సహకారచట్టం సవరించనున్న జగన్ సర్కార్
posted on Sep 13, 2022 @ 4:21PM
సహకార వ్యవస్థలో అనేక మార్పులను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. పర్సన్ ఇన్‌ఛార్జి కమి టీల గడువు వచ్చే జనవరి వరకూ పొడిగించడంతో ఈలోగా సహకారచట్టాన్ని సవరించాలని నిర్ణయిం చింది. ఆ తర్వాతనే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో సగం మండలాలకు డీసీసీబీల నెట్‌వర్క్ అనుసంధానం కాకపోవడం వల్ల రుణాలు ఎక్కువగా ఇవ్వలేక పోతున్నా మని అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)ల్లో క్రమం తప్పకుండా ఆడిటింగ్ జరపాలని, నివేది కల్లో వ్యత్యాసం కనిపిస్తే, థర్డ్‌పార్టీతో స్వతంత్రంగా విచారణ చేయించాలని, ఇందుకోసం ఆప్కాబ్, డీసీ సీబీల్లో నిపుణులను నియమించాలని ప్రతిపాదిస్తున్నారు. ఆప్కాబ్, డీసీసీబీ, పీఏసీఎస్ బోర్డుల్లో మూడింట ఒకవంతు మంది నిపుణులను డైరెక్టర్లుగా నియమించాలని, సగం మంది ప్రతి రెండున్న రేళ్లకు విరమించేలా చట్టసవరణ చేయాలని భావిస్తున్నారు. గ్రామ సచివాలయల్లోని వ్యవసాయ సహాయ కులను పీఏసీఎస్ సభ్యులుగా తీసుకురావడం..సహకార రంగంలో సమగ్ర బ్యాంకింగ్ సేవలకోసం ఆప్కా బ్, డీసీసీబీలు, పీఏసీఎస్‌లనువచ్చేనెలలో కంప్యూటరీకరణ చేయడం ప్రతిపాదనల్లో ఉన్నాయి.
ఇదిలా ఉండగా, అధికారులు సహకార ఎన్నికల ప్రక్రియకు చర్యలు చేపట్టారు. సహకార సంఘాల్లో ఎంతమంది అర్హులైన ఓటర్లున్నారు, కొవిడ్ సమయంలో ఎంత మంది సభ్యులు మరణించారు, పీఏసీ ఎస్‌ల్లో పంటరుణాలు, ఇతరత్రా రుణాలు తీసుకున్న వారిలో సకాలంలో రుణాలు చెల్లించని డిఫా ల్టర్స్ ఎంతమంది అనే వివరాలను సేకరిస్తున్నారు. ఇందుకోసం ఒక ప్రొఫార్మాను రూపొందించి క్షేత్రస్థాయి అధికారులకు పంపిన ఉన్నతాధికారులు..డిఫాల్టర్స్ జాబితాలను స్థానిక ఎమ్మెల్యేలకు అందజే యాలని డివి జనల్ సహకార అధికారులను ఆదేశించారు.
అయితే డిఫాల్టర్స్‌కు ఓటు హక్కు తొలగించేందుకు రాజకీయంగా వ్యూహాలు రూపొందించేందుకు ఎన్న డూ లేని విధంగా ఎమ్మెల్యేలకు డిఫాల్టర్స్ జాబితాలు ఇవ్వనున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కాగా, సహకార ఎన్నికలు నిర్వహించే క్రమంలో హెచ్‌ఆర్ పాలసీ ప్రకారం పీఏసీఎస్ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బదిలీలకు సంబంధించిన ఉద్యోగుల జాబితాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈనెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు సమాచారం. అయితే పీఏసీఎస్ ఉద్యోగుల బదిలీలకు కూడా చట్టసవరణ అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. కేవలం జీవో ద్వారా హెచ్‌ఆర్ పాలసీ తెచ్చి, ఉద్యోగుల బదిలీలు చేపట్టడం చట్టరీత్యా సాధ్యం కాదని చెబుతున్నారు.