యతిరేక ప్రచారం చేయడం చట్టానికి వ్యతిరేకమని స్పష్టం చేసింది. విశేషమేమిటంటే ఈ ప్రచారంపై టీఆర్ఎస్ ఎన్నికల సంఘానికి ఎటువంటి ఫిర్యాదూ చేయలేదు.అయితే  కేంద్ర ఎన్నికల సంఘమే అటువంటి ప్రచారం చట్ట వ్యతిరేకమని పేర్కొంది. కేసీఆర్ ఫొటోలతో పోస్టర్లు ముద్రించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం  తెలంగాణ బీజేపీని విస్పష్టంగా ఆదేశించింది. గత నెలలో హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా  టీఆర్ఎస్  మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఆ సందర్భంగా బీజేపీ కూడా చాలు దొర.. సెలవు దొర అంటూ కేసీఆర్ కు వ్యతిరేకంగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఇప్పడు అదే నినాదంతో అంటే సాలు దొర.. సెలవు దొర అంటూ ప్రచారం చేసుకోవడానికి ఈసీ అనుమతి కోరింది. అయితే ఈసీ నేతలను కించపరిచే విధంగా పోస్టర్లు, రాతలతో ప్రచారం కూడదని స్పష్టం చేసింది.  దీంతో ఇక బీజేపీ టీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో జరిగిన అవినీతిని హైలైట్ చేస్తూ ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది.

ఎంపీ న్యూడ్ వీడియోకాల్ పై లోక్ సభ స్పీకర్ కు కాంగ్రెస్ ఫిర్యాదు

వైసీపీ ఎంపీ న్యూడ్ కాల్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఒక మహిళతో   న‌గ్నంగా వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్న వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ వ్య‌వ‌హారంపై  లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు అందింది. ఒక కాంగ్రెస్ ఎంపీ ఈ ఫిర్యాదు చేశారు. పంజాబ్ కు చెందిన కాంగ్రెస్ ఎంపీ జ‌స్బీర్ సింగ్ గిల్‌  గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ పై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. అలాగే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ,  జాతీయ మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌ల‌కు కూడా ఫిర్యాదు చేశారు,  గోరంట్ల మాధవ్ న్యూడ్ కాల్  వీడియో వ్య‌వ‌హారం పార్ల‌మెంటుకు మాయ‌ని మ‌చ్చ‌గా  ఆయ‌న త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వీడియోపై త‌క్ష‌ణ‌మే దృష్టి సారించి   క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య మూల స్తంభమైన పార్లమెంటులో ఇటువంటి వ్యక్తులు అడుగుపెట్టడానికి అనర్హులని ఆయన పేర్కొన్నారు. ఈ వీడియో కాల్ వ్యవహారంలో ఎలాంటి తాత్సారానికీ తావు లేకుండా సత్వరమే విచారణ చేసి చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ ఎంపీ జ‌స్బీర్ సింగ్ గిల్‌ కోరారు.

ఎల్ల‌లు లేని స్నేహం 

ఎన్నాళ్లో వేచిన ఉద‌యం.. అంటూ పెద్ద రోడ్డుకి ఇరుప‌క్క‌ల నుంచి హీరోలు క‌లుసుకునేందుకు ఏకంగా పాట అందుకుంటారు.. స్నేహ‌బంధ‌మూ.. అంటూ న‌లుగుర‌యిదుగురు వ‌య‌సుమ‌ళ్లి స్నేహితులూ అంతే ఉత్సాహంగా పాడేసుకుంటారు.. ఇందులో ఎంతో నిజం ఉంది. స్నేహానికి ప్ర‌దేశం, దేశం, ఖండా ల‌తో ప‌రి మితులు విధించ‌లేం. అంతెందుకు రాజ‌కీయాల ప‌రంగా పాకిస్తాన్‌ను ఛ‌స్తే స్నేహితుడిగా అంగీ కరించ‌లేం. కానీ ఆట‌ల విషయానికి వ‌చ్చేస‌రికి క్రీడాకారులంతా స‌ర‌దాగా గ‌డిపేస్తుంటారు. ఒక‌రిని ఒక‌రు అభినందించుకోవ‌డం, జోక్స్ వేసుకోవ‌డ‌మూ చూస్తుంటాం.  ఇది అస‌లు సిస‌లు ప్రేమ‌. కాలం మారి నా అలాంటి స్నేహాలు ఉంటాయి. ఇపుడు తాజాగా హార్వ‌ర్డ్ వ‌ర్సి టీలో ఇద్ద‌రు త‌మ స్నేహం గురించి తెలియ జేశారు. ఒక‌రు భార‌త్‌కి చెందిన అమ్మాయి, మ‌రొక‌రు పాకి స్తాన్! వీరిద్ద‌రూ చాలాకాలం త‌ర్వాత క‌లిసేరు. కానీ అంతే స్నేహ‌పూర్వ‌కంగా, మ‌రెంతో అభిమానంతో మాట్లాడుకున్నారు. తాను ఇన్నాళ్ల‌కు పాక్ స్నేహితురాలిని క‌ల‌వ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని స్నేహా ప్ర‌క‌టించింది.  చిత్ర‌మేమంటే ప్ర‌జ‌ల్లో ఉన్న అభిమానాన్ని రాజ‌కీయ నాయ‌కులు రాజకీయాల‌ను దూరం పెట్ట‌డానికి ఏమాత్రం ప్ర‌య‌త్నించ‌డం లేదు. దాడులు, మార‌ణ‌హోమాలు సృష్టించ‌డానికే కంక‌ణం క‌ట్టుకోవ‌డం పాక్ వంతు అయింది.  స్నేహా బిస్వాస్ హార్వ‌ర్డ్ బిజినెస్ స్కూల్లో చ‌దువుతోంది. ఇటీవ‌లే ఆమె కాలేజీ ఆవ‌ర‌ణ‌లో ఒక‌మ్మాయిని చూసి క్ష‌ణం నివ్వెర‌పోయింది. ఎక్క‌డో క‌లిసిన మొహంలానే ఉందే అనుకుంది. అంతే ఒక్క‌సారి గ‌తం సినిమా రీలులా తిరిగింది. రీలు ఆగ‌గానే ఆమె త‌న పాకిస్తానీ స్నేహితురాల‌న్న‌ది గుర్తించింది. ఇస్లామా బాద్ అమ్మాయితో ఫ‌స్ట్ సెమిస్ట‌ర్ అయ్యేలోగా మ‌రింత స‌న్నిహితురాల‌య్యింది స్నేహా. ఆమె ధైర్యంగా చెప్పే అనేక విష‌యాల‌ప‌ట్ల స్నేహా ఆక‌ర్షితురాల‌యింది. మ‌నం అనుకుంటున్న వైరానికి అస‌లు అక్క‌డి ప్ర‌జ‌ల్లో భార‌త్‌ప‌ట్ల ఉన్న అభిమానానికి పొంత‌నే లేద‌ని స్నేహా అభిప్రాయ‌ప‌డ‌టం గ‌మ‌నార్హం.

నార్మన్ ఫోస్టర్ పిటిషన్ పై జగన్ సర్కార్ కు సుప్రీం నోటీసులు

ఒక‌రి గొప్ప‌త‌నాన్ని ఓర్వలేని తనంతో తిరస్కరించడం,ఒక‌రి దార్శనికత జాతికి మేలు చేస్తుందని తెలిసినా  నిర్ల‌క్ష్యం చేయ‌డ‌మో అమ‌లు కాకుండా అట‌కెక్కించ‌డ‌ం క్ష‌మార్హం కాదు. క్షంతవ్యం కాదు. జగన్ సర్కార్ సరిగ్గా అలా క్షంతవ్యంకాని వ్యవహార శైలినే ఈ మూడేళ్లుగా చేస్తూ వస్తున్నది.  నాడు నారా చంద్ర‌బాబునాయుడు ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా రాజ‌ధాని నిర్మాణ ప‌ను ల‌ కోసం విదేశీయుల‌తో సంప్ర‌దిచ‌డం మీద అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కానీ ఆయ‌న దూర‌దృష్టిని  గ్ర‌హించి విమర్శకులంతా ఆ తరువాత మెచ్చుకున్నారు. ఆయన నిర్ణయాన్ని గౌరవించారు.  ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత  రాజ‌ధానిగా అమ‌రావ‌తిని దేశనికే తలమానికంగా నిర్మించాలని  చంద్రబాబు ప్ర‌భుత్వం కంక‌ణం క‌ట్టుకుంది. కానీ అందుకు సంబం ధించి కొంత వ‌రకే ప‌నులు సాకార‌మ‌య్యాయి. ఆ త‌ర్వాత వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. రాజధాని అమరావతి వైభోగాన్ని, ప్రాశస్థ్యాన్ని కొనసాగనీయరాదని నిర్ణయించుకుంది. మూడు రాజధానులంటూ మూడు ముక్కలాటక తెరతీసింది.  ఆ ప్రయత్నంలో అన్ని విధాలుగా అభాసుపాలైంది. అదలా ఉంచితే.. టీడీపీ  హయాంలో అమరావతి నిర్మాణం కోసం నార్మన్ అండ్ ఫోస్టర్ కంపెనీ డిజైన్లు సిద్ధం చేసింది. అయితే అధికారం లోకి రాగానే అమరావతి నిర్మాణాన్ని  జగన్‌ పక్కన పెట్టారు. అంతే కాదు గత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని అమరావతి భవనాలకు డిజైన్లు సిద్ధం చేసిన  నార్మన్ అండ్ ఫోస్టర్ కంపెనీ  తమకు చెల్లించాల్సిన సొమ్ముల కోసం ఇచ్చిన నోటీసులను జగన్ సర్కార్ పట్టించుకోలేదు.   దీంతో నార్మన్ అండ్ పోస్టర్ కంపెనీ  సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సీజేఐ ఎన్వీ రమణ ధర్మాసనం పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ఈ మేర‌కు జగన్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు  నోటీసులు జారీ చేసింది. అమరావతి విషయంలో జగన్ సర్కార్ తీసుకున్న ప్రతి నిర్ణయం బెడిసి కొట్టిందనే చెప్పాలి.    మూడు రాజ‌ధానుల నిర్ణయం   పాల‌నా సౌల‌భ్యం కోస‌మేనని జగన్ సర్కార్ చెప్పిన కారణాన్ని ఎవరూ ఆమోదించలేదు. అమ‌రావ‌తి రాజ‌ధానికి భూములు ఇచ్చిన‌ రైతులు వ్యతిరేకించారు. విపక్షాలు తప్పుపట్టాయి. చివరికి న్యాయస్థానమూ అది కుదరదని విస్పష్టంగా తీర్పు చెప్పింది.  

వెంకయ్యను డబుల్ ఇంజిన్ బుల్ డోజ్ చేసిందా?

ఎంతటి గొప్పవారినైనా అట్టడుగుకు నెట్టేయడం, ఎంతటి అనామకులైనా అమాంతం అందలం ఎక్కించడంలో డబుల్ ఇంజిన్ మోడీ- షా ద్వయానిది అందెవేసిన చేయి. దేశంలో బీజేపీని బతికి బట్టకట్టించేందుకు కాలికి బలపం కట్టుకుని మరీ రథయాత్ర చేసిన ఆ పార్టీ ఒకప్పటి అగ్రనేత, మాజీ ఉపప్రధాని ఎల్కే అద్వానీని, ఆ పార్టీ కోసమే తమ సర్వ శక్తియుక్తులను ధార పోసిన మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా, దివంగత సుష్మా స్వరాజ్ లాంటి వారికి ఈ డబుల్ ఇంజిన్ ఏమాత్రం ప్రాధాన్యం కల్పించలేదనేది జగమెరిగిన సత్యం. వీరి కోవలోకే తాజాగా పదహారణాల మన తెలుగుబిడ్డ,  తాజా మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు వస్తారు.  ఇంత కాలం అనుసరిస్తూ వస్తున్న సాంప్రదాయం ప్రకారం అయితే.. వెంకయ్య నాయుడిని దేశ ప్రథమ పౌరుడిని చేయాల్సి వస్తుంది. లేదంటే జాకీర్ హుస్సేన్ కు అవకాశం ఇచ్చినట్లు రెండోసారైనా వెంకయ్య నాయుడిని ఉపరాష్ట్రపతి పదవిలో కొనసాగించి ఉండాల్సిందనే అభిప్రాయం ప్రతి తెలుగువాడిలోనూ ఉంది. విద్యార్థి దశ నుంచీ ఏబీవీపీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొని, ఆనక బీజేపీ ప్రత్యక్ష రాజకీయాల్లో కీలక భూమిక పోషించిన వెంకయ్య నాయుడికి బలవంతపు విశ్రాంతి ఇవ్వడంతో మోడీ- షా ద్వయం రాజనీతి  ఔచిత్యాన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెంకయ్య నాయుడు పోషించిన పాత్ర మరిచిపోలేనిది. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వెంకయ్య నాయుడికి వాజ్ పేయి కేబినెట్ లో సమాచార ప్రసారశాఖ, రవాణా శాఖ లాంటివి ఇస్తానంటే అవి వద్దని, తనకు వ్యవసాయశాఖ కావాలని అడగగలిగిన మనిషి వెంకయ్య నాయుడు. మోడీ హయాంలో పట్టణాభివృద్ధిశాఖ అప్పగించినప్పుడు గ్రామీణ ప్రాంతానికి చెందిన తనకు పట్టణాభివృద్ధి గురించి ఏం తెలుసునని అనగలిగిన వ్యక్తిత్వం వెంకయ్య నాయుడు. అయినప్పటికీ ఆయనకు పట్టణాభివృద్ధి శాఖనే మోడీ కేటాయించడం ప్రధాని మోడీ వ్యక్తిత్వం. అలా తనకు ఇష్టమైన శాఖ కాకుండా వేరే శాఖ ఇచ్చినప్పటికీ అత్యంత చాకచక్యంతో దాన్ని నిర్వహించి మెప్పించిన వ్యక్తి మన వెంకయ్య నాయుడు. ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తర్వాత వెంకయ్య నాయుడు నిర్వహించిన మీడియా చిట్ చాట్ లో చేసిన వ్యాఖ్యలు.. ఆయనలో ఏ మూలనో దాగి ఉన్న అసంతృప్తిని వెల్లడించాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయినప్పటికీ వెంకయ్య నాయుడు ఆ అసంతృప్తిని ఇసుమంతైనా బైట పడనివ్వని తీరు ఆయన హుందాతనానికి నిదర్శనం.  కనుక అసంతృప్తిని ఏ మాత్రం బహిర్గతం కానివ్వని తీరు అందరినీ ఆకర్షిస్తోంది. ఆకట్టుకుంటోంది. ప్రధాని, లేదా రాష్ట్రపతి పదవికి పూర్తి అర్హతలున్న ఎల్కే అద్వానీ కూడా ఇలాగే పెద్దమనిషిలా వ్యవహరించారు. ఎలాంటి సమస్య వచ్చినా వెంకయ్య నాయుడు తనదైన శైలిలో చాకచక్యంగా పరిష్కరిస్తారనే పేరు ఉంది. అలాంటి వెంకయ్య నాయుడు మీడియా చిట్ చాట్ లో చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు ఇప్పుడుదేశ ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. మళ్లీ తాను రాజకీయాల్లోకి రానని విస్పష్టంగా చెప్పిన వెంకయ్య, క్రియాశీలకంగా ఉండడం మాత్రం మానుకోనని  స్పష్టం చేశారు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తూనే ఉంటానన్నారు. తన దృష్టికి వచ్చే అంశాలను ప్రధాని దృష్టికి తప్పకుండా తీసుకెళ్తానన్నారు. ఈ సందర్భంగానే వెంకయ్య నాయుడు చేసిన ఒక వ్యాఖ్య ఆసక్తికరంగా ఉంది. ‘పుస్తకం రాస్తే.. వాస్తవాలు రాయాలి.. బతికున్నవారి గురించి యథార్థాలు రాస్తే.. అనర్థాలు వస్తాయి’ అని ఆయన చమత్కారంగా అన్నా ఆ మాటల వెనుక నర్మగర్భంగా, నిగూఢంగా ఒకరిపై వేసిన చురకలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాజ్యసభ చైర్మన్ గా చివరిరోజు వెంకయ్య నాయుడి కళ్లు చెమ్మగిల్లడం దేశం యావత్తు గమనించింది. కొన్ని సందర్భాల్లో ఆయన కర్ఛీఫ్ తో కళ్లు తుడుచుకున్న దృశ్యాలు కూడా మీడియాలో ప్రసారం అయ్యాయి. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ఉప రాష్ట్రపతి తర్వాత రాష్ట్రపతి స్థానానికి వెళ్లలేకపోయాననే బాధ ఏ మాత్రం లేదని చెప్పడం గమనార్హం. తాను ఏదీ కోరుకోకపోయినా.. దేవుడి దయ, పెద్దల అభిమానం వల్ల అన్నీ లభించాయని చెప్పడంలో వెంకయ్య నాయుడిలోని పెద్దమనిషి తత్వం స్పష్టం అవుతోందంటున్నారు. అపూర్వ శక్తి గలిగి, రోజుకు 14 గంటలు పనిచేసే మోడీకి కూడా ‘అప్పడప్పుడూ నవ్వుతూ ఉండాల’ని, ‘అవసరమైనంత నిద్రపోవాల’ని సూచించగల చనువున్న వ్యక్తి వెంకయ్యనాయుడు. అలాంటి వెంకయ్యనాయుడిని మోడీ- షా ద్వయం ఎందుకు ఇలా దారుణంగా పక్కన పెట్టేసిందని మిలియన్ డాలర్ల ప్రశ్నగా వస్తోంది.

ఆగ‌ష్టు 15న పుట్టి  12 దాట‌నివారికి ఉచిత బ‌స్సు ప్ర‌యాణం 

ఇంట్లో అబ్బాయి పుట్టినా, అమ్మాయి పుట్టినా వెంట‌నే పంచాంగాలు తిర‌గేసి మంచిరోజు, న‌క్ష‌త్రం వేట‌లో చాలామంది ఆ రోజు మంచిదా కాదా అన్న‌ది ప్ర‌క‌టిస్తారు. అది వారి న‌మ్మ‌కం. ఈ రోజుల్లో న‌మ్మ‌కాల‌కూ పెద్ద పీట వేస్తుండ‌డ‌మే చిత్రం. కాలం మారింది, కంప్యూట‌ర్లు, మొబైల్ త‌ప్ప లోకంతో ప్ర‌త్య‌క్షంగా పెద్ద‌గా ప‌నిలేకుండా పోయింది. ఈ రోజుల్లోనూ కొంద‌రు శ‌నివారం పుట్టింది.. మంచిషే నంటావా? అని ఓ పెద్దా య‌న త‌న ప‌క్కింటి మ‌రో అడ్డ‌బొట్టు జ్యోతిష్కుడిని వేధించి చంపుతాడు. అయ్యా అంతా బాగు బాగు.. అని త‌ప్పించుకుంటాడు. ఈ చిత్రం ఇప్ప‌టికీ గ్రామాల్లో నిత్య‌కృత్యం. కాగా ఇపుడు తెలంగాణా ప్ర‌భుత్వం కూడా పాటించ‌డానికి కంక‌ణం క‌ట్టుకుంది. కేంద్రం అజాదీ కా అమృ తోత్స‌వం సంద‌ర్భంగా కేంద్రం ప్ర‌క‌టించిన కేంద్రానికి ధీటుగా తెలంగాణా ప్ర‌భుత్వం కూడా స‌రికొత్త వ్యూహం అనుస‌రించి తెలంగాణా ఆక‌ర్ష్ కి మ‌రింత ద‌న్ను ఇచ్చారు.  ఆగ‌ష్టు 15న జ‌న్మించిన పిల్ల‌ల‌కు వారికి 12 ఏళ్లు వ‌చ్చేవ‌ర‌కూ బ‌స్సు ప్ర‌యాణం ఉచిత‌మ‌ని ప్ర‌క‌టిం చారు. అందులో ఉచితం ఏమిటో ఎవ‌రికీ అర్ధం కావ‌డంలేదు. ఎలాగూ ఐదేళ్ల దాకా అమ్మ‌తోనో, అమ్మ‌ మ్మ‌తోనో ప్ర‌యాణిస్తారు. కిటికీద‌గ్గ‌ర కూచుంటే ఆనంద కేరింత‌ల్లో ప్ర‌యాణీకుల‌ను ఎంతో ఆక‌ట్టుకుం టారు. అదో స‌ర‌దా!  స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా , 75 ఏళ్లు పైబడిన వృద్ధులు ఈ నెల 21 వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. ఆర్టీసీ ప్రయాణికులకు పలు రాయితీలను ప్రకటించింది.  సంస్థ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ బుధవారం ప్రకటించారు. 75 ఏళ్లు పై బడినవారికి ఆర్టీసీ తార్నాక దవాఖానలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి 75ు రాయితీపై మందులు అందించను న్నట్లు తెలిపారు.  ట్రావెల్‌ యాజ్‌ యూ లైక్‌(టీఏవైఎల్‌) టికెట్‌ చార్జీలను రూ.120 నుంచి రూ.75కు తగ్గించినట్లు పేర్కొన్నా రు. కేజీ లోపు కార్గో పార్సిళ్లపై ఆగస్టు 15న 75 కిలోమీటర్ల వరకు ఎలాంటి చార్జీ ఉండదని గోవర్ధన్‌ తెలి పా రు. ప్రతి రోజూ దూర ప్రాంతాలకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే 75 మందిని గుర్తించి తర్వాత ట్రిప్‌కి ఫ్రీ టిక్కెట్‌ అందించనున్నట్లు ఆయన ప్రకటించారు. పుష్పక్‌ ఎయిర్‌పోర్టు సర్వీస్‌ బస్సుల్లో 75ు చార్జీతోనే ప్రయాణి కులను గమ్యస్థానాలకు చేర్చనున్నట్లు తెలిపారు. 

అమ్మ‌లూ.. రాఖీ స‌రే.. ఓటు మాటేమిటి?

గ‌త రెండు రోజులుగాదేశంలో రాఖీ హ‌డావుడి జ‌రుగుతోంది. ఉత్త‌రాదిలో ఇప్ప‌టికే రంగు రంగుల బ్యాండ్లతో, చిన్న‌క‌వ‌ర్లో ఓ వంద నోటుతోనో చెల్లెళ్ల ఇంటికి ప‌య‌న‌మ‌వుతున్నారు. కానీ చిత్రంగా ఇది ఇటీవ‌ల మ‌రీ రాజ కీయంగానూ మారిపోయింది. ఇంట్లో చూపించేది నిజంగానే అన్నాచెల్లెళ్ల ప్రేమ బ‌య‌టికి వ‌స్తే స‌ద‌రు చెల్ల‌లో, అక్కో ఖ‌చ్చితంగా ఓట‌రుగానే చెల్లుబాటు అవుతోన్నారు.  అన్నా..నీ అనురాగం ఏన్నో జ‌న్మ‌ల పుణ్య‌ఫ‌లం.. అంటూ ఓ పాత సినిమాలు ఓచెల్లి ఇల్లంతా తిరుగుతూ హీరోగారికి చెల్లి ప్రేమ పంచుతుంది. అప్ప‌ట్లో ఈపాట‌కు అమాంతం వెన‌క‌వ‌ర‌స‌ల్లో ఉన్నవారు క‌న్నీళ్ల ప‌ర్యంత‌మ‌య్యారు. ప‌రుగున చెల్లెళ్ల ఇంటికి ప‌రుగులు పెట్టారు. ఇదంతా ఒక ఎత్తు, స‌ర్వసాధార‌ణం. కాగా, ఎన్నిక‌ల స‌మ‌యంలో దాదాపు అన్ని పార్టీల‌వారు అక్క‌చెల్లెళ్ల‌ను క‌ల‌వాల‌ని భార్యా స‌మేతంగా ఏకం గా కుం కుమ‌ భ‌రిణితో అన్నిఅపార్ట్‌మెంట్ల‌కీ తిర‌గ‌డం ఆన‌వాయితీగానూ మారిపోయింది. రాజ‌కీయ నాయ కుల ప్రేమలో కొంత స్వార్ధం ఉంటుంది. వారు ఎంత ప్ర‌చారం చేసుకున్నా స‌ద‌రు అక్క‌చెల్లెళ్లు చివ‌రాఖ రికి ఓట‌ర్లుగా మారిపోతారు. ప్ర‌ధాని మోదీజీ కూడా ఈ చెల్లెళ్ల ప్రేమ‌ను ఉప్పొంగించాల‌ని చాలా ఆతృతే  ప్ర‌దర్శించారు.  ఇటీవ‌ల కోవిడ్ మ‌హ‌మ్మారి స‌మ‌యంలో నిజానికి ఎంతో అద్భుతంగా డాక్ట‌ర్ల‌తో స‌మానంగా ప‌నిచేసింది  పారిశుద్ధ్య కార్మికులే. ఇందులో సందేహం లేదు. వారికి దేశ‌ప్ర‌జ‌లంతా అపార గౌర‌వాన్ని ప్ర‌ద‌ర్శించారు. కాగా ఇపుడు లేటెస్టుగా ప్ర‌ధాని ర‌క్షాబంధ‌న్ అడ్డంపెట్టుకుని మంగ‌ళ‌వారం (ఆగ‌ష్టు 10) ఢిల్లీలో  ప్ర‌ధాని త‌న కార్యాల‌యంలో ప‌నిచేస్తున్నపారిశుధ్య కార్మికుల పిల్ల‌ల్ని పిలిపించి వారితో రాఖీ క‌ట్టించుకున్నారు. ఆ వ‌చ్చిన పిల్ల‌లు త‌ల్లుల‌తో పాటు ఎంతో మురిసిపోయారు. కానీ విప‌క్షాలు మాత్రం ఇదంగా రాజ‌కీయ జిమ్మిక్కుగానే వ‌ర్ణిస్తున్నారు. న‌రేంద్ర‌మోదీ వంటి రాజ‌కీయ చ‌తురుడు, ఎత్తులు, పై ఎత్తులు వేయ‌డంలో ఆరితేరిన‌వారూ బీజేపీలో ఎవ్వ‌రూ లేరు. ఆయ‌న‌కు ఏ స‌మ‌యంలో ఎవ‌రిని ఆక‌ట్టుకోవాల‌న్న‌ది బాగా ఎరుకే.  ర‌క్షాబంధ‌న్ మాత్ర‌మే కాదు అజాదీ కా అమృతోత్స‌వ్ పాఠాన్ని దేశ ప్ర‌జ‌లంద‌రికీ వినిపించి దేశ భ‌క్తిని ప్ర‌తీవారు ప్ర‌ద‌ర్శించాల‌ని. అందుకు గుర్తుగా జాతీయ ప‌తాకాన్ని ఇంటి మీద‌, కార్యాల‌యాల మీద ఎగుర వేయాల‌ని ఆదేశించ‌డం ఆయ‌న ప్ర‌త్యే క‌త‌. మ‌రి తాజాగా పారిశుధ్య కార్మికుల పిల్ల‌ల‌చేత రాఖీ క‌ట్టిం చుకోవ‌డం కూడా దేశ‌భ‌క్తి  అక్కాచెల్లెళ్ల  ప్రేమ‌ను వ్య‌క్తం చేయ‌మ‌న‌డం కంటే ఇంత బ్ర‌హ్మాండంగా పాలి స్తున్న బీజేపీ ని మ‌ళ్లీ గెలిపించి పుణ్యం క‌ట్టుకోవాల‌నే సందేశం దేశంలో ప్ర‌చారానికి ఇదో గొప్ప అస్త్రం. ఎందుకంటే భావీభ‌రాత పౌరులు అండ దండ‌లు మ‌రి ఎవ‌రికైనా అవ‌స‌రేమ‌గా!

వైఎస్ విజయమ్మకు తృటిలో తప్పిన పెను ప్రమాదం

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తల్లి, వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు టైరు పంక్చరైంది. ఆయితే ఈ ప్రమాదంలో విజయమ్మ సురక్షితంగా బయట పడ్డారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. దాదాపుగా ఇటువంటి ప్రమాదంలోనే ఇటీవల నలుగురు మరణించిన సంగతి తెలిసిందే. దీంతో విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైరు పంక్చరైందనగానే అందరిలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ ప్రమాదం నుంచి విజయమ్మ సురక్షితంగా బయటపడ్డారని తెలియగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం విజయమ్మకు వైసీపీతో ఎటువంటి సంబంధాలూ లేవు. ఆమె పూర్తిగా తెలంగాణకే పరిమితమయ్యారు. ఆమె కుమార్తె, ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల వెఎస్సార్ తెలంగాణ పార్టీకి గౌరవాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వైఎస్ సతీమణిగా విజయమ్మకు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ గౌరవం, మర్యాదా ఉన్నాయి. అందుకే ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందనగానే ఉభయ తెలుగు రాష్ట్రాలూ ఉలిక్కి పడ్డాయి. ఆమె క్షేమంగా బయటపడ్డారని తెలియగానే ఊపిరి పీల్చుకున్నాయి.  వైఎస్ స్నేహితుడి కుటుంబాన్ని పరామర్శించి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.   

పాయె.. అయిపాయె.. సొంత రాష్ట్రంలోనే ఎవరికీ పట్టని పీకే!

బీహార్ పరిణామాల నేపథ్యంలో తాజాగా మళ్లీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మళ్లీ తెరపైకి వచ్చారు. ఎన్నికల వ్యూహకర్తగా ఓ వెలుగు వెలిగిన పీకే.. రాజకీయ నేతగా మాత్రం ఎవరికీ పట్టకుండా పోయారు. ఇప్పుడు ఇటు ఎన్నికల వ్యూహాలూ పారక.. అటు రాజకీయంగానూ గుర్తింపు లేక రెంటికీ చెడ్డ రేవడగా మిగిలిపోయారు. బీహార్ లో ఎన్డీయే ప్రభుత్వం కుప్ప కూలి మహాఘట్ బంధన్ సర్కార్ కొలువుదీరిన పరిణామాలలో ప్రశాంత్ కిశోర్ ప్రమేయమే లేకుండా పోయింది. నితీష్ వ్యూహాలను పసిగట్టడంలో పీకే టోటల్ గా జీరో అయ్యారు. బీహార్ పరిణామాలు 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీయేతర పక్షాల ఐక్యతకు నాందిగా పరిశీలకులు విశ్లేషిస్తున్న వేళ ఎవరూ అడగకుండానే.. నితీష్ కు అంత సీన్ లేదంటూ ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమంలో నెటిజెన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. బీహార్ లో బీజేపీకి షాకిస్తూ.. కొత్త మిత్రులతో చేరి బిహార్ లో  కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్ వ్యూహ చతురతపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విశ్లేషణలు వస్తున్నాయి. దాదాపు అన్ని విశ్లేషణలూ ఈ పరిణామం వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మోడీకి చేదు అనుబవాన్ని మిగిల్చే అవకాశాలు మెండుగా ఉన్నాయనే చెప్పాయి. బీజేపీకి మిత్రపక్షాలన్నీ దూరం కావడం వచ్చే సార్వత్రిక ఎన్నికలు మోడీ హ్యాట్రిక్ ఆశలకు గండి కొడతాయనే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  అయితే ప్రశాంత్ కిశోర్ మాత్రం ఈ విశ్లేషణలను కొట్టి పారేస్తూ.. నితీష్ కు అంత సీన్ లేదని వ్యాఖ్యనించారు.  బీహార్ పరిణామాలు జాతీయ స్థాయిలో రాజకీయాలను ఇసుమంతైనా ప్రభావితం చేయవని తేల్చేశారు. కేవలం నితీష్ స్వార్థం వల్లనే బీహార్ పరిణామాలు సంభవించాయని సూత్రీకరించారు. అంతే కాకుండా నితీష్ వ్యూహాలపై, వ్యవహార శైలిపై విమర్శలు చేశారు. గత పదేళ్లుగా ఆయన బీహార్ లో చేస్తున్న రాజకీయ ప్రయోగాలన్నీ కుప్పిగంతులేనని ప్రశాంత్ కిషోర్ అభివర్ణించారు. గత పదేళ్లుగా తాను ముఖ్యమంత్రిగా కొనసాగడమే లక్ష్యంగా ఇలాంటి రాజకీయ జంపిగ్ లను ఆయన గతంలో ఐదు సార్లు చేశానపీ, ఇది ఆరోసారనీ విమర్శించారు. కేవలం సీఎంగా కొనసాగడమే లక్ష్యంగా ఆయన తీరు ఉందనీ, ఆయన వల్ల బీహార్ కు జరిగిన మేలేమీ లేదని విమర్శించారు. ఏ విషయంలోనూ సైద్ధాంతిక సారూప్యత లేని జేడీయూ, ఆర్జీడీలు కలిసి బీహార్ ను ఏం చేస్తారోనని భయంగా ఉందని పీకే వ్యాఖ్యానించారు.  అయితే పీకే వ్యాఖ్యలను పరిశీలకులు కొట్టి పారేస్తున్నారు. నితీష్ పై ఉన్న వ్యక్తిగత వైరానికి తోడు తెలంగాణ ముఖ్యమంత్రిపై ఉన్న వ్యక్తిగత ప్రేమ కూడా పీకే వ్యాఖ్యలకు కారణమని విశ్లేషిస్తున్నారు. పీకే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి తెలంగాణ సీఎంను జాతీయ నేతగా నిలబెట్టే పనిని అంగీకరించారనీ, ఆ దిశగా ఆయన టీమ్ తెలంగాణలో పని చేస్తున్నదనీ, ఈ పరిస్థితుల్లో మోడీకి వ్యతిరేకంగా బీజేపీయేతర పార్టీలను ఏకం చేసే బలమైన నేతగా నితీష్ ఆవిర్బవిస్తే తెలంగాణ తనకు ఇచ్చిన ఉద్యోగం కోల్పోతుందన్న భయంతోనే బీహార్ పరిణామాలు జాతీయస్థాయిలో చూపే ప్రభావం ఏమీ ఉండదంటూ విశ్లేషణలు చేస్తున్నారని విమర్శకులు అంటున్నారు. అదీ కాక మోడీ వ్యతిరేకతను పూర్తిగా తగ్గించుకుని మరీ పీకే మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. 

రైతుకి నేల‌ కానుక‌!

ఓ పిల్ల‌వాడు చ‌క్రాన్ని క‌ర్ర‌తో నెమ్మ‌దిగా కొడుతూ అలా బండాట ఆడుతూంటాడు. ఇది మ‌న‌లో చాలా మంది బాల్యంలో ఆడ‌టాన్ని గుర్తుచేస్తుంది. అలా వెళుతూన్న‌వాడికి పూర్వం అయితే ప‌ది పైస‌లు బిళ్ల క‌న‌ప‌డ‌గానే అమాంతం ఆగి దాన్ని తీసి చొక్కోకో, నిక్క‌రుకో తుడిచి జేబులో ప‌డేసుకుంటాడు. ఇక వాడికి లోకంలో మ‌రేమీ అక్క‌ర్లేనంత ఆనందం. అమాంతం ఇంటికి వెళ్లి త‌ల్లికి చూపిస్తాడు. ఆమె ఏమ‌న్న‌దో విన కుండా గ‌ల్లీ చివ‌ర్లో దుకాణానికి వెళ్లి తోచిన‌ది కొని తింటాడు. ప‌ది పైస‌ల ఆనంద‌మే అంతుంటే ఏకంగా వ‌జ్ర‌మే దొరికితే!  త‌ప్ప‌కుండా ఊళ్లో భూస్వామి నా ముందు బ‌లాదూర్ అనే అను కుంటాడు.  ఇటీవ‌ల క‌ర్నూలు జిల్లా జి.ఎర్ర‌గుడి గ్రామానికి చెందిన ఓ రైతు పొలాని వెళ్లాడు. రోజూ వెళ్లిన‌ట్టే అదే దారంటా వెళ్లాడు. ఈ ఏడు వ‌ర్షాల భీభ‌త్సంతో పంట‌లు స‌రిగా పండుతాయా, త‌న పిల్ల‌ల చ‌దువు, ఇత‌ర ఖర్చుల సంగ‌తేమిటీ.. ఇలాంటి ఆలోచ‌న‌లు ముసురుకున్నాయి. అలానే క‌ర్ర‌పోటు వేసుకుంటూ ముం దుకు వెళ్లా డు. అంత‌లో రెండ‌డుగుల దూరంలో ఏదో మెరిసిన‌ట్ట‌యింది. మెల్ల‌గా వెళ్లి ప‌ట్టి పైకి తీసాడు. అర‌చేతిలో పెట్టి ప‌రిశీల‌న‌గా చూశాడు. అది మామూలు రాయి కాదు ఏకంగా వ‌జ్ర‌మే.. ప‌ది క్యారెట్ల‌ది.  ఈ సంగ‌తి తెలుసుకున్న పెర‌వ‌లి, జొన్న‌గిరి ప్రాంతాల‌కు చెందిన కొంద‌రు వ్యాపారులు దాన్ని ఎంతైనా డ‌బ్బు పెట్టి  కొనేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. స‌దరు రైతు ఇంటి ముందు ఊరు ప్ర‌జ‌లు, కాస్తంత ధ‌నికు లూ క్యూక‌ట్టారు. ఇవేమీ తెలియ‌ని ప‌క్క పొలంవాడు.. బావా!.. ఏంజెసినా..ఇంత‌మంది ప‌డ్డారు? అని అడిగాడే గాని త‌న స్నేహితుడి జాతకం మారింద‌ని తెలిసి ఎంతో సంతోషించాడు.  చిత్ర‌మేమంటే, ఏటా తొలకరి వర్షాల తర్వాత జొన్నగిరి, పగిడిరాయి, జి.ఎర్రగుడి, తుగ్గలి ప్రాంతాల్లోని పొలాల్లో వజ్రాలు లభించడం సాధారణమేనని స్థానికులు చెబుతున్నారు. అది సాదాసీదా రైతుకి చిక్కిం ది గ‌నుక రూ.50 ల‌క్ష‌ల‌కు అమ్ముడు పోయింది. ఎప్ప‌డూ ఇంత సొమ్ము చూడ‌ని ఆ రైతు దేవుడు ఉన్నాడ‌ని అనుకున్నాడు.

శ్రీ‌లంక‌కు బంగ్లా జిరా క్సా? 

బంగ్లాదేశ్ ఒక‌ప్పుడు భార‌త్ భూభాగంలో ఒక‌టి. 1947 దేశ విభ‌జ‌న స‌మ‌యంలో తూర్పు బెంగాల్‌గా పాకి స్తాన్ ప్రావెన్స్ అయింది. కాగా 1971లో పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వ‌తంత్య్రం కోసం భార‌త్ స‌హాయం కోరి స్వ‌తంత్రించింది. ఢాకా రాజ‌ధానిగా బంగ్లాదేశ్ ఏర్ప‌డింది. అయితే కాల క్ర‌మంలో, రాజ‌కీయ ప‌రిణా మాలు దారుణంగా మారుతుండ‌డంతో బంగ్లా క్ర‌మేపీ శ్రీ‌లంక‌ లా మారుతుందేమోన‌న్న భ‌యాం దోళన లు అంత‌టా ఉన్నాయ‌ని విశ్లేష‌కుల మాట‌. కానీ వాస్త‌వానికి శ్రీ‌లంక కంటే భౌగోళికంగానూ పెద్ద‌ది. సుమా రు 148,460 చ‌ద‌ర‌పు కి.మీ విస్త‌రించిన బంగ్లాదేశ్ జ‌నాభా కూడా శ్రీ‌లంక కంటే 126 శాతం అధికం.  ఇటీవ‌లి కాలంలో అంత‌ర్జాతీయ వేదిక‌ల‌న్నీ బంగ్లాదేశ్ రాజ‌కీయ‌, ఆర్ధిక స్థితిగ‌తుల గురించే చ‌ర్చిం చ‌డం గ‌మ‌నార్హం. అక్క‌డ రాజ‌కీయ‌, ఆర్ధిక‌ప‌రిస్థిలులు ఊహించ‌ని విధంగా దెబ్బ‌తిన్నాయి. 2022 తొలినాళ్ల నుంచే ఈ  ప‌రిస్థితుల మీద చ‌ర్చ జ‌రుగుతోంది. నిజానికి శ్రీ‌లంక లో సంభ‌వించిన ప‌రిస్థితులు ప్ర‌పంచ దేశా లపైనా ప్ర‌భావం చూపే ప‌రిస్థితి ఉంద‌ని అంత‌ర్జాతీయ వేదిక‌ల మాట‌. ఇది ఎంత‌మేర‌కు నిజ‌మో కానీ ప్ర‌స్తుతం శ్రీ‌లంక స్నేహంగా ఉన్న ఏ దేశాన్ని వ‌ద‌ల‌కుండా ఆర్ధిక సాయం కోరింది.  ఆధునిక కాలంలో ఎక్క‌డా జ‌ర‌గ‌లేద‌న్న‌ది రాజ‌కీయ ప‌రిశీల‌కుల మాట‌. కానీ శ్రీ‌లంక బాట‌లో అనేక దేశాలు.. అర్జంటీ నా, ఉక్రెయి న్‌, టునీషియా,ఘ‌నా,ఈజిప్టు, కెన్యా, ఇధియోపియా,సాల్వ‌డార్‌, పాకిస్తాన్‌, ఈక్వి డార్ ..వెళ్లడానికి అవ‌కాశాలున్నాయ‌ని అంత‌ర్జాతీయ వేదిక‌ల చ‌ర్చ‌ల్లో తేలింది.  ప్రభుత్వ అధికారుల విదేశీ ప్రయాణం పరిమితం చేయబడింది, టాకా విలువ తగ్గింది, చెల్లింపులకు నగదు బహుమతులు నిషేధించారు. విలాసవంతమైన వస్తువులపై పన్ను విధించబడుతుంది, ఇవన్నీ బంగ్లాదేశ్ తన విదేశీ మారక నిల్వలను పెంచుకోవడంలో సహాయపడతాయి, తద్వారా దిగుమతి డిమాం డ్‌ను సులభంగా తీర్చవచ్చు. ఈలోగా, ఎగుమ‌తి, దిగుమతుల సంబంధించి ప్రభు త్వ విధానం ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. రష్యా-ఉక్రెయిన్ వివాదంతో ఇప్పటికే నిర్బంధంలో ఉన్న ఆర్థిక వ్యవస్థపై కోవిడ్‌-19 ప్రభావాన్ని తిరస్క రించలేము. రెండోది బంగ్లాదేశ్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు విషయాలను మరింత కష్టతరం చేసింది మరియు ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని పెంచుతుంది. కోవిడ్‌-19, యుద్ధం-దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడానికి, దేశం ఎగుమతి-దిగుమతి నిష్పత్తిని మెరుగుపరచడానికి ద్రవ్యోల్బణ నియంత్రణకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. కనీసం మూడు నెలల దిగుమతుల చెల్లింపును కవర్ చేయడానికి దేశం తగినంత నిల్వలను కలిగి ఉన్న ప్పటికీ, విదేశీ రిజర్వ్ క్షీణత కొనసాగితే అది ఆందోళనకరంగా మారవచ్చు. ఇక్కడ, ఆర్థిక వ్యవస్థను నియంత్రించడానికి మరియు మరమ్మత్తు చేయడానికి సమగ్ర ఆర్థిక ప్రణాళికలో భాగంగా బడ్జెట్ నిర్వ హణ అన్ని స్థాయిల్లో వ్యూహాత్మక జోక్యాలను స్వీకరించడం అవసరం. బంగ్లాదేశ్ ఇప్పటికే ధ‌ర‌ల నియం త్ర‌ణ విధానాన్ని తీసుకుంది. మే 17, 2022న, బంగ్లాదేశ్ నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ, ఆ దేశ ప్రధాని  మంత్రిత్వ శాఖలు, విభాగాలకు ఖర్చుతో ఎక్కువ ఖర్చు లేకుండా అభివృద్ధి ప్రాజెక్టులను ఎలా అమలు చేయాలనే దాని గురించి సలహా ఇచ్చారు. రెండేళ్లకు పైగా కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి కారణం గా శ్రీలంక పర్యాటక రంగం కుప్పకూలింది. ఫలితంగా, దేశం యొక్క విదేశీ మారక నిల్వలు తగ్గడం మొదలయింది.  ప్రభుత్వం ఇంధనం, ఇతర వస్తువులను దిగుమతి చేసుకోవడంలో వేగం పుంజుకోవడం ప్రారంభించింది. ఒకానొక దశలో ప్రభుత్వం దిగుమతులన్నీ నిలిపివేయవలసి వచ్చింది. దీంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. కానీ, బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన మూలస్తంభం వస్త్రాలు, ప్రవాసులు పంపే విదేశీ మారకం. బంగ్లా దేశ్ విదేశీ మారక నిల్వలు ఇతర దక్షిణాసియా దేశాల కంటే చాలా బలమైన స్థితిలో ఉన్నాయి. కోవిడ్-19 మహమ్మారి ప్రారంభ దశల్లో, మహమ్మారి ప్రారంభ దశలో చాలా మంది ప్రవాసులు తమ ఉద్యోగాలను కోల్పోవ‌డంతో  బంగ్లాదేశ్‌కు చెల్లింపులు తగ్గుతాయని చాలా మంది భావించారు. అయితే, ప్రభుత్వ దౌత్య విజయం కారణంగా, బంగ్లాదేశ్ కార్మికులు తక్కువ వ్యవధిలో తమ కార్యాలయాలకు తిరిగి వచ్చారు, అదే రేటుతో విదేశీ మారక ద్రవ్యాన్ని పంపుతున్నారు. కోవిడ్ -19 మహమ్మారి విధ్వంసం, ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గత రెండేళ్లుగా ప్రపంచం లోని ప్రధాన దేశాల ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని ఇక్కడ చెప్పడం మంచిది. ఎందుకంటే కోవిడ్ ప్రభావం ఆరోగ్య రంగంపై మాత్రమే పడలేదు, ఆర్థిక వ్యవస్థ మరియు విద్యతో సహా అన్ని ఇతర రంగా ల ను అది అస్తవ్యస్తం చేసింది. అయితే, బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన మంత్రి దూరదృష్టి నాయకత్వం కార ణంగా, ఒక వైపు, కోవిడ్ యొక్క ఆరోగ్య ముప్పును చాలా విజయవంతంగా ఎదుర్కోగలిగింది, అలాగే మరో వైపు అది ఉంచగలిగింది. దాని ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది. కోవిడ్-19 తర్వాత ప్రపంచ ఆర్థిక మాం ద్యం ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ఆర్థిక సంస్కరణ కార్య క్రమాల ను చేపట్టింది. ప్రపంచ మాంద్యాన్ని దృష్టిలో ఉంచుకుని బంగ్లాదేశ్ బ్యాంక్,  ప్రభుత్వం ఇప్పటికే అనేక ఆర్థిక సంస్కరణ కార్యక్రమాలను చేపట్టాయని ఆశ. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు బలమైన పునాదిపై నిలబడి ఉంది. కరోనావైరస్ షాక్ నుంచీ కోలుకోవడా నికి ఆర్థిక వ్యవస్థ కష్టపడుతుండగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆ పోరాటాన్ని మరింత కష్ట తరం చేసింది. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ చాలా కష్టకాలంలో ఉన్నప్పటికీ. కమోడిటీ ధరలు పెరుగుతు న్నాయి, ద్రవ్యోల్బ ణ ఒత్తిడిని ఎదుర్కోవడం కష్టంగా మారింది, నిల్వలు రెండేళ్ల తర్వాత $40 బిలియన్ల దిగువకు పడిపోయా యి,  ప్రభుత్వం విద్యుత్ఇం, ధనంపై తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొం టోంది, అయితే తాత్కాలిక సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో బంగ్లా ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలు ప్రభావ చూప‌వచ్చు.

తెలంగాణ కేబినెట్ భేటీ.. మునుగోడుపై చర్చ జరిగేనా?

తెలంగాణ మంత్రివర్గ సమావేశం గురువారం (ఆగస్టు 11) మరి కొద్ది గంటలలో జరగనుంది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ కేబినెట్ భేటీలో మునుగోడు కేంద్రంగానే చర్చ జరుగుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే మునుగోడు ఉప ఎన్నికను కేసీఆర్ సీరియస్ గా పట్టించు కోవడం లేదనీ, అది జస్ట్ ఉప ఎన్నికే అని వ్యాఖ్యానించారనీ పార్టీ వర్గాలు చెబుతున్న వేళ.. ఈ కేబినెట్ సమావేశంలో ప్రముఖంగా చర్చించే అంశాలేమిటన్న దానిపై ఆసక్తి నెలకొంది. రష్ట్రంలో రాజకీయ వాతావరణం హీట్ ఒక వైపు.. ఆర్థిక ఇబ్బందులు మరోవైపు నెలకొని ఉన్న నేపథ్యంలో కేబినెట్ లో ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చే అంశాలపై పార్టీలోనే పలు అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.  సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ కేబినెట్ భేటీలో నిధుల సమీకరణ, పథకాల అమలు, ప్రాజెక్టులు, స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రం ఖజానాకు నిధులు సమకూర్చుకోవడంపైనే ప్రధానంగా కేబినెట్ దృష్టి సారించే అవకాశం ఉందంటున్నారు.  ఏందుకంటే 2022-2023 బడ్జెట్ లో ఏకంగా రూ. 45వేల కోట్లు లోటు ఏర్పడుతోంది. ఈ లోటును పూడ్చుకోవడం ఎలా అన్నదానిపైనే ప్రధానంగా చర్చ జరుగుతుందని కొందరు మంత్రులు కూడా ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు. అలాగే పథకాల అమలు, ప్రాజెక్టుల పనులపై నా,   ఆగస్టు 15 నుంచి కొత్తగా ఇవ్వనున్న  పింఛన్లు, దళిత బంధు పథకం రెండో విడత అమలుపై తదితర అంశాలను చర్చించి కేబినెట్ ఆమోదిస్తుందని చెబుతున్నారు. ఇక  జాతీయ రాజకీయాలపైన కేబినెట్ సమావేశంలో కేసీఆర్ ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఢీ అంటే ఢీ అన్నట్లుగా కేంద్రంపై సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంను సైతం బహిష్కరిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.  నీతి ఆయోగ్ సమావేశంకు బీహార్ సీఎం నితీష్ కుమార్ సైతం హాజరుకాకపోవటం, మరుసటి రోజే బీజేపీతో తెగదెంపులు చేసుకొని బీహార్ లో ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తదితర అంశాలపై కేసీఆర్ కేబినెట్ సహచరులకు వివరిస్తారని చెబుతున్నారు.

అన్నా... ఇది మ‌నూరు గాదే!

ఒక పెద్దాయ‌న హైద‌రాబాద్ నుంచి గుంటూరు వెళ్ల‌డానికి బ‌య‌లుదేరాడు. బ‌స్సు ఎక్కాడు. మాస్టారు రాత్రి హాయిగా నిద్ర‌పోయాడు. గుంటూరు దాటి రెండు స్టేజీల త‌ర్వాత ఎవ‌రో లేపితే లేచాడు. గుంటూ రా.. అని అడిగాడు.. అదిపోయి మూడు గంట‌ల‌యింది అన్నాడా వ్య‌క్తి. పెద్దాయ‌న ఖంగారుప‌డ్డారు. ఇది నిద్ర‌, కాస్తంత మ‌తిమ‌ర‌పు సంబంధిత క‌థ‌. కానీ బ‌స్సు కాబ‌ట్టీ స‌రిపోయింది. కానీ విమాన‌మ‌యితే ఏమ‌వుతుంది? ఊహించ‌డానికే భ‌య‌ప‌డ‌తాం. ఆ అనుభ‌వం భ‌యాన‌కం అంటున్నారు నేపాలీలు. ఎందుకంటే వారి విమానం వేరే ప‌ట్ట‌ణంలో దిగింది మ‌రి! బుద్ధా ఎయిర్లైన్స్లో 69 మంది ప్ర‌యాణీకులు జ‌న‌క‌పురి నుంచి ఖాట్మండుకి వెళ్లేవారంతా ఆ విమానం ఎక్కారు. అంతా మ‌రో గంట‌లోనో రెండు గంట‌ల్లోనో చేరిపోతామ‌నుకున్నారు.  స‌ర‌దా మాట‌ల్లో ప‌డ్డారు. అప‌రిచితులు, ప‌రిచితులు అంతా మ‌ళ్లీ ప‌రిచ‌యాలు చేసుకున్నారు. ఎన్నో క‌బుర్లాడు కున్నారు. 63 మంది ప్ర‌యాణీకుల‌తో వెళ్తోన్న ఫ్ల‌యిట్ యు505 విమానం హ‌ఠాత్తుగా వారి గ‌మ్యానికి అవ‌త‌ల సుమారు 255 కిలోమీట‌ర్ల దూరంలోని పొఖారాలో దిగింది. హ‌మ్మ‌య్య మ‌న ఊరు వ‌చ్చేశామ‌ని అంతా దిగారు. కానీ అక్క‌డంతా కొత్త‌గా ఉంది. రోజూ చూసే తెలిసిన మొహాలు ఒక్క‌టీ లేవు. అంతా బ‌హుచిరాగ్గా చూస్తున్నా రు. ఏందిది.. మ‌నోడొక్క‌డూ అగ‌ప‌డ్డూ.. అనుకున్నారు ఓ పెద్దావిడ‌.  అయితే మ‌నూళ్ల‌లో లాగా వాళ్ల‌మీద అమాంతం తిట్ల దండ‌కం చ‌ద‌వ‌లేదు. ఏమ‌యింది, ఇలా ఎందుకు జ‌రిగింద‌ని ఆమెతోపాటు అంద‌రూ ప్ర‌శ్నించారు. తీరా అస‌లు నిజం తెలిసి ఓకే అనేశారు. ఇంత‌కీ విష యమేమంటే.. అక్క‌డ హ‌ఠాత్తుగా వాతావ‌ర‌ణ మార్పు రావ‌డం, సిగ్న‌ల్స్ అంత‌గా అంద‌క‌పోవ‌డంతో ఇక్క‌డిదాకా తేవాల్సి వ‌చ్చింద‌ని అధికారులు చెప్పారు. గ‌ట్టిగా ప్ర‌శ్నిం చినందుకు సారీ.. ఆఫీస‌ర్స్ అనీ అన్నారు. త‌ర్వాత ఓ అర‌గంట‌కో, గంట‌కో మ‌రో తిరుగు విమానంలో వారిని వారి న‌గ‌రంలో దించారు. ఇదో అనుభూతి. ఒకే టిక్కెట్ మీద రెండూళ్లు తిరిగిన అనుభ‌వం. 

కాంగ్రెస్ లోదైర్యం లేని దైన్యం!

ఎన్నిక‌లు రాగానే పార్టీలు రెండింత‌ల‌ ఉత్సాహాన్ని కూడా ప్ర‌ద‌ర్శించ‌డానికి త‌యార‌వుతారు. ప్ర‌స్టుతం తెలంగాణా రాజ‌కీయ వాతావ‌ర‌ణం అంతా మునుగోడు మీద‌నే ఆవ‌హించింది. తాజాగా రాజ‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్  వీడి బీజేపీ నీడ‌లోకి వెళిపోవ‌డంతో బెంబేలెత్తిన పార్టీ పైకి ధైర్యం, గంభీర్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని విశ్లేష‌కులు అంటున్నారు.   నిజానికి మునుగోడులో జ‌రిగేది ఉప ఎన్నికే. కానీ  తెలంగాణాలో అన్ని పార్టీలు దానిమీదే దృష్టి పెట్టాయి.వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఉండబోయే రాజకీయ పరిణామాలను నిర్దేశిం చేది కావడంతో.. ఎంత కాదన్నా, ఎవరు వద్దన్నా అభ్యర్థుల ఎంపికలో చివరకు ఆర్థికబలం కూడా అదన పు అర్హతగా చేరిం ది. టీఆర్‌ఎస్‌లో  ఆర్థిక అంశం పెద్ద విషయం కాకపోయినా, అధికారంలో ఉన్న పార్టీగా నిధులకు కొరత ఉండే అవకాశం ఏమాత్రం లేకపోయినా.. ఉన్నవారిలో ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థినే ఎంపిక చేస్తారన్న వాదన ఉంది.  రేసులో ఉన్న మరో నేత గుత్తా సుఖేందర్‌రెడ్డి శాసన మండలి చైర్మన్‌గా ఉన్నందున ఆయనను  ఉప ఎన్నిక బరిలోకి దించే ఆలోచనను అధినాయ కత్వం చేయలేదని తెలుస్తోంది. వారిని చూసి వీరు, వీరిని చూసి వారు అన్న ట్టు ఇపుడు కాంగ్రెస్‌లోనూ అభ్య‌ర్ధి ఎంపిక‌కు ఆర్ధిక అంశాన్ని ఒక కండీషన్ గా నిర్దేశించుకోవడం  గ‌మ‌నార్హం.  ఇదిలా ఉండ‌గా,  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ శిబిరంలో చేరిపోయిన రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ ను  ఖాళీ చేసే పనిలో భాగంగా మండలాల వారీగా ఇప్పటికే సమావేశాలు ఏర్పాటు చేసి ఆపరేషన్ ఆకర్ష్ అంటున్నారు. ఈ సమావే శాలకు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 90 శాతం మంది నేతలు హాజరవుతున్నారని చెబుతున్నారు. వారికి భరోసా ఇచ్చి క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలంటే డబ్బు అంశమే ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయ సాధన కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అందుకే   అభ్యర్థి పేరు ప్రక టించకుం డా సమావేశాలు, మండలాల్లో అభిప్రాయ సేకరణ పేరుతో కొంత ప్రశాంత వాతావరణం నెల కొల్పి నెలా ఖరుకు అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం. మునుగోడులో కాంగ్రెస్‌ టికెట్‌ కోసం పోటీపడుతున్న ఆశావహులు, ముఖ్య నాయకులతో ఏఐసీసీ కార్యద ర్శి బోసు రాజు బుధవారం (ఆగ‌ష్టు 10న‌)గాంధీ భవన్‌లో సమావేశమయ్యారు. ఎన్నికలో విజయం కోసం అవలంబించా ల్సిన వ్యూహంపై చర్చించారు.  పార్టీ అధిష్ఠానమే అభ్యర్థిని ఖరారు చేస్తుందని చెప్పారు. సర్వేలు, గ్రామస్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తైన తర్వాతనే అభ్యర్థి ఎంపిక ఉంటుందన్నారు.  

మాధవ గానమా? జగన్ మాయా?.. ఫకీరప్ప తీర్పు సారాంశమేమిటి మహాశయా?

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియో వివాదంలో ఎస్పీ ఫకీరప్ప కొత్త మలుపు తిప్పేశారు. ఈ మలుపు తిప్పి మాధవ్ వీడియో కాల్ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేశానని ఆయన సంబరపడితే పడొచ్చు గాక.. కానీ ఆయన ఈ వ్యవహారంలో చూపిన అత్యుత్సాహం.. అధికార పార్టీనీ, ప్రభుత్వాన్నీ మరిన్ని చిక్కుల్లోకి నెట్టేసింది.  తన నగ్న వీడియో కాల్ బయటపడగానే ఎంపీ మాధవ్‌ ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో తానే ఎస్పీకి ఫిర్యాదు చేశానని స్పష్టం  చేశారు. మరి ఫకీరప్ప అదే అనంతపురం ఎస్పీ.. ఆ ప్రెస్ మీట్ చూడలేదో.. లేక మరచిపోయారో కానీ.. అసలు ఎంపీ తమకు ఫిర్యాదే చేయలేదనీ, మాధవ్ అభిమాని తమకు ఫిర్యాదు చేశారనీ చెప్పారు. ఏపీలో పోలీసులు బాధితుల ఫిర్యాదులనే పట్టించుకోరు..అటువంటిది ఎంపీ తరఫున ఎవరో ఫిర్యాదు చేస్తే ఆఘమేఘాల మీద దర్యాప్తు చేసి వీడియో ఒరిజనల్ కాదు అని తేల్చేశారా అని సామాన్య జనులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇంకా  అసలు వీడియో నిజమా? అబద్ధమా అని ఫొరెన్సిక్‌ నివేదిక రాకముందే, అది మార్ఫింగ్‌ కావచ్చంటూ ఎస్పీ ఎలా వ్యాఖ్యానించారని ప్రశ్నల బాణాలు సైతం సంధిస్తున్నారు.   ఆ వీడియో ఫేక్‌. ఒరిజినల్‌ కాదని కనుగొన్నాం. మార్ఫింగ్‌, ఎడిటింగ్ జరిగి ఉండవచ్చు. వీడియో ఒరిజినల్‌ అని నిర్థారించలేకపోతున్నాం. అసలు వీడియో దొరికేవరకూ ఏమీ చెప్పలేం. ఏం చేయలేం అని ఎస్పీ ఫకీరప్ప సెలవిచ్చారు. అక్కడితో ఊరుకోకుండా  ఎంపీ గోరంట్ల మాధవ్ మీద ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఇంక దీనిపై విచారణ ఏమిటన్నట్లు మాట్లాడారు. అలాగే వీడియో ఒక వ్యక్తి చూస్తుండగా మూడో వ్యక్తి రికార్డు చేశారంటూ తన పరిశోధనను బయటపెట్టారు.  ఈ ప్రకటన చేసింది ఒక సాధారణ ఎస్సైయో,సీఐయో కాదు అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప, ఐపిఎస్‌.  నేను చెప్పేశాకా ఇక ఫొరెన్సిక్‌ నివేదికతో పనేముందన్నట్లు ఆయన చెప్పేశారు. ఎస్పీ ప్రెస్‌మీట్‌ ఇలా పూర్తయ్యిందో లేదో  ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ అలా ఢిల్లీలో ప్రెస్‌మీట్‌ పెట్టి తనను తాను నిర్దోషిగా ప్రకటించుకుని తనకు తానే క్లీన్ చిట్ ఇచ్చేసుకున్నారు. ఇలా ఎస్పీ ప్రెస్‌మీట్‌ పెట్టడం, ఆ వెంటనే ఎంపీ మీడియా ముందుకు రావడం కాకతాళీయం అని ఎవరూ భావించడం లేదు. అంతా ఒక పక్కా ప్రణాళిక మేరకు జరిగిందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దీనితో ఎంపీ-ఎస్పీపై విపక్షాలు విమర్శలు గుప్పించారు.  వీడియో వ్యవహారంపై అన్ని యాంగిల్స్‌లో విచారణ జరిపిస్తామని హోంమంత్రి ప్రకటించిన తర్వాత.. విచారణలో దోషి అని తేలితే చర్యలుంటాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రకటించిన తర్వాత .. ఎస్పీ ఫకీరప్ప ప్రెస్‌మీట్‌ పెట్టి, అది ఒరిజినల్‌ వీడియో కాకపోవచ్చని చెప్పడం బట్టి, కేసును  సమాధి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. మాధవ్ తాను స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పిన తరువాత ఎస్పీ ఫకీరప్ప ఎంపీ ఫిర్యాదు చేయలేదనడం, హోంమంత్రి గోరంట్ల మాధవ్ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు  పంపించామని ప్రకటించిన తరువాత అటువంటిదేమీ జరగలేదని ఐపీఎస్ ఫకీరప్ప ఖండించడం ఈ అనుమానాలను మరింత పెంచుతున్నాయి. అన్నిటికీ మించి ఈ కేసులో ఫిర్యాదు చేసిందెవరన్న ప్రశ్నకు ఎంపీ గోరంట్ల మాధవ్, ఎస్పీ ఫకీరప్పలు చెప్పాలి. ఇక హోంమంత్రి తానేటి వనిత ఎస్పీ ప్రెస్ మీట్ తరువాత ఏం మాట్లాడక పోవడాన్ని బట్టి ఆమెను ప్రభుత్వ ‘పెద్దలు’ బలవంతంగా సైలంట్ చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అసలు ఈ కేసులో ఫిర్యాదుదారు ఎవరన్నది ప్రశ్న. తానే ఎస్పీకి స్వయంగా ఫిర్యాదు చేశానని ఎంపీ ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. కానీ తాజాగా ఎస్పీ మాత్రం, ఎంపీ గారి అభిమాని ఫిర్యాదు చేశారని సెలవిచ్చారు. అంటే పోలీసులు ఎంపీ ఫిర్యాదును తీసుకోలేదా? అసలు బాధితుడే ఎంపీ అయినప్పుడు, ఆయన తనపై కుట్ర జరిగిందని ఫిర్యాదు చేస్తే ఆయన ఫిర్యాదును తీసుకోకుండా, అసలు కేసుకు సంబంధం లేని అభిమాని ఫిర్యాదును ఎలా పరిగణనలోకి తీసుకుంటారన్నది ఘనత వహించిన ఎస్పీ ఫకీరప్పగారే చెప్పాలి. అలాగే ఎంపీ చెప్పినట్లు ప్రెస్‌కౌన్సిల్‌, సుప్రీంకోర్టులో పిల్‌, అన్ని వ్యవస్థలకూ కొంపతీసి అదే అభిమానే ఫిర్యాదు చేసినట్లు భావించాలా? మరి కోర్టులో బాధితుల తరఫున అభిమానులు వేసే పిల్‌ను అంగీకరిస్తారా? ఈ ప్రశ్నలన్నిటికీ ఫకీరప్పగారే సమాధానం చెప్పాలి.   ఎంపీ రఘురామకృష్ణంరాజును హైదరాబాద్‌లో చెరపట్టి, అమరావతికి తెచ్చినప్పుడు ఆయన సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న సీఐడీ, దానిని ఫొరెన్సిక్‌ పరీక్షకు పంపింది. మరి ఇప్పుడు ఎంపీ మాధవ్‌ సెల్‌ఫోన్‌ నుంచి బ్లూ వీడియో వచ్చిందన్న ఆరోపణలున్నందున.. రఘరామరాజు విషయంలో అనుసరించినట్లుగానే, మాధవ్‌ ఫోన్‌ను ఎందుకు స్వాధీనం చేసుకోలేదని నెటిజన్లు నిలదీస్తున్నారు. గోరంట్ల  మాధవ్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, దానినే ఫొరెన్సిక్‌కు పంపిస్తే నిజా నిజాలు బయటకొస్తాయి కదా?  అని నిలదీస్తున్నారు. అసలు ఎంపీ మాధవ్‌ వీడియో వ్యవహారంపై విచారణ చేయాలని మహిళా హక్కుల కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ, డీజీపీకి రాసిన లేఖపై విచారణ మొదలయిందా? లేదా? అన్నది ఇంతవరకూ తేలలేదు. ఎంపీ అభిమాని ఇచ్చిన ఫిర్యాదుతోనే సరిపెడతారా? లేక కమిషన్‌ చైర్మన్‌ లేఖపై ప్రత్యేకంగా విచారణ చేస్తారా? అసలు ఇప్పటివరకూ ఏపీ పోలీసు శాఖ గానీ, డీజీపీ గానీ ఈ అంశంపై ఎందుకు స్పందించడం లేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

నేను గ‌ర్ల్ కాదు.. బాయ్‌!

కుటుంబాలు పిల్ల‌ల విష‌యంలో చిత్ర‌మైన ఆలోచ‌న‌ల‌తో ఉంటారు. కొడుక్కి కొడుకే పుట్టాల‌ని, కూతురు ఇంటికి భార‌మ‌ని. ఇది ప‌ర‌మ పాత‌చింత‌కాయ ప‌చ్చ‌డి భావ‌న‌. కానీ దుర‌దృష్ట‌వశాత్తూ చాలా ప్రాంతాల్లో ఇప్ప‌టికే అదే ధోర‌ణిలో త‌ల్లిదండ్రులు ఉన్నారు. చ‌దువుకుని మంచి ఉద్యోగంలో స్థిర‌ప‌డితే పెళ్లి స‌మ యంలో అన్నీ అదే స‌ర్దుకుపోతాయ‌న్న భావ‌న‌కు ఆధునిక త‌ల్లిదండ్రులు పాత సిద్ధాంతాల్ని కొట్టి పారే స్తున్నారు. ఆడ‌పిల్ల కావాల‌నుకునేవారు మ‌గ‌పిల్ల‌ల‌కు చిన్న‌పుడు పిలక‌లు వేయ‌డం, బొట్టుపెట్టి వీల‌యి తే ఓ గౌనూ తొడిగి వారి స‌ర‌దా తీర్చుకుంటారు. అదో ఆనందం. ఇంట్లో ఆడ‌పిల్ల ఉంటే ఆడ‌పిల్ల పుడితే నిక్క‌రూ, టీష‌ర్లూ వేసి క్రాఫ్ కూడా అలా స్ట‌యిల్‌గా చేసి ఆనందిస్తుంటారు.  ఎవ‌రి ఆనందం వారిది.  కానీ వాంకోవ‌ర్‌లో ఓ నాలుగేళ్ల పిల్లాడు తాను గ‌ర్ల్ కాదు బాయ్‌నే అని ప్ర‌క‌టించి అంద‌ర్నీ ఆశ్య‌ర్య‌ప‌రిచాడు. ఈమ‌ధ్య వ‌ర‌కూ ఆడ‌పిల్ల అనుకున్న‌వారంతా హ‌ఠాత్తుగా వీడు ఇలా అంటు న్నాడేవిటా అని ముక్కు వేలే సుకున్నారు. ఊరికే.. అంద‌ర్నీ ఆట‌ప‌ట్టించ‌డానికి అలా అన్నాడ‌ని ఊరు కున్నారు. కానీ వాడి అమ్మ‌మ్మ మాత్రం వాడు చెప్పేది అక్ష‌ర స‌త్యం అని ప్ర‌క‌టించి అంద‌రినీ ఆశ్చ‌ర్యం లో ముంచెత్తింది. ఇంత‌కీ చాలారోజుల‌కు త‌న సంగ‌తి బ‌య‌ట‌పెట్టిన పిల్లాడి పేరు చార్లీ లాయ‌డ్‌. బ్రిటీష్ కొలంబియా, కెన‌డాలో పుట్టాడు. చార్లీ నిజానికి ఆడ‌పిల్ల‌గానే జ‌న్మించాడు. కానీ క్ర‌మేపీ మ‌గ‌పిల్ల‌వాడి ల‌క్ష‌ణాలే ప్ర‌ద‌ర్శి స్తూ వ‌చ్చాడ‌ని అత‌ని త‌ల్లి 27 ఏళ్ల అలైనా బోరెల్ అన్న‌ది. ఈ మ‌ధ్య‌నే అంద‌రితో క‌లిసి ఓ స‌మావేశంలో ధైర్యంగా లేచి గ‌ట్టిగా ప్ర‌క‌టించాడు..యామ్ నాట్ గ‌ర్ల్‌..యామ్ బాయ్‌!.. అని. అంద‌రూ గట్టిగా న‌వ్వుకున్నా రు, వాడిని కావ‌లించుకుని ముద్ద‌లు పెట్టారు. ఐస్‌క్రీమ్‌లు ఇచ్చాడు. క‌ల‌ర్ బాంబులు పేల్చారు.. అయినా వాడు మాత్రం కించిత్ క‌ద‌ల్లేదు. నిజాన్ని మీరు ఆల‌స్యంగానైనా తెలుసుకుంటారు. మీరు న‌న్ను ఆద‌రిస్తా రేన‌నుకుంటాను.. అని ప‌రుగున ఇంట్లోకి పారిపోయాడు. చార్లీ అబ్బాయిగానే జీవితాంతం ఉండాల‌నుకున్నాడు. అధికారికంగా త‌న‌ను అలానే గుర్తించాల‌ని కోరాడ ని అత‌ని త‌ల్లి అన్న‌ది.  మ‌రి పెద్ద‌యితే?