ఒక్క రాజధానికే నిధులు.. స్పష్టం చేసిన కేంద్రం
posted on Sep 14, 2022 @ 11:55AM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మధ్య విభజన సమస్యలపై కేంద్రం ఈనెల 27న రాష్ట్రాల ప్రధాన కార్యదర్శు లతో సమావేశం కానుంది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌భల్లా ఆధ్వర్యంలో సమావేశం జరగ నుంది. ఈ సమావేశంలో తొమ్మిది విభాగాలకు సంబంధించిన 14 అంశాలు చర్చించనున్నారు.
అయితే చర్చించాల్సిన అనేక అంశాల కంటే రాజధాని గురించిన అంశం మరింత ప్రాధాన్యత సంతరిం చుకుంటుంది. ముఖ్యంగా రాజధాని నిర్మాణానికి నిధుల గురించి చర్చించనున్నారు. జగన్ ప్రభుత్వం ముందు అమరావతి రాజధానిగా ఉంటుందన్నప్పటికీ, తర్వాత పాలనా సౌకర్యానికి మూడు రాజధానులు ఉంటాయని అన్నారు. అమరావతి రాజధానిగా ప్రకటించడం, విపక్షాలు, ప్రజలు ఆమోదిం చిన తర్వాత మరి రెండు నగరాలను రాజధానులుగా చేయనున్నట్లు, అందుకు అభ్యంతరాలు ఉండా ల్సిన అవసరం లేదని ప్రభుత్వమే ప్రచారం చేయించుకుంది.
కానీ అమరావతి రాజధానిగా చేస్తామన్నందుకు దానికి సంబంధించి భూములను ఇచ్చినవారు, రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ అభిప్రాయాన్ని కాదన్నారు. రాజధాని ఒకటే ఉండాలని, మూడు రాజధానులు ప్రకటిం చడం అర్ధరహితమని, ప్రభుత్వం తమకు తోచిన విధంగా మాటమారుస్తూండడం రాజకీయ లబ్ధిని తెలి యజేస్తందే గాని ప్రజాసంక్షేమాన్ని తెలియజేయదని ప్రజలు ఉద్యమించారు.
ఈ నేపథ్యంలో కేంద్రం కూడా అమరావతినే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తించింది. ఈ కారణంగా, రాజ ధాని నిర్మాణానికి నిధుల విషయంలో సందిగ్ధానికి అవకాశమే లేదని కేంద్రం ప్రకటించింది. ఒక రాజ ధాని నిర్మాణానికే నిధులు సమకూరుస్తామని కేంద్రం పేర్కొన్నది. జగన్ పట్టుబట్టి మూడు రాజధానుల అంశా న్ని తెరమీదకి తెచ్చి ప్రజల్ని కేంద్రాన్ని సందిగ్ధంలో పడేశారు. కానీ కేంద్రం మాత్రం మొదటి నుంచి ఆంధ్రాకు ఒకే రాజధాని ఉంటుందని, అదీ ముందుగా ప్రకటించిన అమరావతే అవుతుందని గట్టిగా వాదిస్తోంది. పైగా అమరావతిని రాజధానిగా చేయడానికే నిధులు ఏర్పాటు చేస్తామ ని కుండ బద్దలు కొట్టినట్టు స్పష్టంగా చెప్పింది. ఈ అంశాన్నే కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వ సి.ఎస్‌ల సమావేశంలో స్పష్టం చేయనుంది.