మౌనం వీడిన అనిత.. గోరంట్లపై చర్య ఎలా తీసుకుంటామంటూ ప్రశ్న
posted on Aug 9, 2022 @ 10:41PM
అనంత పురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంప ఎట్టకేలకు హోంమంత్రి తానేటి వనిత మౌనం వీడారు. ఎంపీ మాధవ్ ను తాము వెనకేసుకు రావడం లేదన్నారు. పేరుకు గోరంట్ల ఎపిసోడ్ కు సంబంధించి ఆమె మాట్లాడినా ఆమో ప్రసంగం అంతా విపక్షాన్ని విమర్శించడానికే సరిపోయింది. ఫోరెన్సిక్ ల్యాబ్ కు గోరంట్ల మాధవ్ వీడియో పంపినట్లు చెప్పిన ఆమె నివేదిక వచ్చాకా చర్యలుంటాయన్నారు.
ఇదే విషయాన్ని రెండు రోజుల కిందటే ప్రభుత్వ సలహాదారు చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ గోరంట్ల ఎపిసోడ్ లో నోరు మెదపని తానేటి వనిత ఇక తప్పదన్నట్టు మీడియా మీదకు వచ్చి.. విపక్షం అధికారంలో ఉన్న సమయంలో మహిళలపై ఎన్నో దారుణాలు జరిగాయంటే ఆరోపణలు గుప్పించడానికే ప్రధాన్యత ఇచ్చారు. విచారణ పూర్తై నిజానిజాలు తేలకుండా గోరంట్ల మాధవ్ పై చర్య ఎలా తీసుకుంటామని ప్రశ్నించారు.
అయితే తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళలు దారుణంగా మాట్లాడుతున్నారని తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి మాటలూ, బాడీ లాంగ్వేజ్ దారుణంగా ఉన్నాయన్నారు. మూడేళ్లలో ప్రభుత్వంపై కానీ, సీఎం జగన్ పై కానీ విమర్శించడానికి ఏం లేక గోరంట్ల ఎపిసోడ్ ను అడ్డం పెట్టుకుని నాటకాలాడుతున్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మహిళలపై ఎన్నో దారుణాలు జరిగాయని వనిత విమర్శించారు.
తమ హయాంలో దిశ యాప్ ద్వారా 900 మహిళల్ని రక్షించామన్నారు. గోరంట్ల మాధవ్ ని ప్రభుత్వం రక్షించడం లేదని స్పష్టం చేశారు. విపక్షం తామేదో ఎంపీని తాము కాపాడుతున్నట్టు, ఆయన వల్ల బాధింపబడిన మహిళకేదో అన్యాయం చేస్తున్నట్లు మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.