మళ్లీ స్వరం మారింది
posted on Aug 4, 2013 @ 7:52PM
ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో కెసిఆర్‌ది ప్రత్యేకమైన శైలి, ఎంతటి వారినైన ఏ మాట పడితే ఆ మాట అనడం తరువాత అబ్బే నా ఉద్దేశ్యం అది కాదు అంటూ మాట మార్చడం ఆయనకు మాత్రమే చెల్లింది. అప్పట్లో తెలంగాణ జాగో ఆంద్రా వాల బాగో అంటూ నినాదాలు ఇచ్చిన కెసిఆర్ తరువాత అబ్బే నా ఉద్దేశ్యం అది కాదు అంటూ బుకాయించారు.
తరువాత తెలంగాణ ప్రకటనతో కెసిఆర్ వ్యాఖ్యల కోసం ఎదురు చూసి వారికి ఆయన ఓ గౌతమ బుద్దునిలా కనిపించారు. అన్ని ప్రాంతాల వారు తెలంగాణలో ప్రశాంతంగా ఉండవొచ్చు అన్న ఆయన అందరిని మా సొంత వారిలా చూసుకుంటామని భరోసా కూడా ఇచ్చారు. కాని ఈ స్టేట్‌మెంట్ ఇచ్చి 48 గంటలు కూడ గడవక ముందే కెసిఆర్ మరోసారి మాట మార్చారు. ఆంద్రా ఉద్యోగులు ఆంద్రాకు వెళ్లిపోవాల్సిందే అని హుకుం జారి చేశారు.
అయితే కెసిఆర్ చేసిన ఈ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో భారీ దుమారమే రేగింది. దీంతో మరో సారి నష్ట నివారణ చర్యలకు దిగాడు కెసిఆర్. ప్రెస్‌మీట్ పెట్టి మరి తన చేసిన వ్యాఖ్యలలోని అసలు అర్ధాన్ని వివరించాడు. అంతే కాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డ తరువాత తెలంగాణ పునర్‌నిర్మణం కోసం తను ఎలాంటి ప్రణాలికలను సిద్దం చేస్తున్నాడో కూడా ప్రజలకు వివరించాడు.
అయితే రోజుకో రకంగా మాట్లాడుతున్న కెసిఆర్ వ్యాఖ్యలను సమర్ధించలేక సొంత పార్టీ నాయకులే తలలు పట్టుకుంటున్నారు.