వేటు మంచి కోసమే

      ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చిందంటే అది టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ఒక్కరిది కాదని, అమరవీరులతో పాటు తామందరిదని మెదక్ ఎంపీ విజయశాంతి పేర్కొన్నారు. తనపై వేటు వేసిన కేసీఆర్ ఇంతవరకు షోకాజ్ నోటీసులు ఎందుకు ఇవ్వలేదో అర్ధం కాలేదని, నోటీసులు అందిన తర్వాత స్పందిస్తానని ఆమె తెలిపారు.   నాపై వేటు నా మంచి కోసమేనని రాములమ్మ అన్నారు. ఎందుకు వేటు వేశారో ప్రస్తుతం చెప్పలేనని, నాతో పాటు ఇంకెందరిపై వేటు పడిందో ఇప్పుడే చెప్పలేనని, నోటీసు వచ్చిన తర్వాత స్పందిస్తానని అన్నారు. వేటుపై కేసీఆర్‌పై విమర్శలు చేసి సంస్కారాన్ని కోల్పోనని విజయశాంతి పేర్కొన్నారు. 16 ఏళ్లుగా రాజకీయంలో ఉన్నాను. నేనేంటో రాష్ట్రంలోనేకాక, దేశంలో అందరికీ తెలుసునని, షోకాజ్ నోటీసు వచ్చిన తర్వాతే తన అభిమానులతో చర్చించి భవిష్యత్ కార్యాచారణపై నిర్ణయం తీసుకుంటామని విజయశాంతి స్పష్టం చేశారు.

జగన్ కి జలగం జలక్

      ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు అనుచరులు మూసివేశారు. ఇటీవలి కాలంలో జలగం వెంకట్రావ్‌కు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి తోడు జలగం కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణలో ఆ పార్టీ ప్రభావం పెద్దగా కనిపించలేదు. దీంతో జలగం అనుచరులు పార్టీతో తెగదెంపులు చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపటంతో వెంకట్రావ్ కూడా కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జోరందుకొంది. దీంతో జలగం వర్గం కార్యకర్తలు పార్టీ కార్యాలయాన్ని మూసివేశారని అంటన్నారు. పార్టీ కార్యాలయం ముందున్న ఫ్లెక్సీలను తొలగించారు.

పొలిటికల్ జోక్ by Mallik

      ఢిల్లీ నగరంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది...వందలాది కార్లు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నాయ్. అందులో వినయ్ కారు ఒకటి. వాచ్ వంక విసుగ్గా చూసుకుంటున్న వినయ్ కారు విండో అద్దం మీద ఒక వ్యక్తి కంగారుగా దబదబా బాదుతున్నాడు. వినయ్ విండో డోర్ కిందకి దించాడు. '' ఏంటి? అడిగాడు వినయ్. ''సార్..టెర్రరిస్టులు ఇప్పుడే సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, దిగ్విజయ్ సింగ్, చిదంబరం, షిండే, సుష్మాస్వరాజ్....వీళ్ళ౦దర్ని కిడ్నాప్ చేశారు సార్... వాళ్ళందర్ని విడిచిపెట్టడానికి వాళ్ళు 1000 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు అడిగిన మొత్తం ఇవ్వకపోతే అందరి మీద పెట్రోల్ పోసి తగల బెడ్తామని అంటున్నారు సార్..అందుకే మేము ఇక్కడున్న అందర్ని విరాళాలు ఇవ్వమని అడుగుతున్నాం...'' అన్నాడు ఆ వ్యక్తి. '' అంటే మేము ఇప్పుడు ఎంతెంత విరాళం ఇవ్వాలని నీ ఉద్దేశం? " అడిగాడు వినయ్. ''ఎంతో కాదు సార్..మీరంతా చెరో లీటర్  పెట్రోలు ఇస్తే చాలు'' 

రాష్ట్ర విభజన ఒక్క రోజు నిర్ణయం కాదు

      తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం ఒక్క రాత్రిలో తీసుకున్న నిర్ణయం కాదు. మూడేళ్లుగా జరిగిన సంప్రదింపులు, చర్చల అనంతరం ఈ సాహసోపేతమయిన నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానం తీసుకుందని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ గుర్తించిందని రాష్ట్ర మంత్రి జానారెడ్డి అన్నారు. గత 60 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమం అనేక రకాలుగా జరుగుతూ వస్తుందని, ఎందరో అమరులు బలిదానాలు చేశారని, 1969లో తుపాకి కాల్పుల్లో చనిపోతే, మలిదశ ఉద్యమంలో తమను తాము కాల్చుకున్నారని అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర ప్రజలు, నేతలు సంయమనం పాటించాలని ఆయన కోరారు. తెలంగాణ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆవేశాలతో నిర్ణయాలు తీసుకుంటే, ఆవేశాలతో విధ్వంసం కొనసాగితే తీర్చలేని సమస్యలెదురవుతాయని ఆయన హెచ్చరించారు. సీమాంధ్రులు ఆందోళనలు విరమించి తమ సమస్యలను కేంద్రానికి నివేదించాలని ఆయన కోరారు. సంయమనం పాటించి రెండు రాష్ట్రాలను అభివృద్ధి పథంలో తీసుకుపోదామని పిలుపునిచ్చారు. భారతదేశం గర్వపడేలా ప్రగతి సాదిద్దామని కోరారు. తెలుగుజాతి ఐక్యతను దెబ్బతీయవద్దని, అన్నదమ్ముల్లా విడిపోయి కలిసి బతుకుదామని అన్నారు.

రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పొరపాటు: దేవినేని నెహ్రూ

      రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పొరపాటు ఉందని ఒప్పుకుంటామని మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ అన్నారు. అయితే ప్రాంతీయవాదం ఎగిసినప్పుడు కొందరు నేతలు పాదయాత్రలకు వెళ్లి ఒక్కో రకంగా మాట్లాడారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వంటి నేతలు రాజకీయం కోసం తెలంగాణను ఎత్తుకున్నారన్నారు. 2009 డిసెంబరు తొమ్మిదిన తెలంగాణ ప్రకటన వస్తే కాంగ్రెస్ ఎమ్.పిలు,ఎమ్మెల్యేలు అంతా ఆందోళన చేస్తే కేంద్రం దిగివచ్చి నిర్ణయం మార్చుకుందని ఆయన చెప్పారు. ఐదు లక్షల కో్ట్లు ఇచ్చి రాష్ట్రాన్ని ముక్కలు చేయండని ఒక నాయకుడు చెబుతున్నారని, మరో నాయకుడు విజయవాడ రాజధాని కావాలలని అంటారని, ఇప్పటికైనా టిడిపి వైఖరి ఏమిటో చెప్పండని ఆయన ప్రశ్నించారు. ప్రజల మనోభావాలను రాజకీయ పార్టీలు గౌరవించాలని మాజీ మంత్రి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. గతంలో ఏం చెప్పినా ఇప్పుడు పార్టీలు సమైక్యాంధ్రకు మద్దతుగా ఆలోచన మార్చుకోవాలన్నారు. విభజన నిర్ణయంతో ప్రతి తెలుగువాడి గుండె అగ్నిగుండంలా మారిందన్నారు. రాజకీయ పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకొని సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు.

సమైక్య సెంటిమెంట్ కోసం నేతల పోటా పోటీలు

  ఒకప్పుడు తెలంగాణా రాష్ట్ర సాధనలో తామే ముందుండాలని రాజకీయనేతలందరూ పోటీలు పడేవారు. అయితే, కాంగ్రెస్ తెలంగాణా ప్రకటన చేసేయడంతో వారందరూ రాజకీయ నిరుద్యోగులుగా మారిపోగా, ఇప్పుడు ఆ అవకాశం సీమంధ్ర నేతలకి, జేఏసీలకి దక్కింది.   ఇక సమైక్యాంధ్ర సెంటిమెంటును అందిపుచ్చుకొనేందుకు మూడు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పిన త్యాగాలకు మారుపేరయిన వైకాపా అందరి కంటే ముందుగా త్యాగాలు చేసేసి రోడ్డేక్కగానే, ఆ త్యాగాల రేసులో తామెక్కడ వెనుకబడిపోతామోననే భయంతో కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగింది. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున ఎందుకు మేస్తుందన్నట్లు, తల్లి పిల్లా కాంగ్రెస్ లను చూసి తెదేపా నేతలు కూడా చేలోకి దిగిపోయారు.   వారందరూ ఒకరిని చూసి మరొకరు భయపడుతూ, ‘సమైక్యాంధ్ర మహా రక్షక’ బిరుదు కోసం ఒకరితో మరొకరు పోటీలు పడుతుంటే, వారికి దీటుగా ఉద్యమాలు చేస్తున్న ప్రజలు మాత్రం వారెవరినీ నమ్మకపోవడం విచిత్రం. కానీ రాజకీయ నేతలు మాత్రం తాము ప్రజాభీష్టం మేరకే రాజీనామాలు చేసి ఉద్యమంలో దిగామని చెపుకోవడం విశేషం. ఈ కారణంగానే వారు కూడా పార్టీల వారిగా జనాలని పోగేసుకొని ఎదుట పార్టీనే లక్ష్యంగా చేసుకొని ఉద్యమాలు చేస్తున్నారు.   ప్రజల అద్వర్యంలో నడుస్తున్న ఉద్యమాలు రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తుంటే, సదరు పార్టీల నేతృత్వంలో సాగుతున్న ఉద్యమాలు మాత్రం ఎదుట పార్టీ వల్లనే రాష్ట్ర విభజన జరిగిందని, ఎదుట పార్టీలో వారు ఎప్పుడెప్పుడు ఏవిధంగా రాష్ట్ర విభజనకోసం ప్రయత్నాలు చేసింది వివరిస్తూ, వారు ఆంధ్ర ద్రోహులని కేవలం తాము మాత్రమే ‘మహా సమైక్య రక్షక’ బిరుదుకు అన్ని విధాల అర్హులమని నిరూపించుకొనే పనిలో పడ్డారు.   అయితే, వారిలో ఏ ఒక్కరూ కూడా తెలంగాణా ఏర్పాటుని దైర్యంగా వ్యతిరేఖించకుండా, అవ్వ కాదు బామ్మ అన్నట్లు తెలంగాణా పేరెత్తకుండా జాగ్రత్త పడుతూనే రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ చేసిన ప్రకటనను వ్యతిరేఖిస్తున్నారు.   ఇప్పుడు వారు లేవనెత్తుతున్న అనుమానాలను, భయాలను, సమస్యలను ఆనాడు అఖిలపక్ష సమావేశంలో కూడా అడిగి ఉండవచ్చును. ఒకవేళ అందుకు అనుమతి లేదనుకొంటే అప్పుడు హోంమంత్రికి ఇచ్చిన లేఖలో లికిత పూర్వకంగా తమ అభ్యంతరాలను తెలియజేసి వాటిని నివృత్తి చేసిన తరువాతనే తాము రాష్ట్ర విభజనపై తమ అభిప్రాయం చెపుతామనో లేక అంగీకరిస్తామనో చెప్పి ఉండవచ్చును.   కానీ, అప్పుడు అందరూ ముందుగా తమ నిర్ణయం చెప్పేస్తే రాజకీయంగా తామెక్కడ నష్ట పోతామనో, లేక ఎదుట పార్టీ తమపై రాజకీయంగా ఎక్కడ పైచేయి సాధిస్తుందనో భయంతో ఆ బాధ్యతను కాంగ్రెస్ పైకి నెట్టి చేతులు దులుపుకొని చక్కావచ్చారు. తీరా చేసి ఇప్పుడు కాంగ్రెస్ తన నిర్ణయం ప్రకటించిన తరువాత గత 5 దశాబ్దాలలో జరిగిన సంఘటనలను, నివేదికలను, లేఖలను ప్రస్తావిస్తూ వితండ వాదనలు చేస్తూ ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.   దీనిని ప్రజలు గమనించలేరనే భ్రమలో నేతలు రాజకీయ చదరంగం ఆడుతున్నారు. అయితే, ప్రతీ ఐదేళ్ళకోసారి జరిగే పరీక్షలలో ప్రజలు ఎప్పుడు నెగ్గుతూనే ఉండగా రాజకీయ పార్టీలే ఓడిపోతున్న సంగతిని గుర్తుంచుకొంటే, వారు ఈవిధంగా ప్రజలని మభ్య పెట్టే ప్రయత్నాలు చేయరేమో.

పార్లమెంట్ ను తాకిన సమైఖ్య సెగ, సభలువాయిదా

      లోక్‌సభలో విభజన మంటలు చెలరేగాయి. సోమవారం ఉదయం లోక్‌సభ ప్రారంభంకాగానే సీమాంధ్ర టీడీపీ ఎంపీలు విభజనపై వాయిదా తీర్మానం ఇచ్చారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర ఎంపీలు నినాదాలు చేశారు. తమ ప్రాంత ప్రయోజనాలు పరిరక్షించాలని టీడీపీ ఎంపీలు స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. టీడీపీ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. సీమాంధ్ర ఎంపీలకు పోటీగా తెలంగాణ ఎంపీలు నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ సభను వాయిదా వేశారు.   రాజ్యసభ సోమవారం ప్రారంభమైన వెంటనే విభజన నినాదాలతో మధ్యాహ్నానికి వాయిదా పడింది. రాజ్యసభలో విభజనకు వ్యతిరేకంగా సమైక్యవాదులు నినాదాలు చేశారు. దీంతో సభలో గందగోళం నెలకొనడంతో రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.

లగడపాటికి వ్యాపారం, చిరుకు పదవే ముఖ్యం: కేశవ్

      రాష్ట్ర విభజన పద్ధతి ప్రకారం జరగలేదని, కాంగ్రెసు పార్టీ రాజకీయ కోణంలోనే విభజన చేసిందని టిడిపి సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. చిరంజీవి కి కేంద్ర మంత్రి పదవి, లగడపాటి కి తన వ్యాపారాలే ముఖ్యమని ఆయన అన్నారు. సీమాంధ్ర కాంగ్రెసు నేతలను తాయిలాలు, బెదిరింపుల ద్వారా అధిష్టానం దారిలోకి తెచ్చుకుందని విమర్శించారు.   లగడపాటికి దమ్ముంటే ఢిల్లీలో ఆందోళన చేయాలని హితవు పలికారు.రాజీనామాలు వద్దంటూనే కాంగ్రెసు నేతలు ఎందుకు రాజీనామా చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర నేతలకు చిత్తశుద్ధి ఉంటే ప్రజల కష్టాలను పార్లమెంటు దృష్టికి తీసుకు వెళ్లాలని సవాల్ చేశారు. ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పినట్లుగా తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం జరగలేదన్నారు.

జగన్‌ చాలా కాలం జైళ్లో ఉండాల్సి వస్తుంది

      వైయస్‌ఆర్‌ అభిమానిగా ఉండి ఇటీవల వైకాపా పార్టీని వీడిన కొండా సురేఖ మరోసారి వైఎస్‌ఆర్‌సిపి పై దుమ్మెత్తి పోశారు. తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటం కోసం ఆపార్టీలో ఉన్నతెలంగాణ నేతలంతా పార్టీని వీడాలని పిలుపు నిచ్చారు. ఇప్పటికే తనతో పాటు పార్టీని వీడిన జిట్టా బాలకృష్ణారెడ్డి, కెకె మహేందర్‌ రెడ్డి, రాజ్‌ఠాకూర్‌తో కలిసి భువనగిరిలో ప్రెస్‌మీట్‌ నిర్వహించారు.   వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి తెలంగాణకు అనుకూలంగా ఉండేవారని కాని ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు మాత్రం వైయస్‌ ఆశయాలకు వ్యతిరేఖంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు అనుకూలంగా ఇడుకుల పాయ వైయస్‌ సమాది సాక్షిగా మాట ఇచ్చిన వైసిపి ఇప్పుడు మాట తప్పిందన్నారు. జగన్‌ తన తీరు మార్చుకోకపోతే మరింత కాలం జైళులోనే గడపాల్సి వస్తుందన్నారు సురేఖ, వైయస్‌ అంటే తమకు ఇప్పటికీ అభిమానం  ఉందన్న నేతలు అభిమానం కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేం అన్నారు.

మేం రాజీనామా చేయం: బొత్సా

      రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ముఖ్యమంత్రి పిసిసి చీఫ్‌లు రాజీనామ చేయాలంటూ వస్తున్న ఒత్తిని పిసిసి చీఫ్‌ బోత్సా సత్యనారాయణ తొసి పుచ్చారు. సమైఖ్యంగా డిమాండ్‌తో తాను రాజీనామ చేయబోవటం లేదని ఆయన తేల్చి చెప్పారు. తాము రాజీనామ చేస్తే శాసన సభలో సమైక్య వాణి ఎవరు వినిపిస్తారంటూ ఆయన ప్రశ్నించారు.   ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం సీమాంద్ర నేతల సమావేశంలో తాము కూడా సంతకాలు చేశామని చెప్పారు. విభజిస్తే వచ్చే నీటి వనరులు, విద్యా, ఉద్యోగ ఉపాది అవకాశాలు లాంటి సమస్యల విషయం పై కూడా అధిష్టానంతో చర్చిస్తామన్నారు.   పార్లమెంట్‌లో తెలంగాణబిల్లు పాసవుతువందో లేదో ఇప్పుడే చెప్పలేమన్న బొత్స, టిడిపి, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లు రాజకీయ లబ్దికోసమే దేశనాయకుల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు.

ఆగస్టు 12లోపు రాజీనామా చేయకుంటే అంతే..

      ఐదు రోజులు గడిచిన సీమాంద్రలో నిరసనల హోరు మాత్రం తగ్గటం లేదు. ఇప్పటికే ప్రజాల సంఘాలు విద్యార్ధులు ఉద్యమంలో పాల్గొంటుండగా రాజకీయానాకులకు కూడా ఉద్యమకారులు హుకుం జారీ చేశారు. ఆగస్టు 12 లోగా పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలంటూ సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ డెడ్‌లైన్ విధించింది.   పదవుల కోసం పాకులాడుతూ ఉద్యమంలోకి రాని పక్షంలో త్వరలోరాభోయే ఎలక్షన్స్‌లో ప్రజలే ఆ నాయకులకు తగిన బుద్ది చెపుతారన్నారు. నాయకలు ఉద్యమంలో చేరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విభజన ఆపే దిశగా వత్తిడి చేయాలని అలా జరగని పక్షంలో 12 అర్ధరాత్రి నుంచి నిరవదిక సమ్మెకు దిగుతున్నట్టుగా ప్రకటించారు. ఏపి ఎన్జీవోలతో పాటు ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, విద్యార్ధులు, రాజకీయనాయకులు ఇలా అందకిని ఒకే వేదిక మీదకు తీసుకు వచ్చి రాష్ట్ర సమైక్య పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు. హైరదాబాద్‌ ఆంద్రప్రదేశ్‌లో భాగం అన్న ఎన్జీవోలు ఆగస్టు 15న హైదరాబాద్‌లో భారీ బహిరంగసభ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.

సీమాంద్ర మున్సిపాలిటీలు బంద్‌

        రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ సీమాంద్ర ప్రాంతంలో ఉద్యమాలు ఉదృతం అవుతున్నాయి. ఇన్నాళ్లు రాజకీయనాయకులు, విద్యార్ధలు మాత్రమే పాల్గొన్న ఉద్యమంలో నేటి నుంచి ప్రభుత్వొద్యోగులు కూడా భాగం కానున్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు సీమాంద్రలోని 13 జిల్లా మున్సిపాలిటీ ఉద్యోగులు సమ్మె బాట పడుతున్నారు.   ఈ మేరకు మున్సిపల్ మినిస్టీరియల్ ఉద్యోగులు, కమిషనర్ల సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం చైర్మన్ కృష్ణమోహన్‌రావు, కమిషనర్ల సంఘం అధ్యక్షుడు శివరామకృష్ణ పాల్గొన్న సమావేశంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో సీమాంధ్రలోని 13 జిల్లాల్లోని మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న అన్ని స్థాయిల ఉద్యోగులు మూడు రోజులపాటు విధులు బహిష్కరించనున్నట్టు తెలిపారు. దీంతో పాటు జెఏసి తలపెట్టిన అన్నిరకాల నిరసనలకు సమ్మెలకు మున్సిపాలిటీ ఉద్యోగులు సహాకరిస్తారని ప్రకటించారు.

స‌భ సాగ‌టానికి స‌హ‌క‌రించండి

  వ‌ర్షాకాల స‌మావేశాలు మెద‌లుతున్న నేప‌ధ్యంలో స‌భ స‌జావుగా న‌డిచేందుకు అన్ని పార్టీల వారు స‌హ‌క‌రించాల‌ని ప్రదాని మ‌న్మోహ‌న్ సింగ్ కోరారు. గ‌త మూడు స‌మావేశాల్లో ఆటంకాలు నిర‌స‌నల వ‌ల్ల చాలా స‌మ‌యం వృదా అయినందున ఈ సారి అలాంటి ఆటంకాల‌కు తావివ్వదవ‌ద్దని కోరారు. ఈ స‌మావేశాల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నఆహార భ‌ద్రత బిల్లును స‌భ‌ముందుకు తీసుకు రానున్నారు. సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ సమావేశానికి ప్రధానితోపాటు వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ స‌మావేశాల్లో అన్ని పార్టీ ప్రతినిధుల‌ను స‌భ స‌జావుగా జ‌ర‌గాడ‌నికి స‌హాక‌రించాల‌ని ప్రదాని కోరారు. అందుకు అన్ని పార్టీల స‌భ్యులు మ‌ద్దతు ప‌లికారు.

ముగిసిన మ‌రో ప్రజా ప్రస్థానం

  వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కూతురు, జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి చెల్లెలు, ష‌ర్మిల చేప‌ట్టిన మ‌రోప్రజాప్రస్థానం పాద యాత్ర ముగిసింది. 2012 అక్టోబ‌ర్ 18న క‌డ‌ప‌జిల్లా ఇడుపుల పాయ‌లో  ప్రారంభ‌మైన ష‌ర్మిల పాద యాత్ర ఆదివారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది. గతంలో వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి చేప‌ట్టిన ప్రజాప్రస్థానం పాద‌యాత్ర కూడా ఇచ్చాపురంలోనే ముగించారు. జ‌గ‌న‌న్న వ‌దిలిన బాణాన్ని అంటూ ష‌ర్మిల ప్రారంభించిన పాద‌యాత్ర 116 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు వేల కిలోమీటర్లకుపైగా సాగింది. ఈ యాత్ర 14జిల్లాల్లో 230 రోజుల పాటు 2250 గ్రామాల మీదుగా 3112 కిలోమీటర్ల వరకు సాగింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ష‌ర్మిల ఎంతో మంది ప్రజ‌ల‌ను క‌లిశారు. వెళ్లిన ప్రతిచోట అధికార ప్రతిప‌క్షాల‌పై విమ‌ర్షనాస్త్రాల‌ను సందిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో త‌న మార్క్ చూపించారు. దాదాపుకు కోటి మందికి పైగా ప్రజ‌ల‌ను క‌లిసిన ష‌ర్మిల ఆగ‌స్టు 4 ఆదివారం ఇచ్చాపురంలో యాత్ర ముగించారు. పాదయాత్ర ముగిస్తున్న సందర్భంగా ఇచ్ఛాపురంలో విజయ స్థూపాన్ని షర్మిల ప్రారంభించనున్నారు.

మ‌ళ్లీ స్వరం మారింది

  ఆంద్రప్రదేశ్ రాజ‌కీయాల్లో కెసిఆర్‌ది ప్రత్యేక‌మైన శైలి, ఎంత‌టి వారినైన ఏ మాట ప‌డితే ఆ మాట అన‌డం త‌రువాత అబ్బే నా ఉద్దేశ్యం అది కాదు అంటూ మాట మార్చడం ఆయ‌న‌కు మాత్రమే చెల్లింది. అప్పట్లో తెలంగాణ జాగో ఆంద్రా వాల బాగో అంటూ నినాదాలు ఇచ్చిన కెసిఆర్ త‌రువాత అబ్బే నా ఉద్దేశ్యం అది కాదు అంటూ బుకాయించారు. త‌రువాత తెలంగాణ ప్రక‌ట‌న‌తో కెసిఆర్ వ్యాఖ్యల కోసం ఎదురు చూసి వారికి ఆయ‌న ఓ గౌత‌మ బుద్దునిలా క‌నిపించారు. అన్ని ప్రాంతాల వారు తెలంగాణ‌లో ప్రశాంతంగా ఉండ‌వొచ్చు అన్న ఆయ‌న అంద‌రిని మా సొంత వారిలా చూసుకుంటామని భ‌రోసా కూడా ఇచ్చారు. కాని ఈ స్టేట్‌మెంట్ ఇచ్చి 48 గంట‌లు కూడ గ‌డ‌వ‌క ముందే కెసిఆర్ మరోసారి మాట మార్చారు. ఆంద్రా ఉద్యోగులు ఆంద్రాకు వెళ్లిపోవాల్సిందే అని హుకుం జారి చేశారు. అయితే కెసిఆర్ చేసిన ఈ వ్యాఖ్యల‌తో రాజ‌కీయ వ‌ర్గాల్లో భారీ దుమార‌మే రేగింది. దీంతో మ‌రో సారి న‌ష్ట నివార‌ణ చ‌ర్యల‌కు దిగాడు కెసిఆర్‌. ప్రెస్‌మీట్ పెట్టి మ‌రి త‌న చేసిన వ్యాఖ్యల‌లోని అస‌లు అర్ధాన్ని వివ‌రించాడు. అంతే కాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డ త‌రువాత తెలంగాణ పున‌ర్‌నిర్మణం కోసం త‌ను ఎలాంటి ప్రణాలిక‌ల‌ను సిద్దం చేస్తున్నాడో కూడా ప్రజ‌ల‌కు వివ‌రించాడు. అయితే రోజుకో ర‌కంగా మాట్లాడుతున్న కెసిఆర్ వ్యాఖ్యల‌ను స‌మ‌ర్ధించ‌లేక సొంత పార్టీ నాయ‌కులే త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

అమ్మా బైలెల్లినాదో..

తెలంగాణ ప్రాంతంలో ఘ‌నంగా జ‌రుపుకునే బోనాల ఉత్సవాలు ఆఖ‌రికి అంకానికి చేరుకున్నాయి. ఆఖ‌రి వారం అయిన ఈ రోజు పాత‌బ‌స్తీలోని లాల్‌ద‌ర్వాజా అమ్మవారికి భ‌క్తులు బోనాలు స‌మ‌ర్పిస్తున్నారు. ఈ రోజు ఉద‌యం నుంచే లాల్ ద‌ర్వాజ అమ్మవారి ఆళ‌యం ద‌గ్గర భ‌క్తులు భారులు తీరారు. అంతేకాదు ఈ రోజుతో లాల్‌ద‌ర్వాజా బోనాల‌కు 105 ఏళ్లు పూర్తవుతుండ‌టంతో ఈ బోనాల‌ను మ‌రింత వైభవంగా జ‌రిపేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బోనాల ఉత్సావాల‌తో పాటు,రంజాన్ ఉప‌వాస‌లు కూడా కొన‌సాగుతుండ‌టంతో హైద‌రాబాద్ న‌గ‌రం ఆద్యాత్మిక శోభ సంత‌రించుకుంది. పోతురాజుల వీరంగాలు, అమ్మవారి పూనకాలతో  హైదరాబాద్‌లో సందడి వాతావరణం నెలకొంది. పాతబస్తీలోని లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం ముందు వేకువజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. ఈ రోజుతో దాదాపుగా అన్నిప్రాంతాల్లో బోనాల ఉత్సావాలు ముగుస్తుండ‌టంతో భ‌క్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి ద‌ర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు.

ఉప్పొంగెనే గోదావరీ..

  ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వ‌ర్షాల‌తో గోదావ‌రి మ‌హోగ్రరూపాన్ని దాల్చింది. వాగులు వంక‌ల‌ను త‌న‌లో క‌లుపుకుంటూ చుట్టు ప‌క్కల గ్రామాల‌ను ముంచెత్తుతుంది. ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌తో పాటు, ఖ‌మ్మం వ‌రంగ‌ల్లో జిల్లాలోని చాలా ప్రాంతాలు వ‌ర‌ద తాకిడి అత‌లాకుత‌లం అవుతున్నాయి. తాజాగా గోదారి పోల‌వ‌రం గ్రామంపై కూడా పోటెత్తడంతో అక్కడి ప్రజ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌రలిస్తున్నారు అధికారులు. ఇప్పటికే ధ‌వ‌లేశ్వరం బ్యారేజి అన్ని గేట్లత‌ను ఎత్తి 19 ల‌క్షల క్యూసెక్ల నీరు స‌ముద్రంలోకి విడిచి పెడుతున్నారు. అయినా మ‌రో 18 అడుగుల నీటి మ‌ట్టం పెరిగే అవ‌కాశం ఉన్నట్టుగా అంచ‌నాలు వేస్తున్నారు అధికారులు. 15 రోజుల్లోనే మూడోసారిగ గోదావరి ఇలా ఉగ్రరూపం దాల్చటంతో లోత‌ట్టు ప్రాంతాల ప్రజ‌లు భయాందోల‌న‌ల‌కు గుర‌వుతున్నారు. చాలా ఊర్లకు ప్రజా సంభందాలు తెగిపోయాయి. కోన‌సీమ‌లోని 70 కి పైగా గ్రామాలు జ‌ల‌దిగ్భందంలో ఉన్నాయి. ఖ‌మ్మం జిల్లానూ ప‌రిస్థితి అలాగే ఉంది. ఇప్పటికే గోదావ‌రి నీటి మ‌ట్టం 62 అడుగులకు చేరింది. శభరీ వంతెన నీట మునిగిపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరద ఉద్రుతికి వరంగల్ జిల్లాలోని రైతులు తీవ్రంగా నష్టపోయారు.

ఎన్టీఆర్ స‌మాది సాక్షిగా సీత‌య్య రాజీనామ‌

  సీమాంద్ర జిల్లాలల్లో జ‌రుగుతున్న స‌మైక్య ఉద్యమానికి మ‌ద్దతుగా ఎన్టీఆర్ త‌న‌యుడు, టిడిపి రాజ్య‌స‌భ స‌భ్యుడు  నంద‌మూరి హరికృష్ణ రాజీనామ చేశారు. త‌న తండ్రి నంద‌మూరి తార‌క రామారావు తెలుగు జాతి ఎప్పుడు ఐక్యంగా ఉండాల‌ని కోరుకున్నార‌ని, కాని ఇప్పుడు ప‌రిస్థితులు అలా లేవ‌ని, కొంద‌రు త‌మ స్వార్థం కోసం రాష్ట్రాన్ని రావ‌ణ కాస్టంగా మార్చార‌ని, అలాంటి స్వార్ధప‌రుల కుట్రల‌కు తెలుగు జాతి బ‌లైపోయింద‌ని హరికృష్ణ ఆవేద‌న వ్యక్తం చేశారు. ఈ రోజు ఉద‌యం ఎన్టీఆర్ ఘాట్‌ను సంద‌ర్శించిన ఆయ‌న‌, త‌న తండ్రి స‌మాధి సాక్షిగా రాజీనామ ప‌త్రంపై సంత‌కం చేశారు. రాష్ట్ర విభ‌జ‌న‌ను తాను వెతిరేఖించ‌డం లేద‌న్న హరికృష్ణ కాంగ్రెస్ పార్టీ సీమాంద్ర ప్రాంతంలో అనుస‌రించిన వైఖ‌రికి నిర‌స‌న‌గానే రాజీనామా చేస్తున్నాఅన్నారు. గ‌తంలో శ్రీకృష్ణ క‌మిటీ వేసిన కేంద్ర ఆ క‌మిటీపై ఏనిర్ణయం చెప్పలేదు. హైద‌రాబాద్ విష‌యంలో స్పష్టత ఇవ్వలేదు. సీమాంద్రకు రాజ‌ధానిని చూపించ‌లేదు అయినా నాలుగు నెల‌ల్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామ‌నటం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం అన్నారు. కాంగ్రెస్ త‌న స్వార్ధ రాజ‌కీయాల కోస‌మే తెలుగు జాతిని చీల్చింద‌న్న హరికృష్ణ, సోనియా అనే దుష్ట శ‌క్తి వ‌ల్లే రాష్ట్రం రెండుగా విడిపోతుంది అన్నారు.

ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్‌లు రాజీనామ చేయాలి

  స‌మైక్యాంద్ర కోసం ఎలాంటి త్యాగాల‌కైనా ముందుకు రావాల‌ని సీమాంద్ర మంత్రులు ఎమ్మెల్యేలు ప‌ట్టుప‌డుతున్నారు. ఈ విష‌యంపై శ‌నివారం సాయంత్రం ముఖ్యమంత్రి, పీసిసి చీఫ్ ల‌తో స‌మావేశం అయిన సీమాంద్ర ప్రజా ప్రతినిధులు, మంత్రులు ముఖ్యమంత్రి పిసిసి చీఫ్‌ల రాజీనామాల‌కు కూడా ప‌ట్టుప‌ట్టిన‌ట్టుగా స‌మాచారం. రాష్ట్రంలో రాజ‌కీయ సంక్షోభం సృష్టించి అయినా స‌రే స‌మైఖ్యాంద్రను కాపాడుకోవాల‌ని వారు భావిస్తున్నారు. ఈ సమావేశంలో 20 మంది సీమాంద్ర మంత్రులు, 43 మంది శాస‌స‌స‌భ్యులు, 15 మంది ఎమ్మెల్సీ పాల్గొన్నారు. ఈ స‌మావేశంలో పాల్గొన్న నేత‌లు రెండు తీర్మానాలు చేశారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనే రాష్ట్రం విడిపోవ‌డానికి అంగీక‌రించ‌కూడ‌దంటూ ఏక వాఖ్య తీర్మానం చేసిన నాయ‌కులు, సిడ‌బ్ల్యూసిలో తీసుకున్న ప్రత్యేక రాష్ట్ర నిర్ణయం వెన‌క్కి తీసుకునే వర‌కు నిర‌స‌న‌లు కొన‌సాగించాల‌ని తీర్మానించారు. అధిష్టానం పై ఒత్తిడి తీసుకురావ‌డం కోసం ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్ ల రాజీనామాల‌తో పాటు ల‌క్ష మందితో ఓ భారీ మార్చ్ నిర్వహించాల‌ని స‌భ్యులు అభిప్రాయ‌ప‌డ్డారు. హైదరాబాదును శాశ్వతంగా ఉమ్మడి రాజధానిగా చేయడం, కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం, దేశానికి రెండో రాజధానిగా చేయడం లాంటి విష‌యాలుపై ఈ స‌మావేశంలో చ‌ర్చజ‌రిగిన‌ట్టుగా స‌మాచారం.