పార్లమెంట్ ను తాకిన సమైఖ్య సెగ, సభలువాయిదా
posted on Aug 5, 2013 @ 12:16PM
లోక్‌సభలో విభజన మంటలు చెలరేగాయి. సోమవారం ఉదయం లోక్‌సభ ప్రారంభంకాగానే సీమాంధ్ర టీడీపీ ఎంపీలు విభజనపై వాయిదా తీర్మానం ఇచ్చారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర ఎంపీలు నినాదాలు చేశారు. తమ ప్రాంత ప్రయోజనాలు పరిరక్షించాలని టీడీపీ ఎంపీలు స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. టీడీపీ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. సీమాంధ్ర ఎంపీలకు పోటీగా తెలంగాణ ఎంపీలు నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ సభను వాయిదా వేశారు.
రాజ్యసభ సోమవారం ప్రారంభమైన వెంటనే విభజన నినాదాలతో మధ్యాహ్నానికి వాయిదా పడింది. రాజ్యసభలో విభజనకు వ్యతిరేకంగా సమైక్యవాదులు నినాదాలు చేశారు. దీంతో సభలో గందగోళం నెలకొనడంతో రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.