ఎన్టీఆర్ సమాది సాక్షిగా సీతయ్య రాజీనామ
posted on Aug 4, 2013 @ 11:39AM
సీమాంద్ర జిల్లాలల్లో జరుగుతున్న సమైక్య ఉద్యమానికి మద్దతుగా ఎన్టీఆర్ తనయుడు, టిడిపి రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ రాజీనామ చేశారు. తన తండ్రి నందమూరి తారక రామారావు తెలుగు జాతి ఎప్పుడు ఐక్యంగా ఉండాలని కోరుకున్నారని, కాని ఇప్పుడు పరిస్థితులు అలా లేవని, కొందరు తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని రావణ కాస్టంగా మార్చారని, అలాంటి స్వార్ధపరుల కుట్రలకు తెలుగు జాతి బలైపోయిందని హరికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ రోజు ఉదయం ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించిన ఆయన, తన తండ్రి సమాధి సాక్షిగా రాజీనామ పత్రంపై సంతకం చేశారు. రాష్ట్ర విభజనను తాను వెతిరేఖించడం లేదన్న హరికృష్ణ కాంగ్రెస్ పార్టీ సీమాంద్ర ప్రాంతంలో అనుసరించిన వైఖరికి నిరసనగానే రాజీనామా చేస్తున్నాఅన్నారు. గతంలో శ్రీకృష్ణ కమిటీ వేసిన కేంద్ర ఆ కమిటీపై ఏనిర్ణయం చెప్పలేదు. హైదరాబాద్ విషయంలో స్పష్టత ఇవ్వలేదు. సీమాంద్రకు రాజధానిని చూపించలేదు అయినా నాలుగు నెలల్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామనటం ఎంత వరకు సమంజసం అన్నారు.
కాంగ్రెస్ తన స్వార్ధ రాజకీయాల కోసమే తెలుగు జాతిని చీల్చిందన్న హరికృష్ణ, సోనియా అనే దుష్ట శక్తి వల్లే రాష్ట్రం రెండుగా విడిపోతుంది అన్నారు.