టీచర్ కోపాన్ని మాయం చేసిన బుడ్డోడి ముద్దులు
posted on Sep 14, 2022 @ 10:20AM
పిల్లలు ఏది చేసినా బాగానే ఉంటుంది. అల్లరయినా, వేడుకోవడమైనా! వారిది అమాయకత్వంతో కూడిన ఆటపాటలు, అల్లరి. అది బడిలోనైనా ఇంట్లోనైనా! అమ్మయినా, టీచరయినా వారికి అంతగా పట్టింపు ఉండదు. అల్లరీ చేస్తారు, భయపడతారు, కొందరు టీచర్‌నీ వేడుకుంటారు! మామూలుగా అయితే తల్లిని వేడుకున్నంత ముద్దుగా టీచర్‌ని వేడుకోవడం ఉండదు. అందు లో ప్రేమే ఉంటుంది. కానీ ఇక్కడో బడిలో ఓ బుడతడు ఏకంగా వాడి తల్లిని వేడుకుంటున్నట్టు టీచర్‌నీ వేడుకున్నాడు. కోపంతో ఉన్న టీచర్ కి చిన్నపిల్లవాడి క్షమాపణ పద్ధతి ఆమె హృదయాన్ని కరిగించింది. ఇంకెప్పుడూ అల్లరి చేసి ఇబ్బంది పెట్టనని వేడుకున్నాడు. కొట్టబోయిన టీచర్ తల్లిలా దగ్గరకి తీసుకుంది!
క్లాస్‌లో అసభ్యంగా ప్రవర్తించినందుకు తన స్కూల్ టీచర్‌ని క్షమించమని కోరిన ఓ చిన్న పిల్లవాడి వీడి యో ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది. విద్యార్థి ప్రవర్తనపై కోపంగా అనిపించిన తన టీచర్‌ని ఒక చిన్న పిల్లవాడు శాంతింపజేశాడు. వాడు ఆమె బుగ్గలపై చాలాసార్లు ముద్దు పెట్టాడు. ఆమె ప్రేమను తిరిగి పొం దేందుకు ప్రయత్నించడం కూడా కనిపిస్తుంది.
క్లాసులో అల్లరి చేయనని పదే పదే చెబుతున్నా, చేస్తావు. నేను మాట్లాడను. మీరంతా మళ్లీ అల్లరి చేయనని ఒకసారి చెప్పారు, కానీ మీరు మళ్లీ చేస్తున్నారు. అంటూ ఆ టీచర్ కోపగించుకుంది. అంతే పశ్చాత్తాపంతో చూస్తూ, చిన్న పిల్లవాడు ఆమెను కౌగిలించుకుని, నేను చేయను, మేడమ్ అని చెప్పాడు. వీడియో చివరలో, చిన్న విద్యార్థి టీచర్‌ని ఒప్పించగలిగాడు, అతను బదులుగా ఆమెకి ముద్దు పెట్టాడు. పాఠశాల, అలా విద్యార్ధి నుంచి ప్రత్యేక గౌరవం పొందిన ఆ టీచర్ పేరు తెలియదు.
ఇదిలా ఉండగా, ఈ ఏడాది ప్రారంభంలో మరో వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. వేసవిశిబిరం చివరి రోజున ఢిల్లీ స్కూల్ టీచర్ విద్యార్థులతో కలిసి డ్యాన్స్ సెషన్ చేస్తున్నట్టు అందులో చూపించారు. తరగతి గదిలో చిత్రీకరించిన క్లిప్, కిస్మత్ చిత్రంలోని ఎవర్‌గ్రీన్ పాట కజ్రా మొహబ్బత్ వాలాకు విద్యార్థుల డాన్స్ వేయడం కనిపించింది.