ఏపీ, తెలంగాణా విభజన సమస్యల్ని చర్చించనున్న కేంద్రం
posted on Sep 14, 2022 @ 10:06AM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మధ్య విభజన సమస్యలపై కేంద్రం బుధవారం చర్చించనుంది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌భల్లా ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో అన్ని అంశాల మీదా చర్చించను న్నారు. చర్చించాల్సిన అంశాలకు సంబంధించిన అజెండాను రెండు రాష్ట్రప్రభుత్వాలకు అంద జేశారు.
షెడ్యూల్ 9లో వున్న ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్ల విభజన, 10లో వున్న రాష్ట్ర స్థాయి సంస్థల విభజ న, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఏ పీ హెవీ మిషనరీ యిం జనీరింగ్ లిమిటెడ్ విభజన, నగదు, బ్యాంకు బ్యాలెన్సుల విభజన, తెలంగాణా పౌర సరఫరాల కార్పొరేష న్ నుంచి ఏపీ పౌర సరఫరాలకు రావాలసిన క్యాష్ క్రెడిట్ బకాయిలు మొదలైన సమస్యల పరిష్కరించా ల్సిన అంశా ఎజెండాలో అనేక అంశాలను యీ రోజు కేంద్ర హోంశాఖ చర్చించనుంది. ఎజండాను రెండు రాష్ట్రాలకు కేంద్రం పంపింది. రాజధాని నగరాభివృద్ధి కి కేంద్ర మద్దతు, కొత్త రాజధాని నుంచి ర్యాపిడ్ రైల్ కనెక్టివిటీ నిర్మాణం తదితర అంశాలను కూడా ఎజండాలో చేర్చారు.
అలాగే విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో పేర్కొన్న దుగ్గరాజపట్నం పోర్టు, బయ్యారం స్టీల్ ప్లాంటు, కడప స్టీల్ ప్లాంట్, గ్రీన్‌ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీ, విశాఖపట్నం విజయవాడల్లో మెట్రో రైలు నిర్మాణం వంటి అంశాలు మాత్రం యెజండాలో లేవు. అంతేగాక, విద్యుత్ బకాయిల అంశం కూడా లేకపోవడం గమ నార్హం.
ఇక కేంద్ర రాష్ట అంశాల విషయానికి వస్తే, ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 94 (1)(2) ప్రకారం పన్ను ప్రోత్సాహకాలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఏడు వెనుకబడిన జిల్లాలకు అభివఈద్ధి నిధి, రెవె న్యూ లోటు భర్తీ, కొత్తరాజధానికి కేంద్రం మద్దతు, విద్యాసంస్థల ఏర్పాటు మొదలైన అంశాలు చర్చిం చవచ్చు.